Brahmamudi serial today Episode: యామిని, రాజ్ ల పెళ్లి ఆపేందుకు దుగ్గిరాల ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంది. అయితే తమ ప్లాన్ నెరవేరాలంటే ఈ పెళ్లికి రుద్రాణి, రాహుల్ రాకూడదని ఇంద్రాదేవి చెప్తుంది. దీంతో స్వప్న వాళ్లను ఆపే బాధ్యత నాది మీరు ఫర్ఫెక్ట్ ప్లాన్ అమలు చేయండి అని చెప్తుంది. అయితే నువ్వు పెళ్లికి రావడం లేదా స్వప్న అని అపర్ణ అడుగుతుంది. మీ స్వప్నం నెరవేరాలంటే ఈ స్వప్న పెళ్లికి రాకూడదు ఆంటీ మీరు వెళ్లండి అంటుంది. అయితే అందరూ వచ్చారు సుభాష్ ఏడీ కనిపించడం లేదు అని అడుగుతుంది. ఆయనకు ఆఫీసులో ఏదో అర్జెంట్ పని ఉందంటే వెళ్లారు అని అపర్ణ చెప్తుంది. మరి నా మనవరాలు ఎక్కడ ఉంది..? అని అడుగుతుంది ఇంద్రాదేవి.
అప్పుడే కావ్య రెడీ అయి వస్తుంది. కావ్యను చూసి అందరూ షాక్ అవుతారు. దగ్గరకు వచ్చిన కావ్య ఏంటి అందరూ అలా చూస్తున్నారు.. అమ్మమ్మ గారు నీ చీర ఎలా ఉంది..? అని అడుగుంది. చీర బాగానే ఉంది. కానీ నీ పద్దతే అస్సలు బాగాలేదు అనగానే.. నేనేం చేశాను అమ్మమ్మగారు అంటుంది కావ్య. చేయాల్సిందంతా చేస్తావు మళ్లీ నేనేం చేశాననని అమాయకంగా అడుగుతావు మనం ఏమైనా షాపింగ్‌కు వెళ్తున్నామా..? లేకపోతే పక్కింటి వాళ్ల ఫంక్షన్‌కు వెళ్తున్నామా..? నీ మొగుడి పెళ్లికి వెళ్తున్నామే.. ఆ చీర ఏంటి..? ఆ ఆనందం ఏంటి..? కొంచెం కూడా బాధగా లేదా..? నీకు అని అడుగుతుంది అపర్ణ. దీంతో కావ్య కూల్‌గా చెప్పాను కదా అత్తయ్యా ఆ దేవుడే మా ఇద్దరికి బ్రహ్మముడి వేశాడని చెప్తుంటే.. ఇంద్రాదేవి కల్పించుకుని అమ్మా తల్లి నీ బ్రహ్మపురాణం అపేయ్ అవతల పెళ్లికి టైం అవుతుంది వెళ్దాం పదండి అంటూ అందరూ కలిసి వెళ్లిపోతారు.
మరోవైపు రూంలో రాహుల్‌ను త్వరగా రెడీ కమ్మని అరుస్తుంది. పెళ్లికి టైం అవుతుంది ఇంకా ఎందుకు రెడీ కాలేదని తిడుతుంది. ఇద్దరూ కలిసి పెళ్లికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలి అంటూ మాట్లాడుకుంటుంటే బయటి నుంచి వచ్చిన స్వప్న అంతా విని డోర్ క్లోజ్ చేసి లాక్ చేస్తుంది. ఇంతలో రుద్రాణి బయటకు వెళ్లడానికి వచ్చి డోర్ తెరవబోతే ఓపెన్ కాదు. ఇంతలో రాహుల్ రెడీ అయి వస్తాడు. ఏమైంది మమ్మీ అని అడుగుతాడు. డోర్ రావడం లేదని చెప్తుంది. రాహుల్ ట్రై చేస్తాడు. ఎవరో బయటి నుంచి లాక్ వేశారు అని చెప్తాడు. రుద్రాణి స్వప్నకు కాల్ చేస్తుంది. స్వప్న కస్టమర్ కేర్ లాగా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడెలా బయట పడాలని రాహుల్‌ను తిడుతుంది.
