BigTV English

OTT Movie : భార్యను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… బతికుండగానే భర్తకు చుక్కలు చూపించే ఆడ దెయ్యం

OTT Movie : భార్యను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… బతికుండగానే భర్తకు చుక్కలు చూపించే ఆడ దెయ్యం

OTT Movie : రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘నిసితే’ అనే ఒక కథ ఆధారంగా ఒక షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇది ఒక సరికొత్త లవ్ స్టోరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.  కేక పెట్టించే స్టోరీ చూడాలనుకునేవాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


యూట్యూబ్ లో స్ట్రీమింగ్ 

ఈ హిందీ షార్ట్ ఫిల్మ్ పేరు ‘వన్ వుమన్ మ్యాన్’ (One Woman Man). 2019లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కి సుదీప్ మొండల్ దర్శకత్వం వహించారు. ఇది రవీంద్రనాథ్ టాగోర్ రచించిన “నిసితే” కథ నుండి స్ఫూర్తి పొందింది. ఈ చిత్రంలో జితేంద్ర బర్సివాల్, సమీక్షా గౌర్, సుదీప్ సరంగి, చక్షు తివారీ నటించారు. ఈ డ్రామా షార్ట్ ఫిల్మ్ రన్‌టైమ్ సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఇది ప్రేమ,  విషాదం, మానసిక గందరగోళం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. Youtube లో ఈ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ దీపక్ చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్య ప్రియా పట్ల చాలా ప్రేమగా ఉంటాడు. దీపక్ తన జీవితంలోని అన్ని రాత్రులు ప్రియాకే చెందుతాయని, తాను ఒక “వన్ వుమన్ మ్యాన్” అని గట్టిగా నమ్ముతాడు. అయితే వారి వివాహ జీవితం విషాదంతో మునిగిపోతుంది. ఎందుకంటే ప్రియా గర్భస్రావం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. ఆమెను చూసుకోవడానికి ఒక నర్సును కూడా ఏర్పాటుచేస్తాడు దీపక్.  అయినా కూడా ప్రియా ఆరోగ్యం క్షీణిస్తుంది.  ఆమె అనారోగ్యంతో చివరికి మరణిస్తుంది, దీపక్‌ను ఒంటరిని చేస్తుంది. ఈ విషాదం తర్వాత, దీపక్ తన జీవితంలో ఒక కొత్త మహిళతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని గతం అతనిని వెంటాడుతుంది.

రాత్రి సమయంలో అతను మానసిక గందరగోళంతో బాధపడుతూ ఉంటాడు. ప్రియా జ్ఞాపకాలు, ఆమె పట్ల అతడు చేసిన వాగ్దానం అతనిని వేధిస్తాయి. ఈ షార్ట్ ఫిల్మ్ ఒక రాత్రి సమయంలో ఖన్నా అనే డాక్టర్  తో, దీపక్ తన బాధను బయటికి చెప్పుకుంటాడు. దీపక్ తన ప్రేమను ప్రియాకు నిలబెట్టుకోవాలా, లేక కొత్త జీవితాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలా అనే ఒక విచిత్రమైన సమస్యలో చిక్కుకుంటాడు. కథ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? దీపక్ తన భార్య జ్ఞ్యాపకాల్లోనే బతుకుతాడా ? మరొకరితో జీవితం పంచుకుంటాడా ? అనే విషయాలను ఈ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అవుట్ స్టాండింగ్ యాక్షన్ ఎలిమెంట్స్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ కోర్ట్ రూమ్ డ్రామా

Related News

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×