Mahesh Babu Next Movie: మాములుగా మీడియం రేంజ్ హీరోల గురించే తెగ ఆలోచిస్తుంటారు మూవీ లవర్స్. ఎవరు ఏ సినిమా చేస్తున్నారు, తర్వాతి సినిమా ఎవరి తో చేయబోతున్నారు అంటూ ఆరాలు తీస్తుంటారు. అలాంటిది టాప్ హీరోల లైనప్ గురించి ఎంత క్యూరియస్‌గా వెయిట్ చేస్తుంటారో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత ఏం సినిమా చేయబోతున్నాడా అన్న ప్రశ్న మూవీ లవర్స్‌లో రైజ్ అవుతుంది.
అయితే ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ముగ్గురు దర్శకులు మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. వాళ్లే సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి, వెంకీ అట్లూరి.
ముందుగా హను రాఘవపూడి విషయానికి వస్తే.. ‘అందాల రాక్షసి’తో ప్రామిసింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హనుకి సాలిడ్ క్రేజ్‌ని తెచ్చింది మాత్రం ‘సీతారామం’ అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌పై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమాతోనే ఏకంగా ప్రభాస్‌తో ‘ఫౌజీ’ సినిమాని పట్టేశాడు హను.
ఇక ఈ సినిమా ఈ ఏడే డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. ఇక దీని తర్వాత మహేష్ కోసం సినిమా కథ రెడీ చేసి.. ‘వారణాసి’ అయ్యాక మహేష్‌తో సినిమా చేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. ఇక వీరిద్దరూ కలిస్తే మరో న్యూ ఏజ్ స్టోరీ కూడా ఆడియన్స్‌కి అందే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది.
ఈ లైనప్‌లో వినిపిస్తున్న మరో పేరు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’తో ఎంట్రీ ఇచ్చి, ‘కబీర్ సింగ్’తో ప్రూవ్ చేసుకుని, ‘యానిమల్’ సినిమాతో పాతుకుపోయిన వంగా.. తన తర్వాతి సినిమాని మహేష్‌తో చేయబోతున్నాడన్న గుసగుసలు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే సినిమా మహేష్ బాబుతోనే చేయాల్సి ఉందన్న టాక్ కూడా వినబడింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాని చేస్తున్న వంగా.. దీని తర్వాత మహేష్ బాబుతో ‘డెవిల్’ అనే సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ‘యానిమల్’ సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ కూడా సందీప్ లైనప్‌లో ఉందట. మరి వీటిలో ఏది ఆల్ బోర్డ్ అవుతుందో వంగానే ఓపెన్ చేయాలి.
ఇక ముచ్చటగా ఈ లైనప్‌లో ఉన్న మూడో డైరెక్టర్ పేరు వెంకీ అట్లూరి. ‘తొలిప్రేమ’తో పలకరించి.. తెలుగు వాళ్లు అచ్చి రాలేదంటూ ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ ఫిలిమ్స్‌తో ధనుష్, దుల్కర్‌లకు సాలిడ్ హిట్స్ ఇచ్చిన వెంకీ.. ఇప్పుడు సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’ అనే మరో సినిమాతో ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు.
ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా తన తర్వాతి సినిమాని మహేష్ బాబుతో చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. నిజంగా వెంకీ మహేష్‌తో సినిమా చేస్తే అది మరో క్లాసిక్ అవ్వడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ మొత్తం ‘వారణాసి’పైనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇక దీనికి డైరెక్టర్ జక్కన్న కావడంతో మహేష్ ఇప్పుడే తన తర్వాతి సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉండదు.
also read :‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా?.. వీడియో చూస్తే షాకే!
ఏది ఏమైనా ‘వారణాసి’ సినిమా పూర్తయిన తర్వాతే మహేష్ తన తర్వాతి సినిమాపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా, వెంకీ అట్లూరి పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చూడాలి మరి ఈ ముగ్గురు డైరెక్టర్స్‌లో బాబు గారు ఎవరితో జట్టు కడతారో !