E-Paper
Advertisement

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా
Advertisement

Musical Comedy Drama: ఓ పెళ్లిలో పాడే గాయకుడికి ఓ మాజీ పాప్ స్టార్ పరిచయమవుతాడు. ఇద్దరూ కలిసి రాత్రంతా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు. ఆ సమయంలో పాడిన ఓ పాట… కొన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతుంది. కానీ ఆ పాట పాడిన స్టార్‌ ది కాదు… తనదే అని అసలు రచయిత చెబితే ? పేరు కోసం మొదలైన పోరాటం చివరికి స్నేహం, కుటుంబం, కెరీర్ అన్నింటినీ ప్రమాదంలోకి నెట్టేస్తే ? సంగీత ప్రపంచంలోని మరో కోణాన్ని చూపించే మూవీనే ‘పవర్ బాలాడ్’ (Power Ballad). మరి ఈ మ్యూజికల్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

డబ్లిన్‌ లో వెడ్డింగ్ బ్యాండ్‌ లో సింగర్‌ గా పని చేస్తుంటాడు రిక్ పవర్. ఒకప్పుడు పెద్ద మ్యూజిక్ స్టార్ కావాలన్నది అతని కల. కానీ పెళ్లి, కుటుంబ బాధ్యతలతో ఆ కలను పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు పెళ్లిళ్లలో పాటలు పాడుతూ కుటుంబంతో సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ పెళ్లి కార్యక్రమంలో రిక్‌ కు డ్యానీ విల్సన్ పరిచయమవుతాడు. ఒకప్పుడు బాయ్‌ బ్యాండ్‌ తో పెద్ద స్టార్‌ గా పేరు తెచ్చుకున్న డ్యానీ ఇప్పుడు సోలో కెరీర్‌ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొత్త ఆల్బమ్ కోసం మంచి పాట కోసం వెతుకుతున్న అతడికి రిక్‌ తో జరిగిన పరిచయం కొత్త మలుపు తీసుకొస్తుంది.

Advertisement

ఇద్దరూ కలిసి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ రాత్రంతా గడుపుతారు. ఆ సమయంలో రిక్ తన మనసుకు చాలా దగ్గరైన ఓ ఒరిజినల్ పాటను డ్యానీకి వినిపిస్తాడు. ఆ పాట వెనుక ఉన్న భావోద్వేగం డ్యానీని ఆకట్టుకుంటుంది. అయితే రిక్‌ కు తెలియకుండా ఆ పాట రికార్డింగ్ డ్యానీ చేతుల్లోకి వెళ్తుంది. కొంతకాలం తర్వాత అదే పాట డ్యానీ పేరుతో విడుదలవుతుంది. ఊహించని విధంగా అది భారీ హిట్ అవుతుంది. డ్యానీ కెరీర్ మళ్లీ ఒక్కసారిగా పుంజుకుంటుంది. కానీ తన పాటను మరో వ్యక్తి తన పేరుతో విడుదల చేశాడని తెలుసుకున్న రిక్ షాక్ అవుతాడు.

తానే ఆ పాట రాశానని చెబుతున్నా, దాన్ని నిరూపించడానికి సరైన ఆధారం లేకపోవడంతో ఎవరూ అతని మాట నమ్మరు. దీంతో రిక్ పట్టుదలగా తనకు రావాల్సిన గుర్తింపు కోసం పోరాటం మొదలుపెడతాడు. ఈ ప్రయత్నంలో అతని బ్యాండ్ కెరీర్ దెబ్బతింటుంది. కుటుంబంతో కూడా విభేదాలు మొదలవుతాయి. చివరికి తన పాటకు క్రెడిట్ తెచ్చుకోవడానికి లాస్ ఏంజెల్స్ వరకు వెళ్లాల్సి వస్తుంది. మరి అక్కడైనా ఆ పాట తనదే అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ?

Advertisement

పాల్ రడ్ (Paul Rudd), నిక్ జోనస్ (Nick Jonas), హవానా రోజ్ లియు, జాక్ రేనర్ నటించిన ఈ మ్యూజికల్ కామెడీ డ్రామాకు జాన్ కార్నీ (John Carney) దర్శకత్వం వహించారు. సంగీతం, స్నేహం, ఆత్మగౌరవం, పేరు కోసం జరిగే పోరాటం ప్రధాన అంశాలుగా ఈ సినిమా సాగుతుంది. మ్యూజిక్ లవర్స్ కు పక్కా వర్త్ వాచింగ్ మూవీ. సెప్టెంబర్ 26 నుంచి Starzలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగులో లేదు.

Read Also: మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

Tags

Related News

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

ఒక్క రాత్రి బేబీసిట్టింగ్ అనుకుంటే ఊహించని తలనొప్పి… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్

Big Stories

Advertisement
×