Brahmamudi serial today Episode: ప్రసాద్ తన కొడుకును తీసుకుని దుగ్గిరాల ఇంటికి వస్తాడు. రుద్రాణి ఎవరు మీరని అడుగుతుంది. సెక్యూరిటీ అంటూ పిలుస్తుంది. సెక్యూరిటీకి తాము తెలుసని.. సీతారామయ్య గారు కూడా తెలుసని ఆయనే నా కొడుకుని చదివిస్తున్నారని ప్రసాద్ చెప్తాడు. అయితే ఇప్పుడెందుకు వచ్చారు అని రుద్రాణి అడుగుతుంది. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుకు డబ్బులు ఇస్తా అన్నారు అందుకే వచ్చామని ప్రసాద్ చెప్తాడు. ఆయనే హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చు అవుతుంది. నీకు డబ్బులు ఎవరు ఇస్తారు అంటూ ప్రసాద్ ను ఇంట్లోంచి వెళ్లగొడుతుంది.
బయటకు వెళ్లిన ప్రసాద్ తన కొడుకుతో బాధపడకు అని ఓదారుస్తుంటే ఇంతలో రాజ్ వస్తాడు. వాళ్ల మాటలు విని లోపలికి వెళ్లి అత్తా ఎవరు వాళ్లు అని అడుగుతాడు. దారినపోయే దానయ్యలు అంటూ మీ తాత గారు మాటిచ్చారట అందుకో లక్షలు పట్టుకుపోవడానికి వచ్చారు అంటూ వెటకారంగా తిడుతుంది. దీంతో రాజ్ కోపంగా రుద్రాణిని తిట్టి తాతయ్య మాటిచ్చాక నెరవేర్చకపోతే ఎలా అంటూ బయటకు వెళ్తాడు రాజ్. ఇంతలో స్వప్న కోపంగా సుభాష్ అంకుల్ రాహుల్‌ను ఎవరు చదివించారు అని అడుగుతుంది. మా నాన్నే అని చెప్తాడు సుభాష్. అదేంటి ఇలా గతి లేని వాళ్లందరినీ ఇంట్లో పెట్టుకుని చదివించినప్పుడు దారిన పోయే వాళ్లకు సాయం చేస్తే తప్పేంటి..
అని స్వప్న అడగ్గానే ఏయ్ స్టుపిడ్ వాళ్లు మేము ఒక్కటేనా.. అంటూ గద్దిస్తుంది. ఓస్ ఒక్కటే.. కన్నతండ్రి కాకుండా ఇంకొకరి దయాదాక్షిణ్యం మీద నీ కొడుకుకు చదివించి ఇంకొకరికి విద్యాదానం చేస్తుంటే నీ మొగుడి సొమ్ము ఏదో దోచిపెడుతున్నట్లు ఫీలవుతావేంటి అత్త అంటూ తిడుతుంది స్వప్న ఇంతలో రాజ్ వాళ్లను లోపలికి తీసుకొచ్చి మా అత్తయకు ఈ మధ్యనే మతిస్థిమితం తప్పిందని.. ఏదేదో మాట్లాడుతుందని చెప్పి వాళ్లకు కావాల్సిన ఐదు లక్షలు ఇప్పించి పంపిస్తాడు. వాళ్లు వెళ్లాక రుద్రాణి కోప్పడుతుంది. నాకు మతిస్థిమితం లేదా అంటూ గొడవ పెట్టుకుంటుంది. అందరూ రుద్రాణిని తిడుతారు. తర్వాత రాజ్‌ను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి.
