BigTV English

Brahmamudi Serial Today June 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు ఫోన్‌ చేసిన యామిని – యామినికి షాక్‌ ఇచ్చిన కావ్య

Brahmamudi Serial Today June 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు ఫోన్‌  చేసిన యామిని – యామినికి షాక్‌ ఇచ్చిన కావ్య

Brahmamudi serial today Episode: రాజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు ఏదైన చేసి ఆపమని ఇంద్రాదేవి, అపర్ణ ఇద్దరూ కలిసి కావ్యకు చెబితే జరిగే పెళ్లి గురించి అయితే భయపడాలి కానీ జరగని పెళ్లికి ఎందుకు భయపడాలి అంటుంది. దీంతో పెళ్లి జరగదు అని ఎలా చెప్తున్నావు అంటూ అపర్ణ, ఇంద్రాదేవి అడగ్గానే ఆ పెళ్లి జరగదని నాకు కాన్ఫిడెంట్‌గా ఉంది అని చెప్తూ వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు యామిని రెండు డ్రెసులు తీసుకుని రాజ్‌ దగ్గరకు వచ్చి ఈ రెండు డ్రెస్సులో నీకు ఏది నచ్చింది అని అడుగుతుంది. దీంతో రాజ్‌ నీకు ఏది నచ్చింది అని అడుగుతాడు. యామిని ఆ వైట్‌ నచ్చింది అని చెప్తుంది. రాజ్‌ కూడా నాకు అదే నచ్చింది అని చెప్పగానే.. యామిన చూశావా మమ్మీ బావకు కూడా నాకు నచ్చిందే నచ్చింది అని చెప్తుంది.


దీంతో వైదేహి అయితే మీ వెడ్డింగ్‌కు ఆ డ్రెస్సే ఫైనల్‌ చేద్దాం అంటుంది. ఇద్దరు అక్కడి న ఉంచి వెళ్లిపోతారు. రూంలోకి వెళ్లిన యామిని ని బేబీ ఇప్పుడు ఎలా ఉంది పెయిన్‌ తగ్గిందా అని అడుగుతుంది. పొద్దున్నే కదా కోసుకున్నాను అప్పుడే ఎలా తగ్గుతుంది అని యామిని చెప్తుంది. దీంత వైదేహి అయినా పెళ్లి కోసం ఇలా కోసుకోవడం ఏంటే నీ పిచ్చి కాకపోతే అంటుంది. దీంతో యామిని ఇది పిచ్చి కాదు మమ్మీ బావ మీద నాకున్న ప్రేమ. బావను దక్కించుకోవడం కోసం చేయ్యేంటి.. అవసరమైతే నా ప్రాణం కూడీ తీసుకుంటాను అంటుంది. వైదేహి కోపంగా అంత పని మాత్రం చేయకే తల్లి నువ్వే ప్రాణంగా బతుకుతున్నాం. కొంచెం మా గురించి కూడా ఆలోచించు అంటుంది. మీ గురించి తర్వాత ఆలోచిస్తాను కానీ ముందు నేను కావ్యకు ఫోన్‌ చేయాలి నువ్వు ఉండు మమ్మీ అని చెప్పగానే.. బేబీ ఇప్పుడు ఆ కావ్యకు ఫోన్‌ చేయడం అంత అవసరమా..? అని అడుగుతుంది.

అవసరమే మమ్మీ నేను బావను పెళ్లి చేసుకుంటున్న విషయం ఆ కావ్యకు తెలియాలి కదా.? మన శత్రువు కళ్ల ముందు మన జెండా ఎగిరితేనే కదా మనం పూర్తిగా గెలిచినట్టు.. ఆ కావ్యకు కాల్‌ చేసి షాక్‌ ఇస్తాను అంటూ కావ్యకు ఫోన్‌ చేస్తుంది యామిని కావ్య లిఫ్ట్‌ చేయగానే.. ఏంటి కావ్య ఫస్ట్‌ రింగ్‌కే లిఫ్ట్‌ చేశావు. నిద్ర పట్టడం లేదా..? అంటుంది. నా నిద్ర గురించి నేను చూసుకుంటాను కానీ ముందు విషయం చెప్పు అని కావ్య అడుగుతుంది. దీంతో యామిని నీకో షాకింగ్‌ న్యూస్‌ కావ్య అంటుంది. ఏటది అని కావ్య అడగ్గానే.. రామ్‌ బావ నేను ఎల్లుండి పెళ్లి చేసుకోబోతున్నాం అని యామిని చెప్పగానే.. కావ్య షాక్‌ అవుతుంది.  ఏంటి న్యూస్‌ వినగానే షాక్‌ అయ్యాయా..? కళ్లు తిరిగి పడిపోతావేమో జాగ్రత్త అంటుంది.  ఆ అవసరం నాకు లేదు ఆయనకు ఇష్టం లేకపోయి ఉంటుంది. నువ్వే ఏదో చేసి ఆయనను బలవంతగా ఒప్పించి ఉంటావు అంటుంది కావ్య. భలే గెస్‌ చేశావు నువ్వన్నది కరెక్టే చనిపోతానని బావను బెదరించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్తుంది. దీంతో కావ్య తన మాటలతో యామినిని రెచ్చగొడుతుంది. రాజ్‌ను తీసుకుని తమ ఇంటికి వచ్చేలా చేస్తుంది. దీంతో యామిని కోపంగా కావ్యతో మీ ఇంటికి  వస్తానని చెప్తుంది.


మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా యామిని, వైదేహి వస్తారు. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. దీంతో యామిని ఏంటి అందరూ అలా చూస్తున్నారు. నేనండి గుర్తు పట్టలేదా అని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ నేను అంటే నువ్వేమైనా దేశానికి ప్రధానివా..? లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివా..? ఇలా చూడగానే అలా గుర్తు పట్టడానికి అని అడుగుతుంది. దీంతో యామిని అదేం కాదండి.. రామ్‌ గారికి కాబోయే భార్యను.. అదే కళావతి గారి ఫ్రెండ్‌ రామ్‌ గారి పియాన్సీని.. రామ్‌ బావకు నాకు పెళ్లి అని చెప్పి.. మీకు కార్డు ఇవ్వడానికి వచ్చాం కదా..? మర్చిపోయారా..? అని చెప్పగానే అంటే ఈ మధ్య డాక్టర్‌ గారు కూడా చెప్పారులేమ్మా అని ఇంద్రాదేవి చెప్తుంది. ఏమని చెప్పారు అమ్మమ్మ గారు అని యామిని అడుగుతుంది. ఇంతలో అపర్ణ కల్పించుకుని అడ్డమైన మనుషులను అనవసరమైన విషయాలను అంటుంటే కళ్యాణ్‌ కల్పించుకుని అంటే మా పెద్దమ్మ ఉద్దేశం ఏంటంటే అనవసరమైన విషయాలను ఎక్కువగా స్టోర్‌ చేసుకుంటే బ్రెయిన్‌ మీద ఎఫెక్ట్‌ పడుతుందని డాక్టర్‌ గారు చెప్పారని అంటాడు.

ఓహో హెల్త్‌ మీద కాన్సెషన్‌ అన్నమాట అంటుంది. దీంతో ఏదో ఒకటి కానీ ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అప్పు అడుగుతుంది. ఎల్లుండే నా పెళ్లి అని చెప్పడానికి వచ్చాను అంటూ యామిని అనగానే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. నా పెళ్లి పనులు అన్ని కావ్య దగ్గరుండి చూడాలి అని చెప్తుంది. దీంతో కావ్య వస్తాను యామిని నేనే కాదు మా ఇంటిల్లి పాది అందరినీ తీసుకొస్తాను అని చెప్తుంది. దీంతో యామిని షాక్‌ అవుతుంది. రుద్రాణి మాత్రం భయంగా ఇది ఏదైనా కొత్త ప్లాన్‌ వేసిందా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్య ఏంటి నన్ను పిలిస్తే ఇంట్లో అందరినీ తీసుకొస్తాను అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా..? మీరే కదా  పెళ్లి కార్డులో సకుంటంబ సపరివార సమేతంగా రావాలని వేశారు కదా అంటుంది. సరే మర్చిపోకండి రేపు నా పెళ్లిలో పెద్ద ముత్తదువు పనులన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పి యామిని వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి సేఫ్.. నర్మద మాటతో మైండ్ బ్లాక్.. ప్రేమ ధీరజ్ ఫైట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. ప్రణతికి పెళ్లి చెయ్యబోతున్న పార్వతి.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నెల తప్పిన అప్పు – తప్పు చేసిందన్న రుద్రాణి

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు డబ్బులిచ్చిన కల్పన.. బాలునే సాక్ష్యం.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

Big Stories

×