E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆప్పుకు వార్నింగ్ ఇచ్చిన ధాన్యలక్మీ  

Brahmamudi Serial Today December 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆప్పుకు వార్నింగ్ ఇచ్చిన ధాన్యలక్మీ  
Advertisement

Brahmamudi serial today Episode:  

అప్పు పోలీస్‌ డ్యూటీకి మళ్లీ వెళ్తుందని తెలిసిన ధాన్యలక్ష్మీ అందరి మీద అరుస్తుంది. దీంతో రాజ్‌, కావ్య అడ్డు వెళ్తారు. దీంతో ధాన్యలక్ష్మీ ఎమోషనల్‌ అవుతూ తన కడుపులో ఉన్న బిడ్డుకు చిన్న ఇబ్బంది కలగకూడదనే కదా తనను ఇంట్లో ఉండమన్నాను. తన ఒంటికి రవ్వంత శ్రమ కలగకూడదనే కదా ఉద్యోగం వద్దన్నాను. పనిలో పడి దాని ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటుందో ననే కదా అ కండీషన్‌ పెట్టింది. ఆవేవి మీకు కనిపించవు.. కానీ నేను ఏదో దాని కోరికను దాని కలను తొక్కేసినట్టు నా కళ్లు కట్టి ఇదంతా చేశారు. పోలీస్‌ డ్యూటీ ఎంత కష్టం.. ఆ  పనిలో దానికి జరగరానిది ఏదైనా జరిగితే.. కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవర్రా ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఎమోషనల్ అవుతుంది.

దీంతో ప్రకాష్‌ ధాన్యం ఇప్పుడు ఏం జరగలేదు కదే ఇప్పుడెందుకు అంత రాదాంతం చేస్తావు అనగానే.. జరిగితే ఏం చేసేవాళ్లు అని అడుగుతున్నాను.. నా కోడలు పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నాను అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. అప్పు ఏడుస్తూ.. తప్పే అత్తయ్యా నేను చేసింది తప్పే.. మీకు నా మీద నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఎంత ప్రేమో నాకు తెలియంది కాదు.. కానీ  ఆ తల్లి తన బిడ్డను కాపాడమని ఏడుస్తుంటే.. కడుపుతో ఉన్నాను కదా.. ఒక తల్లి బాధను చూడలేకే ఇదంతా చేశాను.. నన్ను క్షమించండి అత్తయ్య.. అంటూ అప్పు సారీ అడగ్గానే.. ధాన్యలక్ష్మీ కోపంగా ప్రతిక్షణం నీ గురించే ఆలోచించాను. నీ ఆకలి తెలుసుకున్నాను. నీ నిద్రను పసిగట్టాను. కాలు కింద పెట్టకుండా కాపాడుకున్నాను.. అలాంటిది నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు అంటూ తిడుతుంది.

Advertisement

దీంతో కల్యాణ్‌ కూడా తప్పు అయిపోయిందని అడుగుతుంది కదా అమ్మ ఈ ఒక్కసారికి క్షమించు అంటాడు. సుభాష్‌ కల్పించుకుని ధాన్యలక్ష్మీ జరిగిందేదో జరిగింది తప్పు చేశానని ఒప్పుకుంటుంది కదా..? ఈ సారికి వదిలేసేయ్ అంటాడు. అపర్ణ కూడా ధాన్యలక్ష్మీ తల్లి కాకపోతే బిడ్డను ఎవరు క్షమిస్తారే.. నీ పిచ్చి కాకపోతే.. కోడలిని కూతురులా చూసుకునే దానివి తెలియక ఒక తప్పు చేస్తే మన్నించలేవా అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ  లేదక్కా.. నా కోడలు నా బాధను నా భయాన్ని లెక్క చేయలేదు.. చేసిన తప్పుకు దీనికి శిక్ష పడాల్సిందే.. అంటుంది.

దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని ఏం చేస్తావే చంపేస్తావా..? పిల్లలు బాధపడుతున్నారు చాలించు ఇక అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా ఇది జీవితంలో ఇక పోలీస్‌ జాబ్‌ చేయకూడదు. ఇప్పటిదాకా.. బిడ్డ పుట్టేదాకా జాబ్‌కు వెల్లొద్దు అన్నాను.. కానీ ఇలా జరిగిన తర్వాత దీన్ని ఇంక క్షమించను.. అప్పు శాశ్వతంగా జాబ్‌ మానేయాలి. మళ్లీ కాకి బట్టలు వేసుకోకూడదు.. అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. అప్పు అది కాదు అత్తయ్యా అంటూ ఏదో చెప్పబోతుంటే.. నాకేం చెప్పకు నువ్వు జాబ్‌ రిజైన్‌ చేస్తున్నావు అంతే.. కాదు కూడదు అంటే నేను ముఖ్యమో జాబ్‌ ముఖ్యమో తేల్చుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.

Advertisement

తర్వాత అప్పు రూంలో కూర్చుని బాధపడుతుంటే.. రాజ్‌, కావ్య వెళ్లి ఓదారుస్తారు. తర్వాత రాజ్‌ చేసిన యాడ్‌ పబ్లిసిటీ అయిందని చాలా బాగుందని అందరూ మాట్లాడుకుంటారు. తర్వాత రాహుల్‌కు బిజినెస్‌ గురించి నిజాయితీ గురించి రాజ్‌ చెప్తాడు. రాహుల్‌ సరే అంటూ వినయంగా వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు ఆలోచిస్తూ కూర్చుని ఉంటే ధాన్యలక్ష్మీ వెళ్లి మళ్లీ తిడుతుంది. అప్ప ఎంత బ్రతిమాలినా ధాన్యలక్ష్మీ వినదు. దీంతో బయటి నుంచి వింటున్న రాజ్‌, కావ్య, ఇంద్రాదేవి ఎలాగైనా ధాన్యలక్ష్మీని మార్చాలని అందుకోసం ఒక నాటకం ఆడాలని డిసైడ్‌ అవుతారు.

మరుసటి రోజు ధాన్యలక్ష్మీ పంతులుకు అన్నదానం కోసం డబ్బులు ఇస్తుంటే.. ఇంద్రాదేవి వద్దని అన్నదానానికి డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. దీంతో ఒక మంచి పని చేస్తుంటే అడ్డుకోవడం ఏంటి అత్తయ్య అంటుంది ధాన్యలక్ష్మీ. ఒక అత్తగా నాకు ఈ విషయం నచ్చడం లేదు అంటుంది ఒక మంచి విషయం చేస్తున్నప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తాను అంటుంది ధాన్యం దీంతో అయితే నీ విషయంలో ఒక రూల్‌ అప్పు విషయంలో ఒక రూలా.? అప్పు చేసింది కూడా మంచి పనే కదా మరెందుకు అంత సీరియస్‌ అయ్యావు అంటుంది ఇంద్రాదేవి. దీంతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×