BigTV English

Brahmamudi Serial Today Fabruary 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను నిలదీసిన అపర్ణ – రుద్రాణికి కావ్య వార్నింగ్‌

Brahmamudi Serial Today Fabruary 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను నిలదీసిన అపర్ణ – రుద్రాణికి కావ్య వార్నింగ్‌

Brahmamudi serial today Episode:  ఇంట్లో వాళ్లందరూ ధాన్యలక్ష్మీని రుద్రాణి మాటలు నమ్మి చెడిపోతున్నావని అంటారు. నాకు అన్యాయం జరుగుతుందని నాకు అర్తం అవుతుంది కాబట్టి నేను రుద్రాణి మాటలు వింటున్నాను. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను కాబట్టి ఆ మాటలు నిజమని నమ్ముతున్నాను అంటుంది. ధాన్యలక్ష్మీ నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు. ఒక కొడుక్కి తల్లివి అంటుంది అపర్ణ. నా కొడుక్కి అన్యాయం జరుగుతుందనే పోరాడుతున్నాను. అందుకే మీకు నేను చెడ్డదాన్ని అయిపోయాను అంటుంది ధాన్యలక్ష్మీ.. నువ్వు చెడ్డదానివి అని ఎవరూ అనడం లేదు.. ఎవరి మాటలో నమ్మి చెడిపోతున్నావని అంటున్నాము అంటాడు సుభాష్‌. ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజమైతే మాత్రం నేను అసలు ఊరుకోను అంటూ వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.


ఆఫీసులో రాజ్‌, కావ్య మాట్లాడుకుంటూ ఉండగా.. శిరీష్‌ వచ్చి నెక్లెస్‌ వేలం పాటలో తీసుకున్న డబ్బు క్యాష్‌గా ఇవ్వడానికి వస్తాడు. బ్లాక్‌ వద్దని రాజ్‌ చెబితే నాకు పర్సనల్‌ ప్రాబ్లమ్‌ వల్ల క్యాష్‌ ఇస్తున్నాను అని చెప్పగానే సరే అంటూ డబ్బు తీసుకుంటాడు రాజ్‌. డబ్బు ఇచ్చి శిరీష్‌ వెళ్లిపోగానే.. ఇంత క్యాష్‌ ఓకేసారి ఎలా డిపాజిట్‌ చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు రాజ్‌. బ్యాంక్‌ హాలిడే కదా డబ్బంతా ఇంటికి తీసుకెళదాం అనుకుంటారు.

ఇంటి దగ్గర రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి రాజ్‌, కావ్య కోసం ఎదురూ చూస్తుంటారు. వాళ్లు ఇంకా రాలేదేంటి.. అటు నుంచి అటే వెళ్లిపోయారా ఏంటి అంటుంది రుద్రాణి. ఇవాళే వీసాకు అప్లయ్‌ చేశారు. అప్పుడే ఎలా వెళ్లిపోతారు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో స్వప్న వచ్చి ఏంటి ఇక్కడ నిల్చుని గుమ్మం వంకే గుంటనక్కలా చూస్తున్నారు అంటుంది. ధాన్యలక్ష్మీ కోపంగా ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. చిన్నా పెద్దా అనే తేడా లేదా..? అంటుంది. స్వప్న కూల్‌గా మిమ్మల్ని అంటానా..? ఆంటీ పీక్కు తినడానికి రెడీగా ఉన్న మా అత్తను అడుగుతున్నాను అంటుంది. రుద్రాణి కోపంగా ఏయ్‌ నేను కూడా నీకన్నా పెద్దదాన్ని.. నాక్కూడా రెస్పెక్ట్‌ కావాలి అంటుంది.


నాకు కూడా చాలా కావాలని ఆశపడ్డాను అత్తయ్యా కానీ దొరికిన దాంట్లో అర్జెస్ట్‌ అవడం లేదా..? అలాగే నేను ఇచ్చినంత రెస్పెక్ట్‌ లోనే మీరు అడ్జస్ట్‌ అవ్వండి.. అయినా మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారో నాకు తెలుసు కావ్య, రాజ్‌ రాగాలనే అమెరికా విషయం అడగడానికే కదా అంటుంది స్వప్న. అడగడమే కాదు.. కడిగిపారేస్తాను అంటుంది రుద్రాణి. కడగాలని నీకు అంత ఇంట్రెస్ట్‌ ఉంటే కిచెన్‌లో పాత్రలు కడుగు అంటుంది స్వప్న. ఎందుకంటే వాళ్లు రావడానికి చాలా టై పడుతుందని ఇప్పుడే చెప్పారు అంటూ వెళ్లిపోతుంది స్వప్న.

