Intinti Ramayanam Today Episode june 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ గారు కంపెనీ కోసం తీసుకున్న 85 కోట్లు మాకు తిరిగి చెల్లించాలి. మీరు ఇప్పటివరకు చెల్లించలేదు అంటే ఏంటిది మేము చెప్తే చేస్తున్నాం. మీరంతా వెంటనే ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళండి అంటూ షాక్ ఇస్తారు.. అప్పుడే అవని ఎక్స్క్యూజ్మీ ఆఫీసర్స్ అని అక్కడికి వస్తుంది. ఇంటి నమ్మి అధికారం ఎవరికీ లేదు అని చెప్తుంది. ఆ మాట విన్న పల్లవి షాక్ అవుతుంది.. ఆస్తులు గురించి అవని ఆఫీసర్స్ తో మాట్లాడుతుంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ఆస్తిలో సగం వాటాన్ని నా పెద్ద కోడలు పేరుమీద రాశాను ఇదిగోండి డాక్యుమెంట్స్ అని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. అవని పేరు మీద ఇల్లు ఉన్న డాక్యుమెంట్స్ ని ఆఫీసర్లకి చూపిస్తారు.. ఆ బ్యాంకు మేనేజర్ అవని పేరు మీద ఉంది. డాక్యుమెంట్స్ ఉన్నాయండి మాకు ఎటువంటి రైట్లు లేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని ఇల్లు దేవాలయం లాంటిది.ఈఇంటిని వదిలి వెళ్ళమని హక్కు ఎవరికీ లేదు. ఇది మావయ్య గారు ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. మనందరికీ ఇది ఒక దేవాలయం అన్న సంగతి మర్చిపోవద్దు అని అవని అందరితో అంటుంది.. నేనుండగా మీరు ఎప్పుడూ ఇలాంటి కష్టాలను ఎదురుకోకూడదు అని అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని పార్వతితో అంటారు. కమల్, శ్రీకర్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్తే అవని వదిన ఫీల్ అవుతుందని అనుకుంటారు. కానీ అవని ఇంట్లోకి ఉండటం ఇష్టం లేదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. శ్రీకర్, కమల్ ను వెళ్ళిపోదామని పిలుస్తాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఈ ఇల్లు వదిన పేరు మీద ఉంది అంటే మనదే కాబట్టి మేము ఇక్కడి నుంచి రామ్ అన్నయ్య అని తెగేసి చెప్పేస్తారు. మీకు మీ వదిన చెప్పింది కాబట్టి మీరు ఇంట్లో ఉంటాను అని అంటున్నారు. నేను ఇంట్లో అస్సలు ఉండను ఇక మీ ఇష్టం అని అక్షయ్ అంటాడు. శ్రీకర్ కూడా వదిన మాటని మేము కాదనలేము అన్నయ్య అని అంటాడు.. తమ్ముళ్లు ఇద్దరు రాకపోయినా సరే మనం వెళ్ళిపోదాం అమ్మ అని అక్షయ్ పార్వతితో అంటాడు.
మీరు ఇద్దరు వెళ్లి లగే సర్దుకుని రా పొండి అని అక్షయ్ పంపిస్తాడు. పార్వతి భానుమతి అక్షయ్ ముగ్గురు లగేజ్ సర్దుకుని కిందకి వస్తారు.. అటు ప్రణతి ఆ ఇంట్లో ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది.. స్వరాజ్యం దయాకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒకసారి అవని కి ఫోన్ చేయండి అని అడుగుతుంది. అవని చేస్తే బాగోదు ముందు బావగారికి ఫోన్ చేస్తానని దయాకర్ అంటాడు. అప్పుడే ఆటోలో అవని రాజేంద్రప్రసాద్ ఇద్దరూ దిగుతారు. అక్కడ జరిగిన పరిస్థితి గురించి అవని చెప్తుంది.
ఆస్తిలో 60 శాతం వాటాన్ని అవని పేరు మీద రాసి మంచి పని చేశారు అని స్వరాజ్యం దయాకర్ ఇద్దరు మెచ్చుకుంటారు. నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తులు ఎలా రాశారు మావయ్య గారు అని అవని అడుగుతుంది. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే ఆఫీస్ ఫార్మాలిటీస్ అంటూ ఎమ్ టి పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్న అమ్మ అని రాజేంద్రప్రసాద్ అంటాడు. స్వరాజ్యం ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళమని హక్కు ఎవరికీ లేదు. ఆయన నీ పేరు మీదే ఉంది కాబట్టి నువ్వు వెళ్లి ఆ ఇంట్లో దర్జాగా ఉండవచ్చని అంటుంది..
దానికి అవని నాకు ఇల్లు కానీ ఆస్తులు కానీ ఏమీ అవసరం లేదు బాబాయ్. నా వాళ్ళందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను అని అవని అంటుంది. ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ ఆస్తులు ఏవి అక్కర్లేదు.. కుటుంబాలు మాత్రమే కావాలి అని అనుకుంటున్నావు నీది ఎంత గొప్ప మనసు. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం అని అంటాడు. అక్షయ్ ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు రెడీ అవుతాడు.
పార్వతిని భానుమతిని అక్షయ్ తీసుకొని వెళ్ళిపోతుంటే శ్రీకర్ కమల్ వద్దని ఆపుతారు. కానీ శ్రియ మాత్రం పార్వతిని నగలు కావాలని డిమాండ్ చేస్తుంది. శ్రియ పై శ్రీకర్ కమల్ సీరియస్ అవుతారు. అవని పేరు మీద కోట్లు విలువ చేసే ఇంటిని రాసిచ్చారు కదా.. మేము నగలు అడగడంలో తప్పు లేదు కదా అని శ్రియ అంటుంది. పార్వతి శ్రియ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ముగ్గురు కోడలికి సమానంగా నేను నగలుస్తాను ఇవిగోండి తీసుకోండి అని పల్లవికి శ్రీయకు నగలు ఇస్తుంది.. వాళ్ళింట్లోంచి వెళ్లిపోవడం కమల్ అవని కి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి చక్రధర్ ప్లాన్ గురించి శ్రీకర్ తెలుసుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..