BigTV English
Advertisement

Brahmamudi Serial Today December 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  ధాన్యలక్ష్మీ, రుద్రాణికి రాజ్‌ వార్నింగ్‌ – అక్కకు వార్నింగ్‌ ఇచ్చిన కావ్య  

Brahmamudi Serial Today December 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  ధాన్యలక్ష్మీ, రుద్రాణికి రాజ్‌ వార్నింగ్‌ – అక్కకు వార్నింగ్‌ ఇచ్చిన కావ్య  

Brahmamudi serial today Episode:  మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మా అత్తకు లేదు. మీ అత్తకు లేదు. వాళ్లను నిందించినా.. వాళ్లను మధ్యలోకి లాగినా మర్యాదగా ఉండదు. అంటుంది కావ్య. దీంతో రాజ్‌ విన్నావా నీ భార్య మాటలు అంటుంది రుద్రాణి. రాజ్‌ విన్నాను.. చూస్తున్నాను అంటాడు. నా భార్య ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ ఉద్యోగాలు చేసుకుని బతకమంటుంది అని రాజ్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అంతదాకా తెచ్చుకోకండి.. రా కళావతి అంటూ కావ్యను తీసుకుని రాజ్‌ వెళ్లిపోతుంటే.. అపర్ణ, సుభాష్‌, ఇందిరాదేవి, ప్రకాష్‌ హ్యాపీగా చూస్తుంటారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్‌ షాకింగ్‌ గా చూస్తుంటారు.


కావ్య మాటలకు ఫీలయిన స్వప్న రూంలోకి వెళ్లి బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి సొంత చెల్లి అని నెత్తిన పెట్టుకుని ఊరేగావు. ఇప్పుడేమయింది అంటుంది రుద్రాణి. కావ్య చేతిలోకి ఆస్తి వస్తే ఇలాగే చేస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టే నిన్ను హెచ్చిరించాను. అసలు నీ చెల్లి ఏమైనా శివంగి అనుకుంటున్నావా..? మనమంతా ఆవిడ మాటలే వినాలి అనుకుంటున్నావా..? పెళ్లి అయిన తర్వాత కావ్య తన సొంత వాళ్లు అంటే తన మొగుడు, తన అత్తమామలే అనుకుంటుంది అని రుద్రాణి చెప్పగానే ఇప్పటికైనా నువ్వు కూడా నీ మొగుడు, అత్తా అని ఆలోచించు అంటాడు రాహుల్‌. స్వప్న కోపంగా రుద్రాణి, రాహుల్‌ లను తిడుతుంది. అది వయసులో నాకన్నా చిన్నదే అయినా బాధ్యతలు తీసుకోవడంలో నాకన్నా పెద్దది. అది నాకు తల్లి లాంటిది అంటూ చెప్పగానే రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు.

కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు కోపంగా వెళ్లిన స్వప్న నేను కూడా నీకు పరాయిదానిలా కనిపిస్తున్నానా..? అని అడుగుతుంది. సొంత అక్కను ఎవరైనా పరాయిది అనుకుంటారా..? అంటుంది కావ్య. మరి అలా అనుకుంటే నెక్లెస్‌ విషయంలో నన్ను ఎందుకు అందరి ముందు అలా అవమానించావు అంటూ నిలదీస్తుంది. అసలు ఇంటి కోసం ఇచ్చిన చెక్‌ ను వాడుకోవడమే తప్పు అంటుంది కావ్య.


అది ఎవరు చేసినా తప్పే అంటాను. ఇంట్లో ఏం జరిగిందో చూశావు కదా అక్కా లక్షలకు లక్షలు దుబారా ఖర్చు చేస్తున్నారు అనగానే…  మీ చిన్నత్త, మా అత్త అన్నట్టు.. ఆస్థి నీ  చేతికి వచ్చే సరికి నీకు స్వార్థం పెరిగింది అని స్వప్వ తిడుతుంది. దీంతో అవును నేను ఇంతే వాళ్లకు చెప్పాను. నీకు చెప్తున్నాను. ఏదైనా కావాలంటే నీ ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో అంటుంది. మీ అత్తకు నీకు తేడా ఉందనుకున్నాను. నీకు ఆవిడకు తేడా లేకుండా పోతుంది. అంటూ తిట్టగానే స్వప్న ఏడుస్తూ నువ్వు పూర్తిగా మారిపోయావు. ఆస్తులు రాగానే అక్కను కూడా పరాయిదాన్ని చేసేశావు అంటూ వెళ్లిపోతుంది.

ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ దగ్గరకు వెళ్లి కావ్యను తిడుతుంది. ఈరోజు నాకు రుద్రాణికి జరిగిన అవమానమే రేపు నీకు మన కొడుక్కి జరగదని గ్యారంటీ ఏంటి అంటుంది. సొంత అక్క స్వప్న విషయంలోనే ఎంతలా తిట్టిందో చూశారుగా..? నేను అన్నానని కాదు మీరే అర్థం చేసుకోండి. డబ్బుల విషయంలో ఎవరైనా ఒక్కటే.. మనం ఆలోచించకపోతే కష్టం అంటుంది. అయితే ఈ విషయంలో అన్నయ్యను అడుగుతాను అంటాడు ప్రకాష్‌.  హమ్మయ్యా ఈయనలో మార్పు మొదలైంది అని ధాన్యలక్ష్మీ మనసులో అనుకుని హ్యాపీగా ఫీలవుతుంది.

డల్లుగా రూంలోకి వచ్చిన కావ్యను ఇంకా కోపం తగ్గనట్టు ఉంది అని రాజ్‌ అడుగుతాడు. అదేం లేదని నేను చాలా అలసిపోయానని ఏమైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం అని పడుకోబోతుంటే.. కానీ నువ్వు స్వప్నను అలా మాట్లాడాల్సింది కాదు. తను కావాలని చేయలేదు కదా..? అని రాజ్ చెప్పగానే నలుగురిలో అలా మాట్లాడితేనే తన తప్పు ఏంటో తనకు తెలుస్తుంది. మిగతా వారికి అర్థం అవుతుంది అని కావ్య చెప్తుంది. కానీ అక్క అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వస్తే అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. మా అక్కకు ముందే కంగారు ఎక్కువ అందుకే చెప్పలేదు అంటుంది కావ్య. కానీ మీ ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది కదా..? అని రాజ్‌ అడగ్గానే.. మనం తాతయ్యగారి మాట నిలబెట్టే వరకు ఎవరు నన్ను ఎలా అనుకున్నా నేను ఇలాగే ఉంటాను అని చెప్తుంది కావ్య.

రాజ్ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే కావ్య వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఐదు లక్షల కోసం ఇంత టెన్షన్ పడటం  నా జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్తాడు రాజ్‌.  అయితే స్వప్న అక్క నెక్లెస్ తనుక వద్దని ముఖాన వేసింది కదా అది అమ్మేద్దామా అంటుంది కావ్య. వద్దని చెప్తాడు రాజ్‌. మనం నేర్చుకోవాల్సింది తాతయ్య దగ్గర నుంచి అంటాడు రాజ్‌. మరి ఈ సమస్య సాల్వ్‌ అయ్యేది ఎలా అండి అని అడగ్గానే నేనే ఏదో విధంగా చేస్తానులే అంటాడు రాజ్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Brahmamudi Serial Today November 10th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను విడిపించిన రాజ్, కావ్య     

Nindu Noorella Saavasam Serial Today November 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తికి నిజం చెప్పిన మిస్సమ్మ 

GudiGantalu Today episode: మీనా పై సుశీల ప్రశంసలు.. నిజం తెలుసుకున్న సుశీల.. అత్తింట్లో మౌనికకు అవమానం..

Sridevi Drama company Promo: ఆదికి చెమటలు పట్టించారే..కన్నీళ్లు పెట్టించిన తాగుబోతు రమేష్

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

Actress Pawan Sai : పవన్ సాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆమెనే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. అవనికి నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి షాక్..

GudiGantalu Today episode: షీలా పుట్టినరోజు వేడుకకు బాలు దూరం.. ప్రభావతి హ్యాపీ.. బాధపడిన సత్యం..

Big Stories

×