E-Paper
Advertisement

నకిలీ రాపిడో డ్రైవర్ హల్‌‌చల్.. బండారం బయటపెట్టిన ఓ యువతి! చార్మినార్ వద్ద ఏం జరిగింది?

నకిలీ రాపిడో డ్రైవర్ హల్‌‌చల్.. బండారం బయటపెట్టిన ఓ యువతి! చార్మినార్ వద్ద ఏం జరిగింది?
Advertisement

Charminar: టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలేదో.. నకిలీ లేదో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. అది వస్తువైనా మరొకటి ఏదైనా? నకిలీ రాపిడో డ్రైవర్ రాత్రి వేళ ఓ యువతి వద్ద చేసిన హంగామా అంతాఇంతా కాదు. తనదైన శైలిలో సదరు యువతి రియాక్ట్ కావడంతో ఫేక్ రాపిడో డ్రైవర్ బండారం బట్టబయలైంది. ఈ ఘటన చార్మినార్ సమీపంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?

 

చార్మినార్ వద్ద ఏం జరిగింది?

Advertisement

అసలే వర్షాకాలం.. ఎప్పుడు, ఎక్కడ వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫేక్ రాపిడో రైడర్. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి చార్మినార్ సమీపంలో జరిగింది. ఓ యువతి పట్ల నకిలీ రాపిడో డ్రైవర్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న యువతిని లక్ష్యంగా చేసుకున్నాడు సదరు వ్యక్తి. అతడి బండారాన్ని బయటపెట్టింది ఆ యువతి. దీంతో రాత్రి వేళ ప్రయాణికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

 

నకిలీ రాపిడో డ్రైవర్ హంగామా

Advertisement

సుగంత్ అనే యువతి రాత్రి 9 గంటల సమయంలో చార్మినార్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో టూ వీలర్‌పై ఓ వ్యక్తి వచ్చాడు. ఎక్కడికి వెళ్లాలి మేడమ్.. రాపిడో కావాలా అని అడిగాడు. కొద్ది క్షణాలు ఆలోచించిన ఆ యువతి, రైడర్ వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడం గమనించింది. అంతేకాదు డ్రైవర్ ఐడీ కార్డు లేకపోవడాన్ని గమనించింది. అప్పుటి డౌట్ వచ్చిన ఆ యువతి, ఐడీ కార్డు చూపించాలని గట్టిగా నిలదీసింది. దీంతో కంగారుపడిన రైడర్.. ఆమె ముందు రాపిడో యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం మొదలుపెట్టాడు.

రైడర్ గుట్టు బయటపెట్టిన  యువతి!

అతడు నకిలీ డ్రైవర్ అని గుర్తించింది. వాహనం స్టార్ట్ కావడం లేదంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు. అతడి ఫోన్‌ను పరిశీలించగా యాప్ అప్పుడే లాగిన్ అవుతున్నట్లు కనిపించింది. ఆగ్రహానికి గురైన ఆ యువతి.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించింది. ఈ తతంగాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. బుకింగ్ లేకుండా ధైర్యంగా రైడర్.. బైక్ ఎక్కమనడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని రాసుకొచ్చింది. అయితే వీడియోను షేర్ చేయడం ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేయడం తన ఉద్దేశమని పేర్కొంది.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆ యువతి అప్రమత్తతను ప్రశంసించింది రాపిడో సంస్థ. రైడ్ బుక్ చేయకుండా నేరుగా వచ్చి డ్రైవర్లమని చెప్పేవారిని నమ్మవద్దని సూచన చేసింది. వాహనం ఎక్కే ముందు డ్రైవర్ ఐడీ, వాహనం నంబర్, ఓటీపీ వివరాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలని తెలిపింది. ఈ వ్యవహారం హైదరాబాద్ సిటీలో చర్చ జరుగుతోంది. రాత్రి వేళ తెలియని ప్రాంతాలకు వెళ్తే ఇలాంటి సమస్యలు వస్తాయోనని చర్చించుకంటున్నారు మహిళలు.

?utm_source=ig_embed&ig_rid=AymNs5bOWIzuFrSkgbUyeRJ

 

Related News

హవ్వా.. అర్ధరాత్రి చికెన్ సెంటర్‌లో చోరీ.. కోళ్లతోపాటు దాన్ని కూడా, వైరాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో

కాంగ్రెస్‌కు భారీ షాక్.. అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్‌లోకి ’50’ కుటుంబాలు!

చార్మినార్ వద్ద మహిళకు వింత అనుభవం.. నంబర్ ప్లేట్ లేని బైక్.. నకిలీ ర్యాపిడో డ్రైవర్ గుట్టు రట్టు!

లోన్ ఆఫర్ల పేరుతో మోసాలు.. ఢిల్లీ నెట్‌వర్క్ గుట్టురట్టు.. 21 మంది తెలుగు మహిళలు అరెస్ట్!

ట్రైనీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. సీఐడీ విచారణకు డిమాండ్!

డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఈ కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు!

Big Stories

Advertisement
×