E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గుడిలోకి వెళ్లి తులసి దగ్గర బిడ్డను అడిగిన కావ్య  

Brahmamudi Serial Today January 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గుడిలోకి వెళ్లి తులసి దగ్గర బిడ్డను అడిగిన కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode:

తన బిడ్డను వెతకడానికి వెళ్తున్నానని ఇంట్లో స్వప్న, అప్పులకు చెప్పి కావ్య వెళ్లిపోతుంది. కావ్య నేరుగా హాస్పిటల్‌కు వెళ్తుంది. డాక్టర్‌ అనురాధను కలడానికి ప్రయత్నిస్తుంది. అయితే కావ్యను కలవడం ఇష్టం లేని డాక్టర్‌ నర్సు చేత బిజీగా ఉన్నానని చెప్పిస్తుంది. అయినా కావ్య వినకుండా డాక్టర్‌ చాంబర్‌లోకి దూసుకెళ్తుంది. డాక్టర్‌ తిడుతున్నా కావ్య బాధపడుతూ డాక్టర్‌ గారు మీ హాస్పిటల్‌ లో నా బిడ్డను మార్చేశారు. నాకు అన్యాయం చేశారు. ఫ్లీజ్‌ మేడం నాకు న్యాయం చేయండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో డాక్టర్‌ కోపంగా కావ్య నీకు ఇంతకుముందే చెప్పాను.. మీ పాపను ఎవ్వరూ మార్చలేదు.. పైగా ఇక్కడ రోగులకు ట్రీట్‌మెంట్‌ మాత్రమే చేస్తారు. న్యాయం చేయరు..? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో కావ్య.. మమ్మల్ని డిస్టర్బ్‌ చేయకు అంటుంది.

దీంతో కావ్య ఏడుస్తూనే..కానీ ఈ హాస్పిటల్‌లో నా బిడ్డను మార్చి నాకు అన్యాయం చేశారు మేడం.. అని చెప్పగానే.. డాక్టర్ మరింత కోపంగా కావ్య ఒకసారి చెబితే అర్ధం కాదా? పదేపదే ఎన్నిసార్లు అదే మాట అంటావు.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో.. అనగానే.. కావ్య ఏడుస్తూ..  నా చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ అని నా కడుపులో పేగు ఒప్పుకోనంత వరకు నేను అదే మాట అంటాను. డాక్టర్‌.. అనగానే.. చూడండి కావ్య.. ప్రాణం పోయినా ఈ హాస్పిటల్‌లో అలా జరగదు, బిడ్డల్ని మార్చే అవకాశం కూడా ఉండదు ఎలా చెప్పాలి నీకు అంటూ తిడుతుంది డాక్టర్‌. మీరు డాక్టర్‌గా ఆలోచించే వరకు మీకు సమాధానం దొరకదు. మీరు నన్ను నా మాటలను నమ్మే వరకు నా బాధను అర్ధం చేసుకోలేరు..

Advertisement

ఒక్కసారి మీరు పేషెంట్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా ఆలోచించండి. మీకూ పిల్లలు ఉంటారు కదా? వాళ్ల కోసం తపించే మీ గుండెతో ఆలోచించండి. ఈ అమ్మ వేదన ఏంటో మీకూ అర్ధం అవుతుంది.. బిడ్డ కానీ బిడ్డకు ఆకలి తీర్చగలుగుతున్నానే కానీ ఆప్యాయత పంచలేకపోతున్నాను. నాకు సాయం చేయండి మేడం.. అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది కావ్య. కావ్య మాటలకు డాక్టర్‌ కన్వీన్స్‌ అవుతుంది. సరే కావ్య నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒక తల్లిలా ఆలోచించి నీకు హెల్ప్‌ చేస్తాను.. కానీ నేను ఎం చేయాలి చెప్పు అని డాక్టర్‌ అడగ్గానే..  మేడం ఆ రోజు నాతో పాటు ఈ హాస్పిటల్‌ లో డెలివరీ అయిన వాళ్ల లిస్ట్‌ ఇవ్వండి మేడం.. అని అడగ్గానే.. డాక్టర్‌ సరే అంటూ నర్సును పిలిచి కావ్యకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తుంది. నర్సు సరే అంటుంది.

ఇంట్లో ఉన్న పాప ఆకలితో ఏడుస్తుంటుంది. స్వప్న, అప్పు పాపను ఎంత ఆడించినా పాప ఏడుపు ఆపదు.  అపర్ణ వచ్చి పాపను మీరు ఆడిస్తున్నారేంటని కావ్య ఎక్కడ అని అడుగుతుంది. ఇంతలో రేఖ వచ్చి పాప అలాగే గుక్కపెట్టి ఏడుస్తుంది అలాగే ఏడిస్తే ఊపిరి ఆడదని అంటుంది. ఇంతలో రాజ్‌ వచ్చి కావ్య ఎక్కడికి వెళ్లిందో నాకు కూడా తెలియదు అని చెప్తాడు. పాపను మీకు ఇచ్చి కళావతి ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు. తన పాపను వెతకడానికి వెళ్తున్నానని చెప్పి కావ్య వెళ్లిపోయిది. అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.  దీంతో అపర్ణ కోపంగా కావ్యకి ఇంక ఎలా చెబితే అర్ధమవుతుంది? మన మాటలను ఎందుకు నమ్మడం లేదు? ఆఖరికి డీఎన్ఏ టెస్ట్  కూడా నమ్మడం లేదేంటి..? అది ఎందుకింత మొండిగా తయారైంది? దాని ప్రవర్తన ఎందుకిలా మారిపోతోందని బాధపడుతుంది. ఇంతలో రేఖ కల్పించుకుని ఈ ప్రవర్తన చాలా ప్రమాదకరం.. 15 రోజులకే బిడ్డను ఇలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్లందరూ కావ్యను తిట్టేలా చేయాలనుకుంటుంది.

Advertisement

మరోవైపు  మినిస్టర్‌ ధర్మేంద్ర పాపకు శాంతి హోమం చేయించడానికి గుడికి వెళ్తాడు. అక్కడ పూజ పాస్ట్‌గా చేయాలని పంతులుకు చెప్తాడు. అప్పుడే గుడి దగ్గరకు వచ్చిన రుద్రాణి మీ కూతురుకు శాంతి పూజ ఇంత సింపుల్‌ గా చేయిస్తున్నారు.. గ్రాండ్‌గా చేయించాలి కదా అంటుంది. దీంతో రాజ్‌, కావ్యలకు ఎక్కడ అనుమానం వస్తుందోనని ఇలా చేస్తున్నానని చెప్తాడు ధర్మేంద్ర. తర్వాత దర్మేంద్ర పూజ చేస్తుంటాడు. రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంతలో కావ్య అదే గుడికి వచ్చి దేవుడి ముందు నిలబడి తన బిడ్డను చూపించాల్సిన బాధ్యత నీదేనని మొక్కుతుంది. అప్పుడే తులసి పాపకు పాల పట్టిస్తున్నా బిడ్డ ఏడుపు ఆపదు. దూరం నుంచి గమనించిన కావ్య దగ్గరకు వెళ్లి పాపను తనకు ఇవ్వమని అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×