కళ్యాణ్‌, అప్పుకు ఫోన్‌ చేసి తనకు సినిమా చాన్స్‌ వచ్చిందని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్టుకు సాంగ్‌ రాసే అవకాశం ఇస్తానన్న విషయం చెప్తాడు. దీంతో అప్పు హ్యాపీగా ఫీలవుతుంది. త్వరలోనే నీ పేరు స్క్రీన్‌ మీద చూడబోతున్నాం అన్నమాట అంటుంది. కళ్యాణ్‌ కూడా అప్పును ట్రైనింగ్‌ ఎప్పుడు అయిపోతుందని అడుగుతాడు. త్వరలోనే అయిపోతుందని చెప్తుంది.

దుగ్గిరాల ఇంట్లో అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటారు. రుద్రాణి మాత్రం తినకుండా రాజ్‌, కావ్య ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తుంది. స్వప్న వెటకారంగా దిక్కులు చూస్తూ తినకుండా కూర్చుంటే ఆరోగ్యం బాగుంటుందని ఏ డాక్టరైనా చెప్పారా అత్తయ్యా అంటుంది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అత్తను అవమానించమని నీకు ఎవరైనా చెప్పారా..? అంటుంది రుద్రాణి. ఇంతలో రాజ్‌, కావ్య వచ్చి భోజనం చేస్తుంటే.. అపర్ణ కోపంగా రాజ్‌ ఎవరికీ తెలియకుండా ఆస్తిని మొత్తం డాలర్లుగా మార్చేసి అమెరికా ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది.

పారిపోవడం ఏంటి మమ్మీ అంటాడు రాజ్‌. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లితే పారిపోవడమే అంటారు. నటించకు వెనక నుంచి రుద్రాణి, ధాన్యలక్ష్మీని మోసం చేస్తే ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నావా..? ఏం రుద్రాణి నీ ఆస్థినే కదా వాడు డాలర్లుగా మార్చేస్తుంది అంటుంది అపర్ణ. దీంతో రుద్రాణి అంత వెటకారం ఎందుకులే వదిన ఇంతకుముందు నేను మాట్లాడిన దానికి రివేంజ్‌లా ఉంది అంటుంది. నువ్వు చెప్పరా రాజ్‌ ఎందుకు అమెరికా పారిపోవాలనుకుంటున్నావు అని అపర్ణ అడుగుతుంది. నేను చెప్తాను అత్తయ్యా అంటూ కావ్య చెప్పబోతుంటే.. రాజ్‌  మేం నిజంగానే దొంగచాటుగా అమెరికా పారిపోవాలనుకుంటే.. వీసా డాక్యుమెంట్స్‌ ఇంట్లో అందరికీ తెలిసేలా ఎలా ఇస్తాము.. మూడో కంటికి తెలియకుండా వెళ్లిపోతాం కదా అత్తా అంటూ రాజ్‌ చెప్తాడు. కావ్య కోపంగా రోజంతా ఆఫీసులో కష్టపడి వచ్చిన మనిషిని మీ అనుమానాలతో కనీసం తిండి కూడా తిననివ్వకుండా  చేస్తున్నారు అంటుంది.

సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా అంటూ రుద్రాణి అనగానే.. అత్తా ఎందుకంతా పెద్దమాటలు.. మన కంపెనీకి అమెరికా కస్టమర్లకు నచ్చాయి. వాళ్లు వచ్చి డెమో ఇవ్వమన్నారు. డీల్‌ ఓకే అయితే మన కంపెనీకి 40 కోట్లు వస్తాయి. అందుకే అమెరికా వెళ్తున్నాము అంటూ రాజ్‌ చెప్పగానే.. నువ్వు చెప్పేది నిజమేనా..? అంటుంది రుద్రాణి. దీంతో కావ్య కోపంగా మాకు కష్టపడటం.. పైసా పైసా కూడబెట్టడం.. కంపెనీని పై స్థాయికి తీసుకురావడమే తెలుసు.. ఆస్తుల మీద కన్నేయడం.. ఇంటిని ముక్కలు చేయడం మాకు తెలియదు అంటుంది కావ్య. నిజమైతే సంతోషమే అబద్దమైతేనే ఆలోచించాలి అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో రాజ్‌ కోసంగా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×