E-Paper
Advertisement

బిగ్ బాస్ దేబ్‌జనీ నటించిన సినిమాలివే.. అలాంటి సీన్లు చేస్తుందని అస్సలు ఊహించి వుండరు!

బిగ్ బాస్ దేబ్‌జనీ నటించిన సినిమాలివే.. అలాంటి సీన్లు చేస్తుందని అస్సలు ఊహించి వుండరు!
Advertisement

Bigg Boss 10 Debjani Modak: తెలుగు బుల్లితెరపై ‘వేద’, ‘సత్య’ పాత్రలతో అచ్చతెలుగమ్మాయిలా మారిపోయి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ దేబ్‌జనీ మోదక్. చూడటానికి పద్దతిగా, సాంప్రదాయంగా కనిపించే ఈ బెంగాలీ భామ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి హౌస్‌లో తన హవా కొనసాగిస్తోంది. అయితే సీరియళ్లలో ఎంతో పద్ధతిగా కనిపించే దేబ్‌జనీ, తన కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలు, ఆశ్చర్యపరిచే పాత్రల గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

టెలివిజన్‌కు ముందు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ :

బుల్లితెరపై స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోకముందు దేబ్‌జనీ మోదక్ బెంగాలీ చిత్ర పరిశ్రమ ద్వారా తన నటన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2013లో విడుదలైన ‘నాకౌట్’ సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె ‘రూహి సేన్’ అనే కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ‘గ్యాంగ్‌స్టర్ కింగ్’ (2014), ‘క్లాప్ స్టిక్’ (2016) వంటి సినిమాల్లోనూ నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

మొదటి సినిమాలోనే ఊహించని రొమాన్స్ :

Advertisement

ఇప్పుడు సీరియళ్లలో పద్ధతిగా కనిపించే దేబ్‌జనీ, తన తొలి సినిమా ‘నాకౌట్’లో మాత్రం అందరూ ఊహించని విధంగా బోల్డ్‌గా కనిపించారు. ఇక ఈ చిత్రంలో హీరోతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడమే కాకుండా, రొమాంటిక్ సాంగ్స్‌లోనూ అప్పట్లో రెచ్చిపోయి నటించారు. ఆ చిత్రంలో ఆమె చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, గ్లామరస్ లుక్స్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలు చూసిన వాళ్లు ఇప్పుడు ఈమెనేనా అని ఆశ్చర్యపోన్నారు.

దేవతల పాత్రల నుంచి స్టార్ హీరోయిన్‌ వరకు:

సినిమాలతో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ ఆమెకు అసలైన గుర్తింపు మాత్రం టీవీ సీరియల్సే తెచ్చిపెట్టాయి. కెరీర్ ఆరంభంలో బెంగాలీలో ‘సరస్వతీ దేవి’, ‘సతీదేవి’, ‘ద్రౌపది’ వంటి శక్తివంతమైన పౌరాణిక దేవతల పాత్రల్లో నటించి అభినేత్రిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితులయ్యారు.

Advertisement

ALSO READ: స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?

నిరంజన్ బి.ఎస్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ :

తెలుగు సీరియళ్లలో నటుడు నిరంజన్ బి.ఎస్‌తో కలిసి దేబ్‌జనీ చేసిన ఆన్-స్క్రీన్ జోడీకి బుల్లితెరపై ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌లోని ఆమె అద్భుత నటనకు గానూ ఉత్తమ నటి, ఉత్తమ భార్య కేటగిరీలలో పలు ప్రాంతీయ టీవీ అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. నటనపై మక్కువతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బిగ్ బాస్ హౌస్ వరకు చేరుకున్నారు…

ఇక సినిమాల్లో బోల్డ్ అండ్ రొమాంటిక్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బుల్లితెరపై దేవతలుగా, పద్ధతైన ఇళ్ల మనుషులుగా మెప్పించిన దేబ్‌జనీ మోదక్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక సినిమాల్లో ఆశ్చర్యపరిచే గ్లామర్ పాత్రలు చేసిన ఈ భామ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి..

Related News

రూ.15 లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్..ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

Big Stories

Advertisement
×