E-Paper
Advertisement

27 ఏళ్లుగా దాచిన నిజం… తల్లి రీఎంట్రీతో కూతురి జీవితంలో ఊహించని ట్విస్ట్

27 ఏళ్లుగా దాచిన నిజం… తల్లి రీఎంట్రీతో కూతురి జీవితంలో ఊహించని ట్విస్ట్
Advertisement

Family Drama on OTT : 27 ఏళ్లుగా తన తల్లికి దూరంగా ఉంటూ, గతాన్ని పూర్తిగా మర్చిపోయాననుకున్న ఓ మహిళ జీవితంలోకి తల్లి అకస్మాత్తుగా తిరిగి వస్తే ఏం జరుగుతుంది ? పైగా ఆమె వెంట తీసుకొచ్చిన ఒక రహస్యం, ఇన్నేళ్లుగా తాను నమ్మిన నిజాలన్నింటినీ తలకిందులు చేస్తే ? ఇలాంటి ఆసక్తికరమైన ఎమోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫిలిపినో ఫ్యామిలీ డ్రామా సినిమా ‘దిస్, దట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్’ (This, That and Everything in Between). మరి ఈ ఎమోషనల్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జోయాన్ ఒక సక్సెస్ ఫుల్ టెలివిజన్ రైటర్. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి, ఎంతో కష్టపడి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటుంది. ఇతరుల జీవితాల గురించి కథలు రాసే ఆమెకు, తన కథలోని పాత్రలకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో నిర్ణయించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ నిజ జీవితంలో మాత్రం గతం నుంచి పూర్తిగా తప్పించుకోవడం అంత సులభం కాదు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న జోయాన్ జీవితంలోకి 27 ఏళ్ల తర్వాత ఆమె తల్లి పాజ్ ఊహించని విధంగా తిరిగి వస్తుంది.

Advertisement

ఇన్నేళ్లుగా తల్లికి దూరంగా ఉన్న జోయాన్‌కు ఈ పరిణామం మొదట్లోనే ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. తల్లితో తనకున్న అనుబంధం ఎందుకు తెగిపోయింది, ఇన్నేళ్లుగా ఆమె ఎక్కడ ఉంది? అసలు ఎందుకు తన జీవితానికి దూరంగా ఉంది ? అనే ప్రశ్నలు మళ్లీ మొదలవుతాయి. అయితే పాజ్ కేవలం తన కూతురిని కలవడానికి మాత్రమే తిరిగి రాలేదు. 27 ఏళ్లుగా తనలోనే దాచుకున్న ఒక షాకింగ్ రహస్యాన్ని కూడా ఆమె వెంట తీసుకొస్తుంది.

ఆ రహస్యం బయటకు వచ్చిన తర్వాత జోయాన్ ఇప్పటి వరకు నమ్మిన కొన్ని నిజాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారతాయి. తన గతం గురించి, తన తల్లి గురించి, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆమెకు కొత్త కోణం కనిపిస్తుంది. అసలు పాజ్ ఇన్నేళ్లుగా దాచిన ఆ రహస్యం ఏంటి? జోయాన్ జీవితంలో జరిగిన విషయాలకు దానితో సంబంధం ఏమిటి? తల్లికూతుళ్ల మధ్య ఇన్నేళ్లుగా పేరుకుపోయిన బాధ, కోపం, అపార్థాలు తొలగిపోతాయా ? ఒకరినొకరు క్షమించుకుని మళ్లీ కుటుంబంగా కలిసిపోగలరా ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : నేలపైకి చూస్తే చావే.. 2000 అడుగుల ఎత్తులో అమ్మాయి నరకయాతన… ఈ సినిమా చూస్తే గుండె ఆగిపోతుంది

తెలుగులో స్ట్రీమింగ్ ?

చోలో లారెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోడి స్టా. మారియా, అగోట్ ఇసిడ్రో ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబ బంధాలు, గతం తాలూకు గాయాలు, క్షమాపణ, తల్లికూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాలను ప్రధానంగా చూపించే ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, కుటుంబ రహస్యాల చుట్టూ తిరిగే కథలను ఇష్టపడేవారు ‘దిస్, దట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్’ సినిమాను మిస్ అవ్వొద్దు. ప్రస్తుతం ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగులో అందుబాటులో లేదు.

Tags

Related News

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

ఫ్యామిలీ అంతా ఫేక్… అందమైన కుటుంబం వెనుక ఇంత పెద్ద మోసమా ?

కొత్త పెళ్లి.. రివర్స్ కాపురం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా!

ఈ బొమ్మను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… సీల్ తొలగించగానే మారణహోమం… తెలుగులో స్ట్రీమింగ్

నాలుగేళ్ల పాప ఆకలితో పోరాడిన కథ… ఈ మూవీని కొట్టే మూవీ ఇప్పటిదాకా రాలేదు భయ్యా

నేలపైకి చూస్తే చావే.. 2000 అడుగుల ఎత్తులో అమ్మాయి నరకయాతన… ఈ సినిమా చూస్తే గుండె ఆగిపోతుంది

ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×