E-Paper
Advertisement

ఆ విషయంలో అమల చాలా లక్కీ – నాగార్జున

ఆ విషయంలో అమల చాలా లక్కీ – నాగార్జున
Advertisement

Palla burusu:ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పళ్లబురుసు.. ఉదయ్ చౌహాన్ (Uday Chauhan) దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి (Shudhakar reddy), మురళీధర్ గౌడ్(Muralidhar gowd), ప్రజ్వల్ , గోమతి రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

అన్నపూర్ణ స్టూడియోకి 50 ఏళ్ల సందర్భంగా కొత్త నిర్ణయం..

ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము తీసుకున్న నిర్ణయం, అలాగే పళ్ల బురుసు సినిమా కథ డైరెక్టర్ చెప్పినప్పుడు తన మనసులో మెదిలిన అంశాలు ఇలా పలు విషయాలపై నాగార్జున పంచుకున్నారు. ముఖ్యంగా ఆ విషయంలో అమల చాలా లక్కీ అంటూ ఆయన చేసిన కామెంట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.” అన్నపూర్ణ స్టూడియో స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఏదో ఒకటి స్పెషల్ గా చేయాలని అనుకున్నాము. నాన్నగారు స్థాపించిన సంస్థ ఇది.. ఎన్నో సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో ఒకటి చేయాలి అని అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ను ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయించుకున్నాము. నిజానికి ఈ 50 ఏళ్లలో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము కానీ ఇప్పుడు దానిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నాము.

డిస్ట్రిబ్యూషన్ పద్ధతి పై నాగార్జున కామెంట్..

Advertisement

నిజానికి సినిమా స్టార్ట్ అవ్వడానికి నిర్మాతే కారణం.. ఇక సినిమా ఎండింగ్లో కూడా డబ్బులు వస్తే తీసుకునేది కూడా నిర్మాతే.. మేము కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఒక్కొక్కసారి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమాపై పెట్టుబడి పెడితే.. మధ్యలో ఆ డబ్బులు రావు. అది కరెక్ట్ కాదని భావించి నేను యంగ్ గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు.. నాన్నగారు హీరోగా చేసిన సినిమాల పద్ధతిని ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.. అందులో భాగంగానే అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాము.

ALSO READ:ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల

అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో కొత్త సినిమాలు..

Advertisement

ఈమధ్య నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గాయి. సినిమాలు చేస్తూ అందరికీ అవకాశాలు ఇవ్వాలని, మళ్లీ కొత్తగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాము. అలా లెనిన్ రిలీజ్ చేసాము. ఇప్పుడు పళ్ళ బురుసు రిలీజ్ చేయబోతున్నాము..త్వరలో అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. దీని తర్వాత ఇంకో రెండు చిత్రాలు ఉన్నాయి అంటూ తెలిపారు.

ఆ విషయంలో అమలా చాలా అదృష్టవంతురాలు – నాగార్జున

ఈ పళ్ల బురుసు సినిమా గురించి ముందుగా చెప్పాలి. ఎప్పుడూ నాకు ఒక ఆలోచన ఉండేది. తల్లిదండ్రులని మనం చూసుకున్న దానికంటే అదృష్టం ఏదీ ఉండదని.. నా తల్లిదండ్రులను నేను చూసుకున్నాను. మొన్న నేను ఈ చిత్ర డైరెక్టర్ ఉదయ వాళ్లకి కూడా చెప్పాను. అమల తల్లిదండ్రులు ఒకరు 88 , ఒకరు 90. అమల వాళ్ళిద్దర్నీ చూసుకుంటుంది. నేనెప్పుడూ అమలతో అంటూ ఉంటాను. నీ కన్నా అదృష్టవంతురాలు ఎవరు లేరు అని. ఉదయ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది.. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది.. అంటూ చెప్పుకొచ్చారు.

Related News

ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల

నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్!

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ హాట్ బాంబు పేల్చిన హీరోయిన్!

ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. లైంగిక దాడి ఆరోపణల కేసులో!

ప్రియాంక చోప్రా స్పెషల్ ఫోటో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతంటే?

అన్నం పెట్టి.. ఛాతి, మెడపై కాలితో తన్ని హత్య.. దర్శన్ కేసులో సంచలన నిజాలు

మీరు AI క్రియేటర్లా? హైదరాబాద్‌లో EROS సంస్థ ఆడిషన్‌ మిస్ కాకండి, ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×