Brahmamudi serial today Episode: వద్దు అంటున్నా వినకుండా ఆ కావ్యకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి మరీ బొట్టు పెట్టి పిలిచావు. అదేమో ఒక్కతే కాకుండా కుటుంబం మొత్తం తీసుకుని వస్తాను అంది. రేపు అది వచ్చి ఏం చేస్తుందోనని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇంత కూల్‌గా పవన్ కళ్యాణ్ పాటలు వింటూ కూర్చున్నావు అంటుంది వైదేహి. దీంతో యామిని కూల్‌గా మామ్ రిలాక్స్ ఎందుకు అంత టెన్షన్ పడుతావు. వస్తే రానివ్వు.. అయినా మనం పిలిచింది కూడా రావాలనే కదా అంటుంది యామిని దీంతో వైదేహి కోపంగా ఏంటే రావాలనే కదా వాళ్లు వస్తే ఊరికే కూర్చుంటారు అనుకున్నావా..? పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. రామ్ మనసు మార్చే ప్రయత్నం చేస్తారు అంటుంది.
దీంతో ఎలా చేస్తారు మామ్.. బావకు ఆ కావ్యకు పెళ్లి అయిపోయిందని చెప్తారా..? చెబితే బావకు గతం గుర్తు చేయాలి. వాళ్లు అంత ధైర్యం చేస్తారా..? ఇప్పుడు మా పెళ్లిని ఆపడం ఎవరి తరం కాదు కూల్‌గా పాటలు విందామా అంటుంది యామిని. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ ఆలోచిస్తుంటారు. ఏంటమ్మా ఆ యామినిక అలా మాటిచ్చేశావు మా అందరినీ పెళ్లికి తీసుకొస్తానని అంటావేంటి..? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు సుభాష్. ఇంతలో ఇంద్రాదేవి నాకు అర్థం అయిందిరా సుభాష్ అంటుంది. ఏమి అర్థం అయింది నాన్నమ్మ అని కళ్యాణ్ అడుగుతాడు. ఎమి అర్థం అవడం ఏంట్రా మనవడా..? నా మనవరాలు కావ్య ఆ పెళ్లి ఆపడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అని ఇంద్రాదేవి చెప్పగానే.. అపర్ణ.. ఏంటి కావ్య అత్తయ్యగారు చెప్పేది నిజమేనా..? అని అడుగుతుంది. దీంతో కావ్య నేను పెళ్లి ఆపడానికి ఏ ప్లాన్ చేయలేదు అత్తయ్యా అంటుంది. ఇంతలో స్వప్న ఏంటి కావ్య నువ్వు చెప్పేది అని అడుగుతుంది.
దీంతో కావ్య నిజంగానే నేను ఆ పెళ్లి ఆపడానికి ఏం ప్లాన్ చేయలేదు అని చెప్తుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఏంటి ఏం ప్లాన్ చేయలేదా..? చేయకపోతే మరి దానితో ఎందుకు ప్రగల్బాలు పలికావు అంటూ నిలదీస్తుంది. నేనేం ఫోజులు కొట్టడం లేదు అమమ్మగారు మీ అందరినీ నేను పెళ్లికి తీసుకెళ్తాను అని చెప్తుంది. దీంతో ఇంద్రాదేవి ఎందుకు రావాలి మేము రాము అని చెప్తుంది. దీంతో మీరు తప్పకుండా రావాలి అంటుంది కావ్య.. ఎందుకు రావాలి అక్కడ వాడు ఇంకో అమ్మాయి మెడలో తాళి కడుతుంటే చూసి ఆశీర్వదించాలా అంటూ నిలదీస్తుంది. దీంతో కావ్య అత్తయ్యా మీరు ఆశీర్వదించాల్సిన అవసరం లేదు అక్కడ ఆ పెళ్లి జరగదు అని చెప్తుంది కావ్య. దీంతో పెళ్లి జరగదు అని అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు.. అని రుద్రాణి అడుగుతుంది. జరగదని నాకు తెలుసు.. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. మా ఇద్దరిని కలిపిన ఆ దేవుడే మమ్మల్ని విడిపోకుండా కాపాడతాడు అని నమ్మకం ఉంది అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. తర్వాత ఇంద్రాదేవి, అపర్ణ, అప్పు అందరూ కలిసి తామే ఏదో ప్లాన్ చేసి పెళ్లి ఆపేయాలని డిసైడ్ అవుతారు.
