Gundeninda GudiGantalu Today episode june 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రంతా నిద్రపోకుండా మీనా మాత్రం మాలలు కట్టాలని అలానే కూర్చొని మాలలు కడుతూ ఉంటుంది. బాలు చైర్ లో నిద్రపోతూ ఉంటాడు. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే మీనా మాలలు కట్టడం చూసి బాలు కాసేపైన నిద్రపోవచ్చు కదా.. ఒక్కదానివే పూలు కడుతూ కూర్చున్నావా ఇలా అయితే ఎలా అనేసి అడుగుతాడు. నేను డబ్బులు కోసం కట్టలేదండి మీరు ఇచ్చిన మాట కోసమే కష్టపడుతున్నాను అంతే అని మీనా సమాధానం చెబుతుంది. ఆ మాట వినగానే బాలు భార్యపై ప్రేమతో మురిసిపోతాడు. భార్య కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయిన బాలు మీనా కోసం స్పెషల్ టీ ని పెట్టుకొని తీసుకొస్తాడు. ఉదయం మాలలు ఎక్కించిన ఆటోను రౌడీలు తీసుకొని వెళ్తారు. బాలుకు వీరబాబు వార్నింగ్ ఇస్తాడు. బాలుకు ఆటో దొరుకుంతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పూలమాలలున్న ఆటోని ఎవరో ఎత్తుకెళ్లారని బాలు మీనా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఆటో డ్రైవర్ల గ్రూపులో ఈ విషయాన్ని చెప్పడంతో డ్రైవర్ల అందరూ అలర్ట్ అయ్యి బాలు చెప్పిన ఆటో వెతకాలి. ఒక డ్రైవర్ ముందు నుంచే ఆటో వెళ్లడం చూసిన అతను బాలుకి విషయాన్ని వెంటనే చెప్తాడు. ఇక బాలు ఆటో ఎక్కడికి వెళ్తుందో లైవ్ లొకేషన్ పంపించు అని అడుగుతాడు. అటు రాజేష్ కూడా ఈ ఆటో కనిపించడంతో అందరూ డ్రైవర్లు కలిసి ఆటోను పట్టుకోడానికి వెళ్తారు. మొత్తానికి ఆటో దొరికేస్తుంది. అందర్నీ చూసి ఆటోలో ఉన్న వ్యక్తి పారిపోతుంటే పట్టుకొని చితక్కొడతారు.
అప్పుడే బాలు వచ్చి వాడిని నాలుగు తగిలించిన వాడు నిజం చెప్పడు. రాజేష్ ఇదంతా ఇప్పుడు ఎందుకురా అతనికి మాలలు అప్పజెప్పాలి కదా నువ్వు వెళ్లి మాలలు ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్లి మాలలు ఇచ్చేసి వస్తాను అని బాలు మాలలున్న ఆటోని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పటికే ఆ వీరబాబు అశోక్ ని ఓ ఆట ఆడుకుంటాడు. నీ ఫ్రెండు కచ్చితంగా టైం కి రాకపోతే నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు శవాలుగా కనిపిస్తారు అని వార్నింగ్ ఇస్తుంటాడు.. అప్పుడే పూల ఆటో అక్కడికి రావడం చూసి అశోక్ ఊపిరి పీల్చుకుంటాడు.
ఇద్దరు కలిసి మాలలు ఉన్నాయని చెప్తారు. కానీ ఆ పార్టీ లీడర్ మాత్రం బాలుని పట్టుకోండి అని చెప్పి తన మనుషులకు చెప్తాడు. మాలలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని రండి అని పంపిస్తాడు. మాలలు ఉన్నాయని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఏ పార్టీ లీడర్ మీకు డబ్బులు ఇచ్చాడు అని అడుగుతాడు. బాలు మాత్రం నేను మాట ఇచ్చిన తర్వాత నమ్మకంగా చేస్తానన్నా ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు ఎవరో రౌడీ మాలలు ఉన్న తీసుకొని వెళ్ళిపోయాడు. మాలలు ఆటోలో పెట్టిన తర్వాత నేను తీసిన ఫోటోలు ఇవే. ఈ ఫోటోలను ఆటో డ్రైవర్ల గ్రూపులో వేయడంతోనే ఈ ఆట దొరికింది అన్న నా మాట నమ్మండి అని బాలు అంటాడు.
ఆ తర్వాత అతను బాలు టైం కి మాలలు తీసుకురావడంతో నా పరువు కాపాడావ్ అంటూ అన్నదాని కన్నా ఎక్కువగానే డబ్బులు ఇస్తాడు.. బాలు ఇద్దరూ మాలలు కట్టిన వాళ్లకి డబ్బులు ఇవ్వాలని వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకోరు. మీనా మా ఇంటి బిడ్డ మాకు ఏదైనా సాయం చేయాలంటే తానే ముందుండి సాయం చేస్తుంది.అలాంటి మీన దగ్గర మేము డబ్బులు తీసుకుంటామని అంటారు. మాకెప్పుడు ఫంక్షన్లు ఉన్నా చిన్నప్పటి నుంచి మీనా వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తారు. అయితే మా దగ్గర డబ్బులు తీసుకోరు అని వాళ్ళు చెప్తారు.
బాలు కి ఫోన్ రావడంతో పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటాడు. సరే మీనా నీకు బాగా డబ్బులు వచ్చాయి కదా ఈ డబ్బులు తో నువ్వు బంగారు తాడు చేయించుకో అని వాళ్లంటారు. ఇప్పుడు నాకు బంగారు తాడేం అక్కర్లేదు అక్క. ఆయన ఆటో నడుపుతూ కష్టపడుతున్నాడు ఆయనకు కారు కొనివ్వాలి డబ్బులతో అనేసి అంటుంది. ఇక సత్యం ఆటోని ఎవరో తీసుకెళ్లారంట అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రభావతి అక్కడికి వచ్చి ఆటో నెత్తికెళ్లడానికి ఏమైనా చంటి బిడ్డనా మీరు ఊరికే అబద్ధాలు చెబుతున్నారు కదా అనేసి సెటైర్లు వేస్తుంది.
అయితే అప్పుడే ఇంటికి వచ్చిన బాలు మీనా సత్యం కు క్లారిటీగా చెప్తారు. ఆటోని ఎవరు ఎత్తుకెళ్లారు అది రాజకీయ నాయకుల గొడవ నాన్న.. ఈ లీటరు మంచి పని చేస్తుంటాడు కదా అది నచ్చకే ఎవరో తీసుకెళ్లారు అని బాలు అంటాడు. ఇక డబ్బుల్ని సత్యంకిస్తే సత్యం మీ కష్టం మీ దగ్గర పెట్టుకోండి అని మీనాకు తిరిగిస్తాడు. ఇక తర్వాత రోహిణి పార్లర్కి వెళ్తుంటే ప్రభావతి ఆపుతుంది. నువ్వు ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తుంటావు. కానీ కొందరు ఉన్నారు కూరగాయలు కానీ సరుకులు కానీ ఏ దానికి డబ్బులు ఇవ్వరు పైగా నా పేరు పెట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. ఇది విన్న మీనా పైకి గదిలోకి వెళ్లి డబ్బులు లెక్కపెట్టి కిందకి వస్తుంది. ప్రభావతి రోహిణి ఇద్దరూ డబ్బులు ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మీనా అన్ని అప్పచెప్పి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ కోసమైనా కారు నమ్మారు కదా అన్న.. ఇప్పుడు ఆటోతో కష్టపడుతున్నాడు.. కారును కొనిద్దామని అనుకుంటున్నానని అనగానే వాళ్లంతా సంతోష పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..