Brahmamudi serial today Episode: కావ్య ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే రాజ్ వస్తాడు. కళావతి గారు మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా అంటాడు. ఏటో చెప్పండి రామ్ గారు అంటూ కావ్య అడగ్గానే.. మీకు కొంచెం కూడా బుద్ది లేదండి అంటాడు రాజ్. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఏంటండి రామ్‌గారు అంత మాట అనేశారు అంటుంది. దీంతో రాజ్ అవునండి అప్పు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. రేపు మీ అక్క కూతురు బర్తుడే ఉండి ఇలాంటి టైంలో ఎలా ఉండాలి.. అంటూ రాజ్ తిట్టగానే.. కావ్య నేను ఆలోచిస్తుంది అత్తయ్య గురించి అంటూ రేవతి గురించి వాళ్ల ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పేస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు.
ఏంటి కలావతి గారు మీరు చెప్పేది. రేవతి అక్కా అమ్మ కూతురా..? వాళ్లిద్దరి మధ్య ఇంత ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఉందా..? అది తెలియకుండానే నేను వరుసలు కలిపేసుకుని అక్కా అంటున్నానా..? చూశారా కళావతి గారు దేవుడు ఎన్ని విచిత్రాలు చేస్తున్నాడు అంటూ రాజ్ అనగానే.. అందుకే రామ్ గారు మనం ఇప్పుడు ఒక పని చేయాలి. విడిపోయిన వాళ్లిద్దరిని మనమే కలపాలి అంటుంది. కానీ కలవడం అమ్మ ఇష్టం లేదు కదా అంటాడు రాజ్. కానీ రేవతి గారికి ఇష్టం ఉంది అని కావ్య చెప్పగానే.. ఓ అదొకటి ఉందా..? అయితే ఇంకేం ఎలాగూ ఇంట్లో ఫంక్షన్ ఉంది.. రేవతి అక్కా కూడా సిటీలోనే ఉంది. వెళ్లి పిలిచేద్దాం.. దాంతో అక్క ఇంటికి వచ్చేస్తుంది. ఫంక్షన్ ఆనందంలో ఉన్న అమ్మకు కూతురు కనిపించగానే ఆ ఆనందం డబుల్ అయిపోతుంది. కూతురుతో కలిసిపోతుంది అని రాజ్ చెప్పగానే..
అంత సింపుల్ అయితే నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తాను రామ్‌గారు. ఇందులో ఒక చిక్కు ఉంది. రేవతి గారు అత్తయ్యను కలవాలని ఎంత ఆరాట పడుతున్నారో అంతకన్న మొండిగా అమ్మ పిలిస్తేనే వస్తానని ఉన్నారు. నేను పిలిచినా రానంటున్నారు అని చెప్పగానే.. మీ ఆడవాళ్లతో వచ్చిన ప్రాబ్లమే ఇది కళావతి గారు.. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారు. ఎలా సాధ్యం చెప్పండి అంటూ రాజ్ అనగానే… అదే కదండి నా బాధ అనగానే రాజ్ కూడా మీరు బాధ పడితే నేను బాధపడతాను. అమ్మే అక్కను పిలిచేలా ప్లాన్ చేద్దాం అని తన ప్లాన్ చెప్తాడు రాజ్. కళావతి గారు ఎలా ఉంది నా ఐడియా అని అడగ్గానే.. రాజ్ సిగ్గుతో అయ్యో అలా పొగడకండి కళావతి గారు అంటూ వెళ్లిపోతాడు.
జగదీష్‌ను ఫాలో అవుతూ వచ్చిన రుద్రాణిని రాహుల్ మమ్మీ వీళ్లు నిజంగానే మన బంధువులా అని అడుగుతాడు. దీంతో ఇప్పుడు నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందిరా అంటూ రుద్రాణి అడగ్గానే.. ఇలాంటి బస్తీలో మన ఫ్యామిలీ వాళ్లు ఎందుకు ఉంటారని నాకు డౌటు అంటాడు రాహుల్. దీంతో రుద్రాణి రేయ్ ఇదంతా మన ఘనకార్యమేరా.. ఆరోజు నేను రేవతికి ఇచ్చిన సలహా వల్లే అది ఇక్కడ బతుకుతుంది. పద వెళ్లి చూద్దాం.. అనగానే.. చూడ్డం అవసరమా మమ్మీ ఇల్లు చూశాం కదా వెళ్లిపోదాం పద.. ఈ బస్తీలో ఉండటం నా వల్ల కాదు.. అనగానే.. రేయ్ మనం చూసింది రేవతి మొగుడిని రేవతిని కాదు. దాన్ని నేను కళ్లారా చూడాలి. ఒకవేళ అది ఇక్కడే ఉంటే.. అని రుద్రాణి చెప్పబోతుంటే.. ఉంటే నీకు వచ్చిన కష్టం ఏంటి..? అని రాహుల్ అడుగుతాడు.
దీంతో రుద్రాణి అది ఇదే ఊళ్లో ఉంటే ఎప్పటికైనా ఆ ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు.. అంటుంది. మరి ఏం చేద్దాం అని నీ ప్లాన్.. అని రాహుల్ అడగ్గానే.. అది ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను పద అంటూ ఇద్దరూ కారు దిగి జగదీష్‌ను ఫాలో అవుతుంటారు. ఇంటికి వెళ్లిన జగదీష్‌తో రేవతి ఎమోషనల్ అవుతుంది. హగ్ చేసుకుని జరిగిన విషయం చెప్తూ హ్యపీగా ఫీలవుతుంది. అంతా కిటికీలోంచి వినన రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. మరోవైపు రాజ్, కావ్య కలిసి నాటకం ఆడి అపర్ణ చేత రేవతికి ఫోన్ చేయిస్తారు. అప్పుడే జగదీష్ కళావతి ఫోన్ చేస్తుందని రేవతికి చెప్పగానే దూరం నుంచి వింటున్న రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. కావ్య దీనికి కాల్ చేయడం ఏంట్రా..? అని ఇరిటేట్ అవుతుంది రుద్రాణి.
కాల్ లిప్ట్ చేసిన రేవతి చెప్పు కళావతి అని మాట్లాడగానే.. నేను కళావతి కాదండి వాళ్ల అత్తయ్య అపర్ణను అని చెప్పగానే..రేవతి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో అపర్ణ రేవతిని బర్తుడే పార్టీకి రమ్మని పిలుస్తుంది. కావ్య కూడా పార్టీకి రావాలని కాల్ కట్ చేస్తుంది. ఇక అక్కడే మొత్తం విన్న రాహుల్, రుద్రాణి షాక్‌లో తిరిగి వెళ్లిపోతుంటారు. రేవతి ఇంటికి దగ్గర కాకుండా చూడాలని ప్లాన్ చేస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?