OTT Movie : షార్క్ హారర్, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ తో ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇచ్చే మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో ఒక సైకో అమ్మాయిలను కిడ్నాప్ చేసి షార్క్ లకు ఆహారంగా వేస్తుంటాడు. ఈ సినిమా హారర్ ఫ్యాన్స్‌కి ఒక మంచి ట్రీట్‌ను ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
“Dangerous Animals” 2025లో విడుదలైన ఆస్ట్రేలియన్-అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ. సీన్ బైర్న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హాసీ హారిసన్ (జెఫిర్‌గా), జై కోర్ట్నీ (టకర్‌గా), జోష్ హ్యూస్టన్ (మోసెస్‌గా), ఎల్లా న్యూటన్ నటించారు. ఈ సినిమా2025 మే 17న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. జూన్ 6న అమెరికాలో, జూన్ 12న ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది. ఇది ఒక షార్క్-అబ్సెస్డ్ సీరియల్ కిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్ తో రూపొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1 గంట 38 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.7/10 కలిగిఉంది.
స్టోరీలోకి వెళితే
జెఫిర్ ఒక అమెరికన్ సర్ఫర్. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో వ్యాన్‌లో ఒంటరిగా జీవిస్తూ సర్ఫింగ్ చేస్తుంది. ఆమె ఎవరితోనూ పెద్దగా బంధం లేకుండా, స్వేచ్ఛగా జీవిస్తుంది. ఒక రోజు ఆమె మోసెస్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని కలుస్తుంది. వాళ్లిద్దరూ ఒక రాత్రి కలిసి గడుపుతారు. తర్వాత జెఫిర్ ఒక బీచ్‌లో సర్ఫింగ్‌కి వెళ్తుంది. అక్కడ టకర్ అనే షార్క్-అబ్సెస్డ్ సీరియల్ కిల్లర్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. టకర్ ఒక షార్క్ కేజ్ టూరిస్ట్ అట్రాక్షన్ నడుపుతుంటాడు. కానీ అతను ఒక సైకో. చిన్నప్పుడు షార్క్ దాడిలో బతికిన అనుభవం వల్ల అతను షార్క్‌ల పట్ల కోపం పెంచుకుంటాడు. అతను యువతులను కిడ్నాప్ చేసి, తన బోట్‌లో బంధిస్తాడు. వాళ్లను షార్క్‌లకు ఆహారంగా వదిలి, ఆ దృశ్యాలను వీడియోలో రికార్డ్ చేస్తుంటాడు. జెఫిర్‌ని కూడా అతను బోట్‌లో బంధిస్తాడు. ఆమెను షార్క్‌లకు వదలడానికి ప్లాన్ చేస్తాడు.
జెఫిర్ తన తెలివితో, ధైర్యంతో బోట్‌లో బంధించబడినప్పటికీ ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెకు మోసెస్ నుంచి కొంత సహాయం అందుతుంది. ఎందుకంటే అతను జెఫిర్ కనిపించకుండా పోవడంతో గమనించి ఆమెను వెతకడం మొదలుపెడతాడు. కథలో టకర్, జెఫిర్ మధ్య జరిగే ఈ గెట్-అవే గేమ్, షార్క్‌ల చుట్టూ ఉన్న సస్పెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ సినిమాను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. జెఫిర్ తన బలాన్ని, తెలివిని ఉపయోగించి టకర్‌ని ఎదిరించి, బతకడానికి గట్టిగా పోరాడుతుంది. చివరికి జెఫిర్ ఆ సైకో నుంచి తప్పించుకుంటుందా ? లేదా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు … ఈ చురకత్తికి పదునెక్కువే… సింగిల్స్ కి మస్త్ స్టఫ్