E-Paper
Advertisement

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో
Advertisement

Malayalam Horror Comedy: హాస్టల్‌ లో ఫ్రెండ్స్‌ తో సరదాగా గడపాలని రూమ్ తీసుకుంటే… అక్కడ దెయ్యం కూడా తమతో పాటు వచ్చిందని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? తెల్లవారుజామునే నిద్రలేపే వార్డెన్, సీనియర్ల పనిష్మెంట్లు, ముగ్గురు స్నేహితుల అల్లరి మధ్యలో ఒక పాడుబడిన దేవాలయం కనిపిస్తే ? అక్కడ నిద్రిస్తున్న అలౌకిక శక్తిని పొరపాటున మేల్కొలిపితే… ఆ దెయ్యం వాళ్లను వదిలి పెడుతుందా ? ఇలాంటి హారర్‌ తో పాటు నవ్వించే సన్నివేశాలతో తెరకెక్కిన మలయాళ సినిమా ‘మహారాజా హాస్టల్’ (Maharaja Hostel) ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అరవింద్, వర్కీ, మిథున్ ముగ్గురూ మంచి స్నేహితులు. ప్లస్ టూ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు. కాలేజీ లైఫ్‌ ను ఫుల్‌ గా ఎంజాయ్ చేయాలనుకునే ఈ ముగ్గురూ ఖర్చులు తగ్గించుకోవడానికి కాలేజీకి దూరంగా ఉన్న తక్కువ ధర హాస్టల్‌ లో ఉండాలని నిర్ణయించుకుంటారు. అలా వాళ్లకు మహారాజా హాస్టల్ దొరుకుతుంది. పేరు చూస్తే సాధారణ హాస్టల్‌లానే అనిపించినా… అక్కడి వాతావరణం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. హాస్టల్‌ ను ఎమ్జీఆర్ అనే కఠినమైన వార్డెన్ నిర్వహిస్తుంటాడు.

Advertisement

తెల్లవారుజామున నాలుగు గంటలకే విద్యార్థులను నిద్రలేపడం, చేతిలో బెత్తంతో తిరుగుతూ వారిని భయపెట్టడం అతని స్టైల్. దీంతో ముగ్గురు స్నేహితులకు హాస్టల్‌ లోనే కామెడీ మొదలవుతుంది. అయితే కాలేజీలో సీనియర్లు ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా ఈ ముగ్గురూ ఒక దట్టమైన అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాళ్లకు ఎవరికీ తెలియని ఓ పాత పాడుబడిన దేవాలయం కనిపిస్తుంది. అక్కడ దాగి ఉన్న అలౌకిక శక్తిని పొరపాటున మేల్కొలపడంతో అసలు సమస్య మొదలవుతుంది.

ఆ శక్తి ముగ్గురినీ వెంటాడుతూ మహారాజా హాస్టల్ లోకి వస్తుంది. ఆ తర్వాత లైట్లు ఆరిపోవడం, వస్తువులు వాటంతట అవే కదలడం, రాత్రిళ్లు వింత శబ్దాలు వినిపించడం వంటి భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. సరదాగా ఉండాల్సిన హాస్టల్ ఒక్కసారిగా ప్రాణభయంతో నిండిపోతుంది. మరి అసలు ఈ దెయ్యం ఎవరు ? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎమ్జీఆర్, అరవింద్, వర్కీ, మిథున్ కలిసి ఆ మిస్టరీని ఎలా ఛేదించారు ? అన్నదే మిగతా కథ.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

‘మహారాజా హాస్టల్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (aha) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఆడియోల్లో అందుబాటులో ఉంది. చారు వాకన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీలో అఖిల్ NRD, అఖిల్ షా, శరత్ బాబు, సజిన్ చెరుకయిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. హారర్‌తో పాటు హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also: స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Big Stories

Advertisement
×