Brahmamudi serial today Episode: స్వప్న కూతురు బర్తుడేకు అందరూ గిఫ్ట్‌లు ఇస్తుంటే.. రాజ్ అయ్యో నేను గిఫ్ట్ తీసుకురాలేదు మీరైనా తీసుకొచ్చారా కళావతి గారు అంటూ కావ్యను అడుగుతాడు. అయ్యో నేను తీసుకురాలేదు రామ్‌గారు అంటుంది కావ్య. దీంతో రాజ్ ఏంటండి మీరు సొంత అక్క కూతురు బర్తుడేకు గిఫ్ట్ తీసుకురాకుండా ఉంటారా..? అని ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య మీరు నాకు చెప్పలేదు కదండి అందుకే తీసుకురాలేదు అంటుంది. దీంతో రాజ్ అంటే ఏంటండి చెప్తేనే తీసుకువస్తారా..? చెప్పకపోతే తీసుకురారా…? అందరూ గిఫ్ట్‌లు ఇచ్చారు. మనం ఒక్కరమే ఇవ్వలేదండి పరువు పోతుందండి.. ఇప్పుడు ఏం చేద్దాం అండి అంటుంటే.. టెన్షన్ పడకండి రామ్‌గారు తెచ్చాను లేండి అంటూ వెనక నుంచి గిఫ్ట్ తీసి చూపించగానే వెంటనే లాక్కుని చిట్టితల్లి నీకోసం నేను ఏం గిఫ్ట్ తీసుకొచ్చానో చూడు అంటూ పాప దగ్గరకు వెళ్తాడు రాజ్.
నువ్వు తెచ్చావంటే బాగానే ఉంటుందిరా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని ఇద్రాదేవి అడుగుతుంది. దీంతో రాజ్ చాలా దూరం వెళ్లి వెళ్లి మరీ తీసుకొచ్చాను అంటాడు. ఎక్కడి నుంచి తెస్తే ఏంట్రా నువ్వు తీసుకొస్తే బాగానే ఉంటుంది అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో స్వప్న, కావ్యను ఏంటి కావ్య నువ్వేమి ఇవ్వవా నా కూతురుకు అని అడుగుతుంది. ఆయన ఇచ్చింది నాదే అని కావ్య చెప్పగానే.. అందరూ షాకింగ్‌గా చూస్తారు. రాజ్ సిగ్గు పడుతూ కళావతి గారు కొంచెం చూస్తూ మాట్లాడండి.. నేను మీ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి..? నేనేదో మీ చేతుల్లోంచి దొంగిలించి పాపకు గిఫ్ట్ ఇచ్చాను అనుకుంటారండి.. వాళ్లకు కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి అంటాడు. దీంతో కావ్య అదే అక్కా పాపకు గిఫ్ట్ ఆయన ఇస్తే ఏంటి..? నేను ఇస్తే ఏంటి అని చెప్తున్నాను అంటూ కావ్య చెప్పగానే చాలా థాంక్స్ కళావతి గారు అంటాడు రాజ్.
ఎందుకు నా గిఫ్ట్ కొట్టేసి మీది అని చెప్పినందుకా..? అని అడుగుతుంది కావ్య.. అందుకు కాదండి.. ఫ్లోలో మనిద్దరం ఒక్కటే అని చెప్పినందుకు అంటాడు. ఫ్లో కాదు రామ్‌గారు పొరపాటున వస్తుంటాయి అని కావ్య చెప్తుంది. ఇంతలో ఇంద్రాదేవి.. రాహుల్‌ను చూస్తూ.. ఏంట్రా అందరూ బహుమతులు ఇచ్చారు. కన్నతండ్రివి మరి నీ బహుమతి ఎక్కడరా…తీసుకురాలేదా..?ఏంటి..? అని అడగ్గానే.. తీసుకొచ్చాను అమ్మమ్మ నా కూతురు కోసం ఎక్సలెంట్ డ్రెస్ తీసుకొచ్చాను. మీరు కనక ఆ డ్రెస్ చూస్తూ షాక్ అవుతారు తెలుసా..? అని రాహుల్ చెప్పగానే.. షాక్ అవ్వడం కాదు చచ్చి ఊరుకుంటారు అని మనసులో అనుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం త్వరగా తీసుకుని వచ్చి అందరికీ చూపించు అంటుంది ఇంద్రాదేవి. అలాగే అమ్మమ్మ ఇప్పుడే తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్లి డ్రెస్ తీసుకని వచ్చి స్వప్నకు ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు.
దీంతో స్వప్న డ్రెస్‌ను విసిరిపారేసి దీన్ని ఎవ్వడైనా డ్రెస్ అంటారా…? అంటూ రాహల్‌ను తిడుతుంది. రుద్రాణి మధ్యలో కలగజేసుకుని నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు డ్రెస్సులు ఎలా తీసుకొస్తాడు అంటుంది. అవును స్వప్న నువ్వేమో నాకు డబ్బులు ఇవ్వడం లేదు. నేనేమో జాబ్ చేయడం లేదు. మరి ఎలా తీసుకురావాలి కాస్ట్‌లీ డ్రెస్సులు ఏదో నా దగ్గర ఉన్న డబ్బులతో తీసుకురావాలని వెళ్లాను ఆ డబ్బులకు ఈ డ్రెస్ వస్తుందని ఇచ్చాడు. అందుకే ఇదే తీసుకువచ్చాను. దానికి నేనేం చేయాలి అంటాడు. రాహుల్. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఆ మాట అనడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా..? నీకు.. నీ భార్య డబ్బులు ఇవ్వకపోతే నీ కూతురుకు కనీసం డ్రెస్ కూడా కొనివ్వలేవా..? అంటుంది.. అంతగా అనుకుంటే ఏదైనా పని చేసి ఉండాలి కదా రాహుల్ అని అపర్ణ చెప్పగానే..
పని చేసుకునే కర్మ వాడికెందుకు వదిన అంటుంది రుద్రాణి. దీంతో ఇంద్రాదేవి అపర్ణను తిడుతుంది. దీంతో రుద్రాని ఆస్తులు పంచితే వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు. మీరే ఆస్తులు పంచడం లేదు. వాడు ఇలాగే ఉంటాడు. అనగానే.. ఇంద్రాదేవి అయితే ఈ నాన్న నాకు రాసిన విల్లా ఉంది కదా అది రాసిచ్చేస్తాను అంటుంది ఇంద్రాదేవి.. వద్దని స్వప్న అడ్డు పడుతుంది. రుద్రాని, రాహుల్ అలిగి వెళ్లిపోతారు. బర్తుడే పార్టీకి రావడానికి రేవతి, జగదీస్ రెడీ అవుతుంటారు. మరోవైపు రేవతి వాళ్లకు ఫోన్ చేశానని రాజ్ చెప్పగానే.. థాంక్యూ రామ్ గారు అంటూ కావ్య రాజ్‌ను హగ్ చేసుకుంటుంది. తర్వాత అందరూ కేక్ కటింగ్‌కు రెడీ అవుతారు. ఇంతలో కావ్య కొంచెం ఆగండి అత్తయ్యా నిన్న ఫోన్ చేసి మీరే ఇన్వైట్ చేశారు కదా రేవతి గారిని అని చెప్పగానే అపర్ణ అవును వాళ్లు వచ్చే వరకు ఆగేద్దాం అని చెప్తుంది.
ఇంతలో ఆటో శబ్దం వినిపించగానే కావ్య అదిగో వచ్చేశారు అంటూ ఎదరు వెళ్తుంది. ఆటోలోంచి రేవతి దిగగానే అపర్ణ షాక్ అవుతుంది. కావ్య ఎదురెళ్లి లోపలికి పిలుస్తుంది. భయం.. భయంగా రేవతి జగదీష్ ఇంట్లోకి అడుగుపెడుతుంటే.. అపర్ణ కోపంగా ఎంత ధైర్యం ఉంటే మళ్లీ ఈ ఇంట గడప తొక్కుతావు. అసలు ఏ ముఖం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చావు. మళ్లీ నన్ను నా భర్తను అవమానిస్తావా..? అంటూ అపర్ణ తిడుతుంటే.. కావ్య అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు. మీరే ఫోన్ చేసి పిలిచారు అనగానే.. వీళ్లు అంటే నేను అసలు మాట్లాడేదాన్ని కాదు అంటుంది అపర్ణ. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?