E-Paper
Advertisement

స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?

స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?
Advertisement

Actress Snigdha:చూడగానే షర్టు, ప్యాంట్ , క్రాప్ హెయిర్ తో అచ్చం అబ్బాయిలా కనిపించే స్నిగ్ధ నయని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. పలువురు స్టార్ హీరోల చిత్రాలలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతో అందరినీ ఆకట్టుకునే స్నిగ్ధ.. ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రముఖ నటి దివ్య చౌదరిని పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియో విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చిన ఈమె.. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో సందడి చేస్తూ ఎన్నో విషయాలు పంచుకుంది. అందులో భాగంగానే తన చేతులపై ఉండే టాటూల గురించి చెప్పిన ఈమె.. ముఖ్యంగా ఒక స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్ ను తన ఎడమ చేతిపై టాటుగా వేయించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆటోగ్రాఫ్ టాటూ వెనుక సెంటిమెంట్ :

తన చేతిపై ఉన్న టాటూ గురించి చెబుతూ.. చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్‌లో సింగర్ చిత్ర గారిని రిక్వెస్ట్ చేసి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నానని తెలిపారు. “మొదట చేతి మీద ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగితే..ఎందుకు అని చిత్ర గారు ఆశ్చర్యపోయారు . ఏం పర్లేదు మా అమ్మ చెయ్యి భుజం పైన ఉంది. మీ పాటల్ని వింటూ పెరిగాను.. మీ పాటలను నేర్చుకొని పాడుతూ నేను పర్ఫామెన్స్ ఇస్తున్నాను. అలాంటిది నేను కంపోజ్ చేసిన మ్యూజిక్ కి మీరు పాడడం నిజంగా నా జీవితంలో గొప్ప సందర్భం. అందుకే ఈరోజు నేను చిరస్థాయిగా గుర్తుండిపోయేలా నా చేతిపై పెర్మనెంట్ టాటుగా వేయించుకుంటాను. మీరు సైన్ చేయండి అని అడిగాను . “బెస్ట్ విషెస్ చిత్ర గారు.. 29.7.2025″ అని ఉంటుంది”. ఆమె పాటలతోనే తాను పెరిగానని, ఆ జ్ఞాపకం శాశ్వతంగా ఉండాలని ఆమె సంతకం చేసిన తేదీతో సహా చేతిపై పర్మినెంట్ టాటూ వేయించుకున్నానని ఎంతో మురిసిపోయారు.

కుటుంబానికి దూరంగా ఉండటంపై స్పందన:

Advertisement

తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. కుటుంబంతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని, కానీ తన తండ్రి హాస్పిటల్ బిజీ కారణంగా అక్కడే ఉంటున్నారని చెప్పారు. నాన్నను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక తనే అప్పుడప్పుడు రాజమండ్రికి వెళ్లి రెండు రోజులు ఆయన దగ్గరే ఉండి వస్తానని తెలిపారు.

ALSO READ: వయసు పెరిగినా యాక్టివ్‌గా ఉండాలా? డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన హెల్త్ సీక్రెట్స్ ఇవే!

గడ్డం, మీసం రావడం వెనుక అసలు నిజం..

Advertisement

అలాగే తన గడ్డం, మీసం రావడం వెనుక ఉన్న అసలు నిజం గురించి చెబుతూ.. పీసీఓడీ సమస్య వల్ల అలా వచ్చిందని, దానిని తాను ఇంట్లోనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానని తన ఆరోగ్యం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. మొత్తానికి అయితే సింగర్ కం నటి స్నిగ్ధ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?

నాని, నేను మూతులు నాక్కుంటాం.. శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ వైరల్

నాని ‘ది ప్యారడైజ్ ‘ మూవీలో కేసీఆర్ ను అవమానించారు: కవిత

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ అసభ్యకర సీన్ .. సోషల్ మీడియాలో నిరసన సెగ!

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

Big Stories

Advertisement
×