OTT Movie : మనిషి మాంసాన్ని మనిషే వండుకుని తినడం అన్నది వినడానికి విడ్డూరంగా ఉన్నా, అలాంటి సీన్స్ కళ్ళ ముందు కన్పిస్తే ఒకలాంటి థ్రిల్, స్పైన్ చిల్లింగ్ మూమెంట్ అన్పిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కిన మూవీ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. మరి ఈ మూవీ కథేంటి? ఓటీటీ వివరాలేంటి? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘Dahmer’. అమెరికన్ బయోగ్రాఫికల్ హారర్-డ్రామా. ఈ సినిమా నిజమైన సీరియల్ కిల్లర్ జెఫ్రీ డామర్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అతని ఒంటరితనం, మానసిక సమస్యలు, భయంకరమైన నేరాలను సైకలాజికల్ థ్రిల్లర్, బయోగ్రాఫికల్ డ్రామా, క్రైమ్ హారర్ కలిసిన అంశాలతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. డేవిడ్ జాకబ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెరెమీ రెన్నర్ (జెఫ్రీ డామర్), బ్రూస్ డేవిసన్ (లియోనెల్ డామర్), ఆర్టెల్ గ్రేట్ (రోడ్నీ), షాన్ బ్లాకెమోర్, మాట్ న్యూటన్, డియోన్ బాస్కో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
జెఫ్రీ డామర్ (జెరెమీ రెన్నర్) మిల్వాకీలో ఒక ఫ్యాక్టరీ వర్కర్‌గా జీవిస్తాడు. కానీ అతను ఒంటరితనం, మానసిక సమస్యలతో బాధపడతాడు. అతని బాల్యంలో, తండ్రి లియోనెల్ (బ్రూస్ డేవిసన్)తో ఉన్న సంబంధం, తల్లి జాయిస్ మానసిక సమస్యలు అతని మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయి. జెఫ్రీ యువకులను బార్‌లలో కలుస్తాడు, వారిని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చేలా ఆకర్షిస్తాడు. భయంకరమైన ఉద్దేశాలతో వారిని కిడ్నాప్ చేస్తాడు. సినిమా అతని జీవితంలోని మూడు దశలను చూపిస్తుంది.
అతని బాల్యం, 1980లలో మిల్వాకీలో చేసిన నేరాలు. 1991లో అతని అరెస్ట్… జెఫ్రీ రోడ్నీ (షాన్ బ్లాకెమోర్) అనే యువకుడిని కలుస్తాడు. అతనితో సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటాడు, కానీ అతని బాధితులను శాశ్వతంగా తనతో ఉంచుకోవాలనే ఆలోచనలు అతన్ని నేరాలకు ప్రేరేపిస్తాయి. అతను బాధితులను మత్తుమందులతో బలవంతంగా నిద్రపుచ్చి, చంపి, వారి శరీరాలను ఫ్రిజ్‌లో దాస్తాడు. జెఫ్రీ నేరాలు క్రమంగా బయట పడతాయి. ఒక బాధితుడు తప్పించుకుని పోలీసులకు చెప్పడంతో జెఫ్రీ అరెస్ట్ అవుతాడు. అతను అసలు అన్ని హత్యలు చేసి పోలీసులకు దొరకకుండా ఎలా ఉన్నాడు? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే. ఈ సినిమాలో అతను మనుషుల్ని చంపి తిన్నాడనే విషయాన్నీ మేకర్స్ స్పష్టంగా చూపించలేదు. కానీ రియల్ లైఫ్ కిల్లర్ అయితే తిన్నాడని అంటారు.
Read Also : నన్, గర్ల్ ఫ్రెండ్ తో స్కూల్లోనే ఇదెక్కడి అరాచకంరా అయ్యా ? మొత్తం అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్