E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: శశిని తీసుకొచ్చి నిజం చెప్పించిన నందు   

Brahmamudi Serial Today Episode August 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: శశిని తీసుకొచ్చి నిజం చెప్పించిన నందు   
Advertisement

Brahmamudi serial today Episode:  రేణు వచ్చి శశి గురించి నిజం చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. కోపంగా రేణును తిడుతూ మంచివాడని నువ్వే కదా పరిచయం చేశావు అంటూ నిలదీయగానే.. అవునే కానీ వాడు నిన్ను చీట్‌ చేయాలనుకున్నాడు. వాడు ఇచ్చే  గిఫ్ట్స్‌కు ఆశపడి అలా చేశాను అని చెప్పగానే.. ఐశ్వర్య కోపంగా నా శశి అలాంటి వాడు కాదు ఇప్పుడు అర్థం అయింది. నాకిప్పుడు పూర్తిగా అర్థం అయింది. ఈ ఇందు నా ఫ్రెండ్‌ను భయపెట్టి ఇలా చెప్పిస్తుంది కదా..? అనగానే.. రేణు లేదు ఐషు వాళ్లు నన్ను భయపెట్టలేదు అని చెప్పినా వినకుండా నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయావు.. నీ మాట కూడా నేను నమ్మను వెళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపో అనగానే.. రేణు వెళ్లిపోతుంది.

నందు కోపంగా నాకు తెలుసే నువ్వు ఎవరు చెబితే నమ్ముతావో వాళ్లనే తీసుకొచ్చాను అంటూ బయటకు వెళ్లి శశిని తీసుకొస్తుంది. చెప్పరా నిజం చెప్పు.. అంటూ నందు చెప్పగానే.. ఐశ్వర్య మాత్రం ఏంటి శశి ఇదంతా నువ్వు నన్ను మోసం చేస్తున్నావంట.. నువ్వు నన్ను లవ్‌ చేయడం లేదంట చెప్పు శశి అని అడగ్గానే.. ఇందు కోపంగా ఏంటి అలా చూస్తున్నావు నిజం చెప్పు అంటుంది ఐశ్వర్య నిజం చెప్పు శశి నువ్వు ఎవ్వరికీ భయపడొద్దు వీళ్లంతా చెప్పేది నిజం కాదని చెప్పు అనగానే.. శశి లేదు ఐషు వాళ్లు చెప్పేది నిజమే నాకు నీ మీద కొంచెం ప్రేమ కూడా లేదు అంటూ చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. అందరూ శశిని తిడుతుంటే.. శశి ఒక్క నిమిషం ఆగండి ఇందు గారు మీరు చెప్పమన్నట్టే చెప్పాను ఇప్పుడు మీకు సంతోషమేనా..? అంటాడు. దీంతో ఇందు, నందు షాక్‌ అవుతారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.

Advertisement

ఇంతలో ఐశ్వర్య… ఏంటి నిన్ను బెదిరించారా..? అని అడగ్గానే.. అవును నిన్న వీళ్లు మనం బర్తుడే పార్టీ జరుపుకునే ప్లేస్‌కు వచ్చారు. నన్ను కొట్టారు. వీళ్లు చెప్పమన్నట్టు చెప్పకపోతే మా ఫ్యామిలీ పరువు తీస్తామని బెదిరించారు అంటూ ఎమోషనల్ అయినట్టు నటిస్తూ.. ఐశ్వర్య దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తాడు. దీంతో ఐశ్వర్య నాకు తెలుసు శశి నువ్వు ఎలాంటి వాడివో.. అని చెప్పగానే.. అవును ఐషు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇప్పటికైనా ఇంట్లో వాళ్లందరికీ ఇదేంటో దీని నిజస్వరూపం ఏంటో తెలిసింది కదా.? ఇది కూడా అచ్చం వీళ్ల అమ్మలాగే పైకి మంచిదానిలా నటిస్తూ.. లోపల మన జీవితాల్ని నాశనం చేయాలని చూస్తుంది అంటూ తిడుతుంటే.. ఇందు కోపంగా ఇంకొక్కసారి మా అమ్మ గురించి మాట్లాడితే బాగుండదు.. అంట వార్నింగ్‌ ఇస్తుంది. ఐషు మాత్రం ఇది నా జీవితం నాకు నచ్చినట్టుగానే ఉంటాను. కాదు కూడదు అనే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. నేను శశిని ఇష్టపడుతున్నాను.. శశినే పెళ్లి చేసుకుంటాను.. శశి నువ్వు వెళ్లు నేను తర్వాత మట్లాడతాను అని చెప్పగానే.. శశి వెళ్లిబోతుంటే.. రేఖ బాబు మా వాళ్లు నీతో బ్యాడ్‌గా బిహేవ్‌ చేశారు సారీ అని చెప్తుంది. శశి వెళ్లిపోతాడు. ఐషు కోపంగా పైకి వెళ్లిపోతుంది.

బయటకు వెళ్లిన శశికి ఇందు వెళ్లి వార్నింగ్‌ ఇస్తే.. నా మీద చెయ్యి చేసుకోవడం కాదు నా నుంచి నీ ఫ్యామిలీని కాపాడుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇందు కోపంగా రూంలోకి వెళ్తుంటే.. రాజు వెళ్లి ఏయ్‌ ఇందు రాత్రి ఇంత జరుగుతుంటే.. నాకు చెప్పకుండా ఏం చేశారు అంటూ తిడుతుంటే.. ఇందు కోపంగా ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అంటూ కోప్పడుతుంటే.. ఏయ్‌ ఇందు నేనేం చేశాను అసలు నన్నెందుకు తిడుతున్నావు అంటే.. నైట్‌ ఈ విషయం తెలియగానే.. ముందు నీకే ఈ విషయం చెప్పాలని నీకే ఫోన్‌ చేశాను.. కానీ ఫుల్లుగా తాగి కాల్‌ కట్‌ చేశావు.. అంటూ తిడుతుంది ఇందు. కూల్‌గా నువ్వేం వర్రీ అవ్వకు ఇందు అంతా నేను చూసుకుంటాను.. తప్పకుండా మరో చాన్స్‌ దొరుకుతుంది అప్పుడు ఆ శశి గాని గురించి ఐషుకు తెలిసేలా చేద్దాం అంటూ భరోసా ఇస్తాడు రాజు.

Advertisement

లక్కీ, రేఖ దగ్గరకు వెళ్లి మా అమ్మ గురించి తెలియడానికి మీరు ఇచ్చిన గడువు ఇంక రెండు రోజులే ఉందని ఏడస్తూ.. దయచేసి మా అమ్మ ఎవరో తెలసుకోండి మేడం అంటూ రేఖ కాళ్ల మీద పడి ఏడుస్తంటాడు. మదన్‌ వచ్చి మీ గురించి తెలుసుకోవడానికి మా అమ్మ కాళ్ల మీద ఏడుస్తావురా అంటూ లక్కీని తిడుతూ.. వాళ్ల అమ్మ గురించి బ్యాడ్‌గా తిడుతుంటే.. లక్కీ కోపంగా మదన్‌ కాలర్ పట్టుకుంటాడు. దీంతో మదన్‌ కోపంగా లక్కీని కొట్టబోతుంటే.. రేఖ అడ్డు పడుతుంది. మదన్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×