తర్వాత రాజ్, కావ్యకు ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన కావ్య ఇంత రాత్రి పూట కాల్ చేయడం ఏంటండి ఎందుకు కాల్ చేస్తున్నారు అంటూ రాజ్ ను మాట్లాడకుండా తనే మాట్లాడుతుంది. మీ కారణంగా నేను రాత్రిళ్లు లేటుగా పడుకుని పొద్దున్నే లేవలేపోతే నా పనులన్నీ ఎవరు చేస్తారండి.. నాకు ఈ టైంలో మీతో మాట్లాడే ఉద్దేశమే లేదు. ముందు ఫోన్ పెట్టేయండి అంటుంది. దీంతో రాజ్ ఏంటండి మీరు వాగుడు పక్షిలాగా లొడలొడా వాగుతూనే ఉన్నారు. ఏ మాకు పనుల్లేవా..? మేము బిజీగా ఉండమా..? అసలు నేను ఏం చెప్తున్నానో కూడా వినరేంటండి మీరు అంటాడు రాజ్. దీంతో కావ్య మీరేం చెప్తారో నాకు తెలుసు మొన్న రాత్రి అంతా అడవిలో తప్పిపోయాం కదా ఇంటికి క్షేమంగా వెళ్లారా..? ఆరోగ్యం అది బాగానే ఉందా అని అడుగుతారు. నేను క్షేమంగానే ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది ఓకేనా బై అంటూ కాల్ కట్ చేస్తుంది.
దీంతో రాజ్ అనుమానంగా ఎందుకో కళావతి గారు కావాలనే కాల్ కట్ చేశారు. ఒకవేళ పెళ్లి విషయం తెలిసిపోయిందా ఏంటి..? డైరెక్టుగా వెళ్లి విషయం మొత్తం చెప్పేసి వస్తాను అంటూ రాజ్ వెళ్లిపోతుంటే… యామిని వస్తుంది. బావ ఎక్కడికి వెళ్తున్నావు.. నీకొక చిన్న సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను పద బావ అంటుంది. నాకు అర్జెంట్ గా పని పడింది యామిని వెళ్లి వచ్చాక చూస్తాను అంటాడు రాజ్. అయినా వినకుండా యామిని బలవంతంగా రాజ్‌ను తనతో రమ్మని చెప్తుంది. నీకు ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా నాకోసం అవి పక్కన పెట్టు బావ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో రాజ్ సరే నీ ఇష్టం అంటాడు. దీంతో ఒకసారి కళ్లు మూసుకో బావ అంటుంది. రాజ్ కళ్లు మూసుకోగానే.. తన ఫోన్‌లో పెళ్లి మండపం ఫోటో చూపిస్తుంది. రాజ్ మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు.
తర్వాత అపర్ణ, ఇంద్రాదేవి ఆలోచిస్తూ డల్లుగా కూర్చుని ఉంటే రుద్రాణి వచ్చి వాళ్లను చూసి రాజ్, యామినిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ముఖాలు చెట్టు నుంచి తెంపేసిన పువ్వుల్లా వాడిపోయాయి అని మనసులో అనుకుంటూ దగ్గరకు వెళ్లి ఏంటి వదిన ఇంకా రెడీ అవ్వలేదు.. మీరు పెళ్లికి రావడం లేదా..? అని అడుగుతుంది. దీంతో అపర్ణ కోపంగా కళ్లు కనిపించడం లేదా..? మేము ఎప్పుడో రెడీ అయిపోయాము అంటుంది. ఏంటి పెళ్లికి ఇలాగే నార్మల్‌గా వస్తారా..? అని రుద్రాణి అడుగుతుంది. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ కోపంగా రుద్రాణిని తిడతారు. అందరూ హాల్లోకి వస్తారు. రుద్రాణిని తిడతారు. రుద్రాణిని పెళ్లికి తీసుకెళ్లకూడదని.. మనమే ఏ ప్లాన్ చేసినా అది చెడగొడుతుందని ఇంద్రాదేవి చెప్పగానే.. వాళ్లను ఆపేస్తానని స్వప్న చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?