హాస్పిటల్ లో సీతారామయ్య దగ్గర ఉన్న కళ్యాణ్‌కు అప్పు ఫోన్ చేస్తుంది. ఐసీయూలోంచి బయటకు వచ్చిన కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను మాట్లాడేది సరస్వతి పుత్రుడితోనేనా అని అడుగుతుంది. దీంతో ఎలా ఉన్నావు పొట్టి అని అడుగుతాడు. బాగానే కానీ నువ్వు ఊరిలోనే ఉన్నావా..? ఎలాగూ నేను లేను కదా అని ఎక్కడికైనా షికార్లకు వెళ్లావా.? అయినా మొగుళ్లు అంతా ఇంతేనా అంటుంది. కళ్యాణ్ పలకకపోయేసరికి సరేలే నా మాటలతో ఇబ్బంది పడ్డావా…? సరే ఎక్కడున్నావు అని అప్పు అడగ్గానే ఈ విషయం పొట్టికి చెప్పకూడదని ఆలోచిస్తుంటే.. హాస్పిటల్‌లో ఎవరో డాక్టర్ అని పిలవగానే ఏంటి కూచి హాస్పిటల్‌లో ఉన్నావా..? అని కంగారుగా అడుగుతుంది. రైటర్ గారికి జ్వరం వస్తే హాస్పిటల్ కు వచ్చామని చెప్తాడు. సరేనని జాగ్రత్తలు ఫోన్ కట్ చేస్తుంది అప్పు.
డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న కావ్య దగ్గరకు సుభాష్ వచ్చి రెండు లక్షలు ఇవ్వమని అడుగుతాడు. సరేనని ఇస్తుంది కావ్య. సుభాష్ డబ్బులు తీసుకుని బయటకు వెళ్లాక ప్రకాష్ వచ్చి ఏదో మర్చిపోయాను అంటూ ఆ గుర్తొచ్చింది. లక్ష రూపాయలు కావాలమ్మా అని అడుగుతాడు. సరేనని ప్రకాష్‌కు లక్ష రూపాయలు ఇవ్వగానే అయోమయంగా ఆలోచిస్తూ వెళ్లిపోతాడు ప్రకాష్. తర్వాత రాహుల్ మెల్లగా నడుచుకుంటూ కావ్య దగ్గరకు వచ్చి 50వేలు కావాలని అడుగుతాడు. కావ్య ఇవ్వనని చెప్పగానే అయితే నేను ధాన్యలక్ష్మీ అత్తను అడుగుతాను అని రాహుల్ బెదిరించగానే సరే ఉండు ఇస్తాను అని లోపలికి వెళ్లి 50 వేలు తీసుకొచ్చి రాహుల్‌కు ఇస్తుంది. నాకు భయపడకపోయినా.. చిన్నత్తయ్యకు భయపడుతున్నావు అది చాలు అనుకుంటూ వెళ్లిపోతాడు.
ఈ ఇంటి పెత్తనం నా వల్ల కావడం లేదు. ఎలాగైనా ఈ పెత్తనం ఆయనకే అప్పజెప్పాలని మనసులో అనుకుంటుంది కావ్య. మరోవైపు వంద కోట్ల సమస్యను ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సాల్వ్ చేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. కావ్య కాఫీ తీసుకుని వచ్చి ఇవ్వబోతుంటే కాఫీ వద్దని ఆల్ రెడీ నా బుర్ర వేడిగా ఉందని చెప్తాడు రాజ్. వెళ్లు ఇక్కడి నుంచి అంటూ కసురుకోవడంతో కావ్య అక్కడి నుంచి అపర్ణ దగ్గరకు వెళ్లి తాళం చేతులు ఇస్తూ.. నేను మోయలేకపోతున్నాను అంటుంది.
దీంతో ఇది మోయడానికి బరువు కాదు. గౌరవం అని చెప్తుంది. అయితే మీ గౌరవం మీ దగ్గరే ఉంచుకోండి అని తాళాలు కింద పెడుతూ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్తుంది. ఇది తాతయ్యగారి ఆర్డర్, అమ్మమ్మగారి అభిలాష అని ఎంత చెప్పినా.. కావ్య వినదు. ఈ తాళాలు నా స్వేచ్చకు సంకేళ్లు ఇప్పుడు హాయిగా ఉంది అంటుంది కావ్య. అసలేం జరిగిందని అపర్ణ అడగ్గానే ఒక్కోక్కరు వచ్చి లక్షల్లో అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఎవరి సొత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు అని కావ్య చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?