Tirupati: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీ పార్టీలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే తిరుపతి కార్పొరేషన్‌లో కూటమికే వైసీపీ కార్పొరేటర్లు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ నేత అభినయ రెడ్డి కూటమి క్యాంపులో ఉన్న వైసీపీ కార్పొరేటర్‌ను తీసుకొచ్చారు. దీంతో విజయంపై కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవికి బరిలో కూటమి, వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. TDP నుంచి మునికృష్ణ, వైసీపీ నుంచి 42వ డివిజన్ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు ప్రిసైడింగ్ అధికారి శుభం భన్సాల్ ఆధ్వర్యంలో ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్‌లో 48 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలిచిన వారే. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎక్స్అఫిషియోతో కలసి మొత్తం సభ్యులు 50 మంది.
ఎన్నికలో విజయం కోసం కూటమి పార్టీలు, పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేశాయి. విజయానికి అవసరమైన సంఖ్యా బలం ఉండటంతో తమ విజయం ఖాయమన్న ధీమాను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకొనేందుకు తిరుపతి మినహా రాష్ట్రంలో మరెక్కడా వైసీపీకి అనువైన వాతావరణం లేకపోవడంతో… ఆ పార్టీ నేతలు తిరుపతిపై దృష్టి సారించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకొనేందుకు వైసీపీ తీవ్రయత్నాలు చేస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి తిరిగి పొందాలంటే కనీసం 26 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరం ఉంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకొనేందుకు వైసీపీ తీవ్రయత్నాలు చేస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి తిరిగి పొందాలంటే కనీసం 26 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరం ఉంది.
కాగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రాత్రంతా హైడ్రామా నడిచింది. చిత్తూరులోని వైసీపీ క్యాంప్ ఆఫీస్ వద్దకు టీడీపీ నాయకులు వెళ్లగా భూమన అభినయరెడ్డి అడ్డుకున్నారు. అటు రాత్రి 41వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌కుమార్ యాదవ్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అభినయరెడ్డి ఉదయం అలిపిరి పీఎస్ వద్దకు వెళ్లారు.
Also Read: హిందూపురంలో మున్సిపాలిటీలో ఉత్కంఠ – రంగంలోకి దిగిన నందమూరి బాలయ్య..
మరోవైపు నెల్లూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ మేయర్ పదవికి టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టారు. రెండు పార్టీలు మైనార్టీలకు రంగంలోకి దించాయి. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్‌ను ఎంపిక చేయగా.. వైసీపీ నుంచి 45వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లాకు బీఫారం ఇచ్చారు. ఇక ఎన్నికకు వైసీపీ విప్‌గా ఊటుకూరు నాగార్జునను నియమించారు. 11 గంటలకు కార్పొరేషన్‌లోని సమావేశమందిరంలో ప్రిసైడింగ్ అధికారి, జేసీ కార్తీక్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించనున్నారు.
టీడీపీ, వైసీసీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికంగా మారింది. మరోవైపు 54 మంది కార్పొరేటర్లకు వైసీపీ నుంచి గెలుపొందారు. ఎన్నికల తర్వాత వీరిలో 39 మంది టీడీపీలో చేరారు. ఎన్నికకు ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీకి 41 మంది, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిపి వైసీపీకి 14 మంది కార్పొరేటర్లు ఉండగా…మేయర్ పొట్లూరి స్రవంతి తటస్థంగా ఉన్నారు. వైసీపీ తరపున గెలుపొందిన 54 మంది కార్పొరేటర్లకు హైకమాండ్ విప్ జారీ చేసింది. విప్ ఉల్లంఘించే వారిపై అనర్హత వేటు వేసేందుకు వ్యూహం రచిస్తోంది. పలువురు కార్పొరేటర్లు న్యాయ నిపునిపుణలతో చర్చిస్తున్నారు. వైసీపీ నేతలు మంతనాలు జరిగాయి. పార్టీ మారిన కార్పొరేటర్లు కూటమి అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.