OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కూడా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ముఖ్యంగా 2006 నోయిడా నిఠారీ హత్యలు, అభయ్ అనే పోలీసు అధికారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను చూపిస్తుంది. ఈ సిరీస్ ని చూడటం మొదలు పెడితే చివరి వరకూ ఆపకుండా చూస్తూనే ఉంటారు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
జీ5 లో స్ట్రీమింగ్
2019 లో వచ్చిన ‘అభయ్’ (Abhay) సీజన్ 1 అనేది ZEE5 ఒరిజినల్ హిందీ భాషలో విడుదలైన ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని కెన్ ఘోష్ దర్శకత్వంలో బి.పి. సింగ్ నిర్మించారు. ఈ సిరీస్‌లో కునాల్ ఖేము, అభయ్ ప్రతాప్ సింగ్ పాత్రలో నటించారు. ఎల్నాజ్ నౌరోజీ, సందీపా ధర్, రీతురాజ్ సింగ్, మనీనీ మిశ్రా సహాయక పాత్రల్లో నటించారు. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్ నిజమైన క్రైమ్ కథల నుండి ప్రేరణ పొందింది. IMDb లో ఈ సిరీస్ కి 6.8/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ అభయ్ ప్రతాప్ సింగ్ (కునాల్ ఖేము) అనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను క్రిమినల్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం కలిగిన పదునైన ఇన్వెస్టిగేటర్. అభయ్ తన భార్య దివ్య సింగ్ (ప్రియల్ గోర్) మరణం తర్వాత మానసికంగా బాధపడుతూ, తన కుమారుడు సాహిల్ (ప్రత్యక్ష్ పన్వర్) పట్ల ఆందోళన చెందుతుంటాడు. సాహిల్ ని 24 గంటల CCTV నిఘాలో ఉంచుతాడు. అభయ్ వ్యక్తిగత జీవితంలోని ఈ బాధలు, అతని దర్యాప్తులను మరింత కఠినతరం చేస్తాయి. కానీ అతను తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకు సాగుతాడు.
సీజన్ 1లో అభయ్ లక్నో శివార్లలోని చింతారి గ్రామంలో జరుగుతున్న పిల్లల అదృశ్య కేసులను ఛేదించడం నుండి మొదలవుతుంది. ఇది 2006 నిఠారీ హత్యల నుండి ప్రేరణ పొందింది. రెండు సంవత్సరాలుగా ఈ గ్రామంలో పిల్లలు అదృశ్యమవుతుంటారు. అభయ్ ఈ గ్రామంలో కనిపించకుండా పోయిన రఘు, పూజా అనే ఇద్దరు పిల్లల కేసును తీసుకుంటాడు. అతను తన బృందంతో కలిసి, ఇన్‌స్పెక్టర్ కోమల్ (సందీపా ధర్) ఇతర అధికారుల సహాయంతో, ఈ హత్యల వెనుక ఉన్న దారుణ రహస్యాన్ని కనుగొంటాడు. ఈ కేసు అభయ్‌ను ఒక కానిబలిస్టిక్ క్రిమినల్ ని ఎదుర్కొనేలా చేస్తుంది. ఇది ఈ సిరీస్‌కు ఒక భయంకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది. చివరికి అభయ్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు ? ఆ క్రిమినల్ పిల్లల్ని ఎందుకు చంపుతుంటాడు ? అభయ్ భార్య చావుకి కారణం ఎవరు ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 35 మంది పిల్లలు మిస్సింగ్… పోలీసులకు హింట్ ఇస్తూ కిడ్నాపులు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సైకో థ్రిల్లర్