E-Paper
Advertisement

దేశ ఎన్నికల సంఘం లొసుగులు బైటపెట్టిన రితికా చోప్రా సక్సెస్ స్టోరీ ఇదే!

దేశ ఎన్నికల సంఘం లొసుగులు బైటపెట్టిన రితికా చోప్రా సక్సెస్ స్టోరీ ఇదే!
Advertisement

Ritika Chopra: అరవడమే జర్నలిజం అనుకుంటున్న కాలం ఇది. నిఖార్సైన జర్నలిస్టులకు కాని కాలం కూడా ఇది. కానీ ప్రతి చీకటి వెనుక వెలుగుంటుంది. నిశ్శబ్దం కూడా పెను తుపానై విరుచుకుపడుతుంది. కోల్‌కతాకు చెందిన రితికా చోప్రా 2006లో హిందుస్తాన్ టైమ్స్‌లో జర్నలిజం ఇంటర్న్‌గా చేరారు. 2007లో ఢిల్లీ చేరిన ఆమె క్రమంగా రిపోర్టర్‌గా ఎదిగారు. కొంతకాలం ఎకనమిక్ టైమ్స్‌లో పనిచేసిన రితికా 2015లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరారు.

ఏళ్ల తరబడి నిశ్శబ్దం..

అప్పటికే పొలిటికల్ వార్తా సేకరణతో పాటు, ప్రభుత్వ నిర్ణయాల వెనకుండే ఆర్ధిక అంశాలు, విధానపరమైన ఇష్యూస్‌పై పట్టు సంపాదించారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం పనితీరుపై ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా పనిచేశారు రితికా. ఎన్నికల సంఘం పనితీరు, ఎలక్టోరల్ అడ్మినిస్ట్రేషన్‌పై ఫోకస్ ఆమె పనిలో ప్రధానభాగంగా మారింది. ఆమె పనితీరుకు 2021లోనే రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు అందుకున్నారు.

Advertisement

Also Read: 20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

UNFPA-లాడ్లీ మీడియా అవార్డు..

చదువులేని అభ్యర్ధులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే హర్యానా చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె రాసిన నివేదికకు గాను, 2018లో UNFPA-లాడ్లీ మీడియా అవార్డు అందుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల కవరేజ్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రత్యేక అవార్డు అందుకున్నారు రితికా. అవార్డుల్ని పక్కనపెడితే ప్రస్తుతం ఎన్నికల సంఘంలో లొసుగుల్ని బయటపెట్టి ప్రజల రివార్డు అందుకుంటున్నారు ఆమె. రితికా రాసిన రిపోర్ట్… దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్థాయిలో ఇప్పుడు నిరసనలు జరుగుతున్నాయి.

భారీ కుంభకోణాలు..

Advertisement

బోఫోర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన చిత్రా సుబ్రమణ్యం, హర్షద్ మెహతా స్కామ్‌ను ప్రపంచానికి చెప్పిన సుచేతా దళాల్‌ను ఈ సందర్భంగా జనం గుర్తుచేసుకుంటున్నారు. మొత్తంగా ఈ మూడు అంశాల్లోనూ మహిళా జర్నలిస్టులు చూపించిన తెగువ అందరికీ ఆదర్శం కావాలంటున్నారు.

Also read: ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

Tags

Related News

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

కేసీఆరే రావాలి… కేసీఆరే కావాలి..! మరి కేటీఆర్ ఏం కావాలి..? షాడో సీఎంగానే ఉండాల్నా..!? సీఎం అయ్యే యోగం లేదానే బాపూ..!

అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం.. అడుగు వేయాలంటే జంకుతున్న జనం!

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

Big Stories

Advertisement
×