E-Paper
Advertisement

13 ఏళ్లుగా యాంకర్ ప్రదీప్ పై ప్రేమ.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బ్రహ్మముడి సీరియల్ నటి!

13 ఏళ్లుగా యాంకర్ ప్రదీప్ పై ప్రేమ.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బ్రహ్మముడి సీరియల్ నటి!
Advertisement

Pradeep machiraju:బుల్లితెర రంగంపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు (Pradeep machiraju) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ క్వీన్ గా ఎలా అయితే సుమా కనకాల (Suma kanakala) పేరు సొంతం చేసుకున్నారో.. ఇప్పుడు మేల్ విభాగంలో ప్రదీప్ కూడా అంతే పేరు దక్కించుకున్నారు. అద్భుతమైన వాక్చాతుర్యంతో, కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రదీప్.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రదీప్ మళ్లీ మరో చిత్రం చేయలేదు.

13 ఏళ్ల ప్రేమ.. ప్రదీప్ కి లవ్ ప్రపోజల్..

ప్రస్తుతం కొంతకాలం గ్యాప్ తీసుకున్న ప్రదీప్.. ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో హోస్ట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రదీప్ రాకతో షోలో సందడి మరింత పెరిగింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్కిట్ లతో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటోంది. అందులో భాగంగానే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను నిర్వహికులు విడుదల చేయగా.. అందులో ప్రదీప్ కి ఒక అమ్మాయి ఊహించని షాక్ ఇచ్చి, అందరిని ఆశ్చర్యపరిచింది. గత 13 సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమిస్తున్నానని చెప్పిన ఆ అమ్మాయి.. ఏకంగా ప్రదీప్ పేరుతో పచ్చబొట్టు పొడిపించుకొని మరీ అతడికి షాక్ ఇచ్చింది. పైగా ప్రదీప్ తో ఆమె చెప్పే ప్రతి పదం కూడా అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అతనిపై ఇంత ప్రేమ పెంచుకుందా అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. మరి ఆమె ఎవరు? అసలేంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

పచ్చబొట్టుతో లవ్ ప్రపోజల్..

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. ప్రోమో చివరిలో ‘బ్రహ్మముడి’ సీరియల్ నటి నైనిషా రాయ్(Nainsha rai) మాస్ సాంగ్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఒక గులాబీ పువ్వు తీసుకొని ప్రదీప్ దగ్గరికి వెళ్లి.. “ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను గత 13 సంవత్సరాలుగా ఒక అబ్బాయి మీద క్రష్ పెంచుకున్నాను. ఆ అబ్బాయికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పేముందు ఒకటి చూపించాలని కూడా అనుకుంటున్నాను” అంటూ తన చేతిపై బటర్ఫ్లై తో పాటు “దీప్” అనే పచ్చబొట్టును చూపించింది. అది ఎవరో కాదు ప్రదీప్ అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

also read: ఆ విషయంలో అమల చాలా లక్కీ – నాగార్జున

ఆశ్చర్యంలో ప్రదీప్..

Advertisement

ఇప్పటికీ కూడా మీరు ఎదురుగా నిలబడితే నా గుండె లబ్ డబ్ అంటుంది అంటూ నైనిషా ప్రదీప్ కి చెప్పడంతో.. ప్రదీప్ సైలెంట్ అయిపోయాడు. అసలు ఆమె చెబుతున్న మాటలను విని షాక్ లో ఉన్న ఆయన మీరు చెప్పేది నిజమా అంటూ కూడా ఆమెను మళ్లీ ప్రశ్నించాడు. ఇక అలా ఆ అమ్మాయి 13 ఏళ్లుగా తనను ప్రేమిస్తోందని తెలియడంతో ప్రదీప్ నోట వెంట మాటలు రాలేదు. ఏదో తెలియని సంతోషము.. ఆశ్చర్యంతో కూడిన ఆ చిరునవ్వు అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ప్రదీప్ అమ్మాయి ప్రేమను ఒప్పుకుంటారా? లేదా? అనే విషయం తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×