BigTV English
Advertisement

IND VS ENG, 4Th Test: మాంచెస్టర్ లో పిడుకులతో కూడిన వర్షం…ఇండియా VS ఇంగ్లాండ్ మ్యాచ్ వాయిదా ?

IND VS ENG, 4Th Test: మాంచెస్టర్ లో పిడుకులతో కూడిన వర్షం…ఇండియా VS ఇంగ్లాండ్ మ్యాచ్ వాయిదా ?

IND VS ENG,4Th Test:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్టులు పూర్తి అయ్యాయి. ఇందులో రెండు టెస్టులు ఇంగ్లాండ్ ని గెలువగా ఒకే ఒక్క టెస్ట్ లో టీం ఇండియా విజయం సాధించింది. అలాగే ఇవాళ నుంచి టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నాలుగు టెస్ట్ మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే స్టేడియంలో.. జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు…. వర్షం విలన్ గా మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ వర్షం తగ్గితేనే మ్యాచ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇవాల్టి మ్యాచ్ వాయిదా పడి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి.


Also Read: Sai Sudharsan: మాంచెస్టర్ లో భారీ వర్షం… కవర్స్ ఉండగానే బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్

మాంచెస్టర్ లో పిడుకులతో కూడిన వర్షం..


టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… వరుణుడు విలన్ గా మారాడు. నిన్నటి నుంచి మాంచెస్టర్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పేశారు. ఇంకా కూడా వర్షం తగ్గలేదు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… అప్పటి వరకు వర్షం తగ్గితే పర్వాలేదు. అలా కాదని వర్షం అలాగే కొనసాగితే కచ్చితంగా మ్యాచ్ వాయిదా పడే ఛాన్స్ లో ఉంటాయి. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్ వాయిదా పడితే రేపటి నుంచి.. నాలుగో టెస్ట్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత వర్షం తగ్గితే కచ్చితంగా మ్యాచ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ జోరుగా వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉందట. మరి వాతావరణ శాఖ చెప్పినట్లే వర్షం పడితే.. ఆటకు అంతరాయం కలగక తప్పదు.

Also Read: BAN VS PAK: 4 గురు డకౌట్…30 పరుగులకే 6 వికెట్లు… పాకిస్థాన్ ఇజ్జత్ మొత్తం పాయె.. ఇక గంగలో దూకేయండి

ఇంగ్లండ్ వర్సెస్ టీం ఇండియా జట్లు ఇవే

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్ (WK), క్రిస్ వోక్స్, లియామ్ డాసన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్ (వికెట్), సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/అన్షుల్ కాంబోజ్

Related News

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

PM MODI: వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేశారంటే ?

IND VS AUS, 4th T20: నేడే 4వ టీ20..టీమిండియాకు అగ్ని ప‌రీక్షే..గిల్ వేటు, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్ !

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

Big Stories

×