Brahmamudi serial today Episode: రాత్రి పూట తాగి దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్ గొడవ చేస్తుంటాడు. ఇంతలో కావ్య వచ్చి మళ్లీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మళ్లీ అదే ప్రశ్న నేను నిన్ను కలిసినప్పటి నుంచి అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నన్ను దూరం పెడుతున్నట్టు పెడుతూనే ఉన్నావు.. కానీ నిన్ను ప్రేమించేలా చేశావు. ప్రేమించమని నేను మిమ్మల్ని అడిగానా..? అంటుంది కావ్య. అదే కదా చెప్తున్నాను. ప్రేమించేలా చేశావు. నువ్వు వద్దన్నా ప్రేమించేశాను. మంచి మనిషిని చూడగానే అభిమానించేస్తాను. మంచి మనసును చూడగానే ప్రేమించేస్తాను అంటాడు రాజ్.
దీంతో కావ్య అది నా తప్పా అని అడుగుతుంది. దీంతో రాజ్ కాదమ్మా నీ తప్పు కానే కాదు. కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా…? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే నువ్వు నన్ను ప్రేమించడం. ఇప్పటికైనా నిజం ఒప్పుకో కళావతి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నేను నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. ఆఫీసులో ప్రాబ్లం అనగానే నీకు సాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు. నీ చెల్లెలు అరెస్ట్ కాకుండా కాపాడితే గుండెలకు హత్తుకున్నావు. ఎందుకు ఇదంతా చేశావు. నా మీద ప్రేమ లేకుండానే ఇన్నాళ్లు నా వెంట ఎందుకు నడిచావు అంటూ రాజ్ అడగ్గానే.. మహానుభావ తప్పై పోయింది. నువ్వు ఈరోజు వచ్చి ఇలా నిలదీస్తావని తెలిసి ఉంటే.. అసలు నీకు దగ్గర అయ్యేదాన్నే కాదు నీతో మాట్లాడేదాన్నే కాదు.. నీతో.. అంటూ ఆపేస్తుంది.
దీంతో రాజ్ చెప్పు కళావతి ఏం మాట పడిపోయింది ఎందుకు నాతో ప్రేమలో పడేదానివే కాదు అని అందామనుకుంటున్నావా..? అదే కదా..? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది కళావతి ఇన్ని రోజులు ఇదే మాట కోసం ఎదురుచూశాను. సరే జరిగిందేదో జరిగింది మర్చిపోదాం. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అంటూ రాజ్ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అవును నాకు తెలుసు.. నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు.. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచిపెట్టినా..? నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్లలేకపోతున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాధ్యతను నేనే తీసుకుంటాను అంటాడు రాజ్.
రుద్రాణి ఇరిటేటింగ్ చూస్తూ వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్టు ఇచ్చాడు. నిజం తెలిస్తే వదిలేసి వెళ్లిపోతాడు అనుకుంటే.. పెళ్లి చేసుకుంటానంటాడేంటి..? అంటుంది. దీంతో రాహుల్ నాకు మాత్రం ఏం తెలుసు మమ్మీ ఇంట్లో రోజుకొకరు ట్విస్టు ఇవ్వడం బాగా అలవాటైపోయింది అంటాడు రాహుల్. ఇంతలో రాజ్ కానీ ఒక్క కండీషన్ ఇప్పటి వరకు నువ్వేంటో నీ గతమేంటో నేనెప్పుడూ అడగలేదు. ఇక భవిష్యత్తులో కూడా అడగాలనుకోవడం లేదు. నీ మీద నమ్మకంతో లైఫ్‌లాంగ్ నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు..? అని రాజ్ అడగ్గానే అందరూ షాక్ అవుతారు. నువ్వు నన్ను మోసం చేయాలి అనుకున్నావా..? లేకపోతే నువ్వే మోసపోయావా..? ఈ రెండు ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు చాలు కళ్లు మూసుకుని నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను అంటూ రాజ్ చెప్పగానే..
రుద్రాణి హ్యాపీగా ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వీడే అని అది చెప్పదు. ఆ నిజం తెలిసే వరకు వీడు పెళ్లి చేసుకోడు అంటుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది మమ్మీ వీళ్లందరూ కలిసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం అంటాడు రాహుల్. రాజ్ నిజం చెప్పు కళావతి అని అడుగుతుంటే.. యామిని వస్తుంది. నువ్వు ఎంత అడిగినా నిజం చెప్పదు బావ ఎందుకంటే తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కళావతి కూడా తెలియదు ఎందుకంటే తాను పబ్బుల్లో తిరిగేది చాలా మందితో కలిసేది అందుకే ఎవరని చెప్పలేకపోతుంది కావచ్చు అంటుంది. దీంతో రాజ్ కూడా నిజం చెప్పు కళావతి లేదంటే యామిని చెప్పిందేనిజం అనుకోవాల్సి వస్తుంది అంటాడు రాజ్.
దీంతో అపర్ణ కోపంగా రాజ్‌ను కొడుతుంది. ఇది నువ్వు తాళి కట్టిన భార్య.. నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా..? నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి. ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే వీళ్లందరూ నీ వాళ్లురా..? కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు అంటూ అపర్ణ చెపగానే.. అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం