Gundeninda GudiGantalu Today episode july 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. నా కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు విన్ని బయటికి పంపించండి అని సురేందర్ అంటాడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అని బాలు పై సురేందర్ సీరియస్ అవుతాడు. అక్కడకు వచ్చిన శృతి నేనే రమ్మని పిలిచాను. మా ఇంట్లో కలిసి అత్తగారింట్లో కాపురం చేయడానికి వెళుతున్నాను అని శృతి అంటుంది. వెళ్తానంటే నేను పంపించాను ఆ నరకంలోకి నిన్ను మళ్ళీ ఎలా పంపిస్తానని అనుకుంటున్నావని సురేందర్ అంటాడు. తన భర్తతో అత్తింట్లో కాపురం చేయాలని అనుకుంటుంటే మీరు అడ్డుపడతారేంటి? నేనుండగా అలాంటి పని జరగనివ్వను అని బాలు అంటాడు. ఇక శోభన నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని అంటుంది. తల్లి మాట విన్న శృతి హ్యాపీగా వెళ్ళిపోతుంది. మీనా అందరు టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేస్తానని వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది.. ప్రభావతి మాత్రం అరుస్తుంది. శృతి రవి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. రోహిణి మాత్రం షాక్ లో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి, రవి ఇంటికి రావడంతో పాటుగా కేక్ తీసుకొని వస్తుంది. అందరూ కేక్ కట్ చేసి సంతోషంగా ఒకరికొక తినిపించుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అటు మౌనికను వాళ్ళింట్లో వాళ్ళు ఏడుస్తున్నారని ఇంకాస్త ఏడిపించాలని సంజయ్ ఇంటికి తీసుకొస్తాడు. అయితే సంజయ్ ని మౌనికని చూసి అందరూ సంతోషపడతారు. కానీ సంజయ్ మాత్రం అక్కడ సీను చూసి షాక్ అవుతాడు. మీరు గొడవపడి విడిపోయారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని సంజయ్ అడుగుతాడు. నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటామని బాలు దిమ్మతిరిగి పోయేలా చెప్తాడు.
సంజయ్ కేకు ని ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. అయితే బాలు మాత్రం కేకు కాబట్టి నేను చాక్ లాంటివాడిని అందరికంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు కదా బావ అని అంటాడు. వీరిద్దరూ ఒకరికొక తినిపించుకోండి అని బాలు అంటాడు. సంజయ్ కు ఫోన్ రాకపోయినా సరే.. వచ్చినట్లు మేము ఇప్పుడే వస్తున్నాం దగ్గర్లో ఉన్నామని కవర్ చేస్తాడు.. మౌనిక వచ్చింది కదండీ ఈ పూట ఇక్కడే ఉండనీయండి అల్లుడుగారు అని ఎంత అడుగుతున్నా సరే.. సంజయ్ మాత్రం మేము ఇద్దరు వస్తామని చెప్పాము వెళ్లాలి తప్పకుండా అని అంటాడు.
మౌనిక పర్లేదు నాన్న నా పెళ్లయిన తర్వాత మీ అందరిని ఇలా చూసి చాలా సంతోషంగా ఉన్నాను నేను వెళ్లి వస్తాను అని అంటుంది.. అప్పుడే బాలు వాళ్ళు తెచ్చిన కవర్ చూసి బావగారు మనకోసం లడ్డూలు తెచ్చినట్టు ఉన్నారు అందరం పంచుకుందాం పదండి అని అంటాడు. నా చేత్తో నేనే అందరికీ పెడతానని మౌనిక అందరికీ తినిపిస్తుంది. సంజయ్ మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాలు మాత్రం ఎందుకు వచ్చాడో తెలీదు? ఎందుకు వెళ్లారో తెలియదు ఏంటో ఈ మనిషి అని ఆలోచిస్తూ ఉంటాడు.
