E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు   

Brahmamudi Serial Today Episode July 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు   
Advertisement

Brahmamudi serial today Episode: మదన్‌ బాధతో ఏడుస్తూ.. నీకు ఒక అనాథ గాడు ఎక్కువైపోయాడా..? అంటూ ప్రశ్నిస్తుంటే.. రేఖ బాధగా లేదు నాన్న నువ్వు అలా అనోద్దు నీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను అంటుంది. అందుకు మదన్‌ నో మమ్మీ నువ్వు అర్థ చేసుకునే దానివే అయితే ఆ లక్కీగాడిని కొట్టి నా విలువ పెంచేదానివి కానీ నువ్వు అందరి ముందు కొట్టి వాడి కంటే నన్ను తక్కువ చేశావు. మమ్మీ నువ్వు ఇంతలా చేస్తున్నావు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి..? అసలు ఆ లక్కీగాడికి నీకు ఏంటి సంబంధం..? వాడి కన్నతల్లి ఎవరు..? వాడి కన్నతల్లికి నీకు ఏంటి సంబంధం..? నీ ఇన్లుయెన్స్‌ అంతా యూస్‌ చేసి వాడి తల్లిని వెతికి తీసుకొస్తానని నువ్వెందుకు వాడికి మాటిచ్చావు.. అసలు ఇదంతా నువ్వు ఎవ్వరి కోసం చేస్తున్నావు చెప్పు మమ్మీ అంటూ మదన్‌ ప్రశ్నించగానే.. రేఖ మౌనంగా ఉండిపోతుంది. దీంతో మదన్‌ ఇదే మమ్మీ నీలో వచ్చిన మార్పు.. మీ మధ్య వంద ఉండొచ్చు.. కానీ వాడి కోసం నువ్వే ప్రాణం అనుకునే నీ కొడుకును తక్కువ చేస్తావా..? ఇది నాకు నచ్చలేదు మమ్మీ అంటూ మదన్‌ వెళ్లిపోతాడు.

అర్ధరాత్రి ఐశ్వర్య, శశి కారులో ఇంటికి వస్తుంది. ఇందు చూస్తుంది. ఇందును చూసిన ఐశ్వర్య కావాలనే శశికి ఇంకా క్లోజ్‌గా ఉన్నట్టు మాట్లాడుతుంది. రేపు ఏదైనా పని ఉందా..? అంటూ శశి అడిగితే ఎందుకు అంటుంది ఐశ్వర్య నీకు సర్‌ప్రైజ్‌ ఉంది అని చెప్తాడు. ఒక రింగ్‌ తీసి గిఫ్టుగా ఇస్తాడు. ఐశ్వర్య, శశిని హగ్‌ చేసుకుని థాంక్స్‌ చెప్తుంది. ఇక వెళ్లమని శశిని పంపిచేస్తుంది. తర్వాత ఇందు వచ్చి ఐశ్వర్యను తిడితే ఐశ్వర్య కూడా ఇందును తిట్టి నీకంటే ఎక్కువ ఆస్థి ఉంది వాడితో అంటూ నాకు నీతులు చెప్పడం మానేసి  నీ పని నువ్వు చూసుకో అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

Advertisement

వెంకీకి నందు కాల్‌ చేస్తుంది. కానీ వెంకీ కాల్‌ లిఫ్ట్‌ చేయడు.. సారీ నందు నీతో మాట్లాడాలని నాకు ఉంది. కానీ నువ్వు దుగ్గిరాల ఇంటి అమ్మాయివి.. కాబట్టి నీలో అసలు మాట్లాడను..అంటూ వెళ్లిపోతాడు. నందు బాధగా ఏంటి వీడు నాతో నిన్నటి నుంచి మాట్లాడటం లేదు ఒకసారి చలపతి అంకుల్‌కు కాల్‌ చేద్దాం అనుకుని చేస్తుంది. చలపతి కాల్‌ లిఫ్ట్‌ చేసి వెంకీకి ఇస్తాడు. నందు ఏంట్రా వెంకీ ఏమైపోయావు నువ్వు మెసేజ్‌ పెడితే రిప్లై ఇవ్వలేదు.. కాల్‌ చేస్తే లిప్ట్‌ చేయడం లేదు అని అడిగితే నేను చూసుకోలేదు. అని చెప్పగానే..

సరే నేను ఇప్పుడు వస్తున్నాను కలుద్దాం అని నందు చెబితే సారీ నందు నాకు చాలా వర్క్‌ ఉంది ఇప్పుడు కలవడం కుదరదు అని కాల్‌ కట్‌ చేస్తాడు. చలపతి రేయ్‌ ఎందుకు ఇప్పుడు ఇలా బిహేవ్‌ చేస్తున్నావు అని అడిగితే ఏం లేదు నాన్న ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే మంచిదని నందు దుగ్గిరాల ఇంటి వారసురాలు అన్న నిజం చెప్తాడు. అందుకే నందును అవైడ్‌ చేస్తున్నాను అని వెంకీ చెప్పగానే.. దీంతో చలపతి సరే నీ ఆలోచన కరెక్టేరా.. ఆ ఇంటి అమ్మాయిలకు దూరంగా ఉండు ఆ ఇంటికి దగ్గర అయితే ప్రమాదానికి దగ్గర అయినట్టే అంటూ చెప్పగానే.. వెంకీ మౌనంగా వెళ్లిపోతాడు.

Advertisement

హాల్లో వర్క్‌ చేసుకుంటున్న రేఖ దగ్గరకు లక్కీని తీసుకుని వెళ్తాడు రాజు. రేఖతో లక్కీ వాళ్ల అమ్మను ఎలాగైనా వెతకమని చెప్తాడు. లక్కీ కూడా తన తల్లి గురించి రేఖతో చెప్తూ.. బాధపడతాడు. నా తల్లి నేను పుట్టగానే ఎందుకు వదిలేసిందో తెలియదు.. కానీ ఒక్కసారి అమ్మా అని పిలవాలని ఉంది అంటూ బాధపడతాడు. బయట కూర్చున్న భ్రమరాంబను చూసిన లక్కీ తన అమ్మ అలా ఉంటుందా..? అని అడుగుతాడు. రాజు అలా ఉండదు.. అని చెప్పగానే.. లక్కీ అంత కచ్చితంగా చెప్తున్నావు అంటే మా అమ్మను నువ్వు చూశావా..? అని అడగ్గానే.. అంత జాలి లేకుండా నిన్ను వదిలేసింది అంటే ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఉండొచ్చు.. ఇదిగో ఈ రేఖ పిన్నిలా ఉండొచ్చు అంటూ రాజు చెప్పగానే.. రేఖ షాక్‌ అవుతుంది. రాజు అడ్డమైన వాళ్లతో నన్ను పోల్చకు అంటూ కోపంగా అక్కడి  నుంచి వెళ్లిపోతుంది రేఖ.

తర్వాత అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయాలని ఇందు, రాజులతో కలిసి వ్రతం చేయించాలని నిర్ణయించుకుంటారు. ఇందును పిలిచి అదే విషయం చెబితే.. ఇందు ఒప్పుకోదు.. దీంతో మేము చెప్పేది మీ మంచి కోసమే మా మాట విని ఒప్పుకోమ్మా..? అని అడిగితే.. ఒప్పుకోవడానికి మేము అసలు భార్యాభర్తలమే కాదు.. ఆ నిజం మీకు చెబితే ఎలా ఉంటుందో అని మనసులో బాధపడుతూ సరే నాన్నమ్మ టైం చూసి నేనే చెప్తాను అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

Big Stories

Advertisement
×