మరోవైపు యామిని వాళ్ల ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుంటాయి. పంతులు హడావిడిగా అందరి చేత పనులు చేయిస్తుంటాడు. ఇంతలో యామిని పట్టుచీర కట్టుకుని వస్తుంది. వైదేహి ఇప్పుడ పట్టుచీర ఎందుకు కట్టుకున్నావు బేబీ మళ్లీ పసుపు చీర కట్టుకోవాలి కదా అంటుంది. దీంతో వైదేహి భర్త పర్వాలేదులే వైదేహి ఈ పట్టు చీరలో నా కూతురు లక్ష్మీదేవిలా ఉంది. ఈ పెళ్లి తంతు అయిపోయాక మళ్లీ ఈ చీరలో చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏంటో ఉండని అంటాడు. వైదేహి కూడా చాలా బాగుంది అంటుంది. ఇంతలో డోర్ దగ్గరకు వచ్చి అంతా వింటున్న రాజ్ వీళ్లేమో పెళ్లి పనులు అన్ని చేసేస్తున్నారు. ఇక్కడేమో కళావతి గారు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక లాభం లేదు. నేరుగా కళావతి గారి ఇంటికి వెళ్లి విషయం చెప్పాలి అని మనసులో అనుకుని రాజ్ వెళ్లబోతుంటే యామిని ఆపి బావ ఇంకా పట్టు బట్టలు కట్టుకోలేదు.. ఇంకొక గంటలో నలుగు మొదలవుతుంది అని చెప్తుంది.
రాజ్ తాను బయటకు వెళ్తున్నాను అని చెప్తుండగానే.. దుగ్గిరాల ఫ్యామిలీ వస్తుంది. వాళ్లను చూసిన యామిని ఆదిగో కళావతి గారు వచ్చేశారు అని చెప్తుంది. వాళ్లను చూసిన రాజ్ వీళ్లెందుకు వచ్చారు అని అడుగుతాడు. మేమే పిలిచాము కాబట్టే వచ్చారు అని వైదేహి చెప్తుంది. దీంతో మీరు ఎప్పుడు పిలిచారు అని రాజ్ అడగ్గానే.. మేము నిన్న వెళ్లి ఇన్వైట్ చేశాము అందుకే వచ్చారు అని వైదేహి చెప్తుంది. దీంతో రాజ్ అంటే కళావతి గారికి పెళ్లి గురించి ముందే తెలుసు అన్నమాట. అందుకే రాత్రి నాతో సరిగ్గా మాట్లాడలేదు అని మనసులో అనుకుంటాడు. దగ్గరకు వచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీని చూసి రాజ్ సిగ్గుతో తల దించుకుంటాడు.
తర్వాత అందరూ మాట్లాడుకుని లోపలికి వెళ్తారు. తర్వాత రాజ్‌ను అపర్ణ, ఇంద్రాదేవి పక్కకు తీసుకెళ్లి తిడతారు. తమను నమ్మించి నట్టేట్లో ముంచేశావు అంటుంటే రాజ్ ఆగండి అంటూ యామిని సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకే నేను పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి వెళ్లిపోతాడు. అదేమో బ్రహ్మముడి అంటుంది. వీడేమో రాతలో లేని రాధ అంటున్నాడు వీళ్లిద్దరిలో ఒక్కరికి కూడా పెళ్లి ఆపాలన్న భయం లేదేంటి అత్తయ్యా అంటుంది. ఇంతలో అప్పు, కళ్యాణ్ వస్తారు తాము ప్లాన్ ఇంప్లిమెంట్ చేశామని చెప్తారు. తమ ప్లాన్ కోసం సినిమాలో జూనియర్ ఆర్టిస్టులను పెళ్లి ఇంట్లోకి దింపేస్తాడు కళ్యాణ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?