అన్ని తెలుసుకొని వచ్చినట్లున్నాడే అయితే గుడి విషయం గురించి తెలుసో లేదో మరి అని బాలు అంటాడు. ఈ గుడి ఏంటి మధ్యలో అని శృతి అడుగుతుంది. ఈ గుడి సంగతి నీకు తెలియదు కదా నేను చెప్తాను అని అంటే మీనా మీరు ఆగండి అని బాలుని ఆపుతుంది. శృతి రవి లను పైకి వెళ్ళమని చెప్తుంది. ఇక రాత్రి రవి రెస్టారెంట్ వాళ్లకి ఫోన్ చేసి రేపు కచ్చితంగా వస్తానని మాట్లాడుతూ ఉంటాడు.. పైకొచ్చిన మనోజ్ ఎవరితో రా ఫోను అని అడుగుతాడు. రెస్టారెంట్ వాళ్ళకి రా రేపు వెళ్లాలి కచ్చితంగా అందుకే వస్తాను అని చెప్తున్నాను.
నేను ఇంకా మీ మామ మీ అత్తయ్యతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను.. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మా అత్తయ్య కాస్త అభిమానంగా ఉన్న మా మామతో అస్సలు మాట్లాడను అని రవి అంటాడు. డబ్బులతో మాట్లాడాలి రా ఎప్పుడైనా నీకు అవసరం ఉంటుంది. నీకు రెస్టారెంట్ పెట్టుకోవాలి అనిపిస్తే ఇంట్లో ఒక్క రూపాయి కూడా రాదు శృతికి చెప్తే వాళ్లే నీకు రెస్టారెంట్ పెట్టిస్తారు. నాకు అలాంటి ఆశ ఏమీ లేదు అని రవి అంటాడు.
రోహిణి వాళ్ళ ఆయన లక్షల అంటే గుర్తొచ్చింది రా మీ మామ మలేషియా పెద్ద కోటీశ్వరుడు అంట కదా.. అమ్మ ఆయన పేరు చెప్తుంటే వినడమే తప్ప ఆయన కాలి గోరు కూడా చూడలేదు అని రవి అంటాడు. నేనే చూడలేదు అని అంటాడు.. వస్తారేమో కచ్చితంగా డబ్బులు అడిగి కెనడాకు వెళ్ళొచ్చని నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆయన మాత్రం అక్కడ ఏదో సమస్యలున్నాయి పార్ట్నర్స్ మోసం చేశారని రాలేదట. బాలు అక్కడికి వస్తాడు. పెళ్లాల గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని బాలు అంటాడు. రవి మనోజ్ కి శృతి రోహిణి ఫోన్ చేసి రమ్మని చెప్తారు.
బాలు నాకు ఒక పెళ్ళాం ఉంది కదా.. నా పెళ్ళాము నాకెందుకు ఫోన్ చేయలేదు అని అంటాడు. నువ్వు నాకు ఫోన్ చేసి కిందకి రా టైం అయిందని చెప్పాలి అని మీనా కి ఫోన్ చేసి మరి బాలు చెప్తాడు.. సంజూ మాత్రం వాళ్ళింట్లో చాలా సంతోషంగా ఉన్నారు.. ఇంకొకసారి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తే నేను అస్సలు తట్టుకోలేను మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి అని సంజయ్ అంటాడు. మౌనిక ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనే సామెత ఎందుకే అంటారు మీరు ఎప్పుడు వేరే వాళ్ళు ఇబ్బంది పడాలని కోరుకోకండి అని అంటుంది..
Also Read: శ్రీవల్లి టార్చర్ పై రివేంజ్.. ప్రేమ, నర్మద షాకింగ్ నిర్ణయం.. దొరికిపోయిన భాగ్యం..
ఇంకొకసారి నాకు సలహాలిస్తే అస్సలు ఊరుకోను. కచ్చితంగా ఎక్కడపడితే అక్కడ కొడతాను అది చూసి నీ వాళ్ళు బాధపడాలి. మీ నాన్న అనారోగ్యంతో మంచాన్ని పడి చచ్చిపోవాలని అంటాడు. మీనా దగ్గరకు శృతి వస్తుంది. అయితే రోహిణి కూడా వచ్చి నాకు కూడా టీ కావాలని అడుగుతుంది.. వాళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..