BigTV English

Brahmamudi Serial Today July 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కావ్యకు నిజం చెప్పిన ఇంద్రాదేవి – జగదీష్‌ను కొట్టిన సుభాష్‌

Brahmamudi Serial Today July 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కావ్యకు నిజం చెప్పిన ఇంద్రాదేవి – జగదీష్‌ను కొట్టిన సుభాష్‌

Brahmamudi serial today Episode: రేవతి గురించి కావ్య, ఇంద్రాదేవిని అడుగుతుంది. మీరు నిజం చెప్పకపోతే నేను అత్తయ్యను అడుగుతానని వెళ్లబోతుంటే ఇంద్రాదేవి కావ్యపు ఆపేసి ఈ విషయం అపర్ణను అడిగితే కొంపలు అంటుకుంటాయి అంటుంది. అయితే ఆ రేవతి గారు ఈ ఇంటి మనిషే అన్నమాట అంటూ కావ్య అడగడంతో ఇంద్రాదేవి షాక్‌ అవుతుంది. ఇక్కడ ఇంత మంచి జీవితాన్ని వదిలేసి అక్కడ బస్తీలో ఉండాల్సిన పరిస్థితి ఆవిడకు ఎందుకు వచ్చింది అమ్మమ్మగారు ఒకవేళ ఆవిడ ఏదైనా చేయకూడని తప్పు చేశారా..? అని కావ్య అడగ్గానే..


నోర్మూయ్‌ అది చేసింది తప్పు కాదు.. పొరపాటు తెలిసి తెలియక చేసిన ఆ పొరపాటకు పదిహేనేళ్ల నుంచి బాధపడుతూనే ఉంది. అయినా ఆ దేవుడి మనసు కరగటం లేదు. అపర్ణ మనసు మార్చడం లేదు. ఇందాకటి నుంచి నువ్వు చెప్పు చెప్పు అంటున్నావే అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా..? ఆ సాయం పొందిన ఆ రేవతి ఎవరో నీకు తెలుసా..? అనగానే ఎవరు అమ్మమ్మగారు అని కావ్య అడగ్గానే.. అపర్ణ కూతురు.. నా మనవడికి అక్క.. నీకు సొంత వదిన.. అకారణంగా అన్యాయం అయిపోయిన నా మనవరాలు. రేవతి అంటే నాకే కాదు ఈ ఇంటిళ్లిపాదికి తను కిరీటం.. దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్లం అంత ప్రేమ అదంటే మాకు అంటుంది. షాకింగ్‌ గా కావ్య ఏంటి అమ్మమ్మ గారు మీరు చెప్పేది రేవతి గారు.. ఈ ఇంటి ఆడపడుచా..? అని అడుగుతుంది.

ఇంద్రాదేవి అవును అని చెప్తుంది. మరి అలాంటప్పుడు తనను ఎందుకు దూరం చేసుకున్నారు అమ్మమ్మగారు అని కావ్య అడుగుతుంది. మేము దూరం చేసుకోవడ కాదు. తనే మా నుంచి దూరం వెళ్లిపోయింది అంటుంది అసలు ఏం జరిగింది అమ్మమ్మ అంటూ కావ్య అడగ్గానే..ఇంద్రాదేవి ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. రేవతి డ్రైవర్ జగదీష్‌ను ప్రేమించడం.. ఒకరోజు సడెన్‌గా పెళ్లి చేసుకుని రావడంతో  ఇంట్లో జరిగిన గొడవ.. సుభాష్‌, జగదీష్‌ను కొట్టడం అన్ని చెప్తుంది. ఇక సుభాష్‌ కోపంగా జగదీష్‌ను మీ అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగాలేకపోతే లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాను. అడగినప్పుడల్లా జీతం పెంచాను. అడక్కపోయినా బోనస్‌ ఇచ్చాను. దానికి నువ్విచ్చే బహుమతి ఇదా..? అంటూ జగదీష్‌ను కొడుతుంటాడు. మధ్యలో రేవతి కలగజేసుకుని నాన్న కొట్టకండి నాన్న అంటుంది.


దీంతో సుభాష్‌ కోపంగా నోర్మూయ్‌.. ప్రాణంగా ప్రేమిచాను కదాని ఇలా పరువు తక్కువ పని చేస్తానంటే చూస్తూ ఊరుకోను చంపిపడేస్తా.. డ్రైవరు ఓనరు కలిసి ఓకే కారులో ప్రయాణించినంత మాత్రాన వాళ్లిద్దరూ సమానం అయిపోతారు అనుకుంటున్నావా..? నాలుగు మాటలు నవ్వుతూ మాట్లాడితే నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావా..? నువ్వు నా కూతురు కాలి గోటికి కూడా పనికిరావు. అలాంటిది తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావారా..? అంటూ కొడుతుంటాడు. మధ్యలో రుద్రాణి  అన్నయ్యా ఆగు.. అంటూ  వచ్చి చూశావా రేవతి తనకు నచ్చని పని చేసినా నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నాడు మీ నాన్న..  నాకు తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది వాడితో కలిసి జీవితాంతం ఎలా కాపురం చేయాలనుకున్నావు. ఇప్పడు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డను వీళ్ల మనవడిగా నెత్తిన పెట్టుకుని ఊరేగాలా..? అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా వీళ్లకి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి.

దీంతో సుభాష్‌ కోపంగా అంతవరకు నేను రానిస్తే కదా..? కన్న తండ్రిగా నాకు తెలియకుండా చేసుకున్న ఈ పెళ్లి చెల్లదు.  అసలు వీడు కట్టిన తాళి తాళే కాదు. వీడసలు ఇక్కడి నుంచి ఈరోజు ప్రాణాలతో వెళ్లడు అంటూ మళ్లీ సుభాష్‌, జగదీష్‌ను కొట్టబోతుంటే.. రేవతి అడ్డు పడుతుంది. సుభాష్‌ కోపంగా నవ్వు నాకు అడ్డు చెప్తున్నావా..? అని సుభాష్‌ అడగ్గానే.. అవును నాన్నా నేనే నీ కూతురిని ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను.. ప్రేమిస్తే చంపేస్తారా..? ఇప్పటి వరకు మీరు నన్న అర్థం చేసుకుంటారు కదా అని పెళ్లి చేసుకుని వచ్చాను.. కానీ మీరు కూడా అందరి తల్లిదండ్రుల్లాగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటుంది.

దీంతో అపర్ణ కోపంగా వచ్చి రేవతిని కొడుతుంది. ఏడుస్తూ తిడుతుంది అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే నీకు లేదు. అందరికీ చెప్తున్నాను ఈరోజు నుంచి దీనికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో మనుసులు ఎవరైనా దీనితో మాట్లాడాలని ప్రయత్నించినా… కలిశారాని తెలిసినా..? వాళ్లు కూడా ఈ ఇంటితో సంబంధం కోల్పోతారు. ఇక నుంచి ఈ ఇంట్లో దీని పేరు కూడా వినబడటానికి వీల్లేదు. నా పుట్టిన కూతురు ఈ క్షణమే చచ్చిపోయిందని అనుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు.. నా భర్తకు విలువ ఇవ్వని వాళ్లు.. ఈ ఇంటితో సంబంధం లేనివాళ్లు ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెల్లిపోండి.. అంటూ అపర్ణ కోపంగా ఇద్దరినీ బయటకు తోసేస్తుంది. మేము ప్రాణాలతో ఉన్నన్ని రోజులు నువ్వు ఈ ఇంటి గడప తొక్కొద్దు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది అపర్ణ. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×