Brahmamudi serial today Episode: రూం దగ్గర కాపలాగా ఉన్న స్వప్న నిద్రపోతుంది. వెంటనే నిద్ర లేచి రూంలో సౌండ్ రావడం లేదేంటని ఆలోచించి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. కిటికీలోంచి రుద్రాణి, రాహుల్ తప్పించుకుని వెళ్లిపోతుంటారు. స్వప్న షాక్ అవుతుంది. బయటకు వచ్చి చూడగానే రుద్రాణి, రాహుల్ కారులో వెళ్లిపోతుంటారు. నా కళ్లు కప్పి తప్పించుకుని వెళ్లిపోతారా..? ఎక్కడికి వెళ్తారో నేను చూస్తును.. వెంటనే అమ్మమ్మకు ఈ విషయం చెప్పాలి అనుకుంటుంది స్వప్న. మరోవైపు రాజ్‌కు, యామినికి మళ్లీ నిశ్చితార్థం జరుపుతుంటారు. గతంలో నిశ్చితార్థం జరిగినప్పుడు ఇలా తాంబూలాలు మార్చుకోలేదు. ఈరోజు తల్లి స్థానంలో మీరుండి ఈ కార్యం జరిపిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ అపర్ణ గారు అంటుంది వైదేహి.
దీంతో ఇంద్రాదేవి కొన్ని పనులు ఎవరి చేతుల మీదుగా జరగాలో ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి వైదేహి. కాదని మనం ఎంత ప్రయత్నించినా ఇదిగో ఇలా ఆటంకాలు వస్తూనే ఉంటాయి అని చెప్తుంది. ఇంతలో పంతులు అమ్మా శుభ ఘడియలు మొదలయ్యాయి ఇక తాంబూలాలు మార్చుకోండి అని చెప్తాడు. యామిని మాత్రం కావ్యను చూస్తూ చూశావా మీ అత్తగారి చేతుల మీదుగానే తాంబూలాలు తీసుకుంటున్నాను అని మనసులో అనుకంటుంది. కావ్య కూడా మనసులోనే జరుగుతున్నది తాంబూలాలు మార్చుకోవడమే కదా ఇంకా జరిగేది చాలా ఉంది అని మనసులో అనుకుంటుంది. అపర్ణ, వైదేహి తాంబూలాలు మార్చుకోగానే.. పంతులు అమ్మా వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. ఆ తర్వాత నేను పెళ్లికి మంచి ముహూర్తం పెడతాను అని చెప్పగానే.. వైదేహి అలాగే పంతులు గారు అంటూ ఉంగరం కోసం వెతుకుతుంది.
అది అక్కడ లేదని గదిలో ఉందని తీసుకొస్తానని వైదేహి వెళ్లి రూంలో ఉంగరం వెతికి తీసుకుని వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన కనకం.. వైదేహి కిందపడేలా చేస్తుంది. దీంతో వైదేహి చేతిలోని ఉంగరం ఉన్న బాక్స్ కిందపడిపోతుంది. కనకం వచ్చి వైదేహిని పట్టుకుని కింద పడిపోయిన రింగ్ బాక్స్ మార్చి ఇస్తుంది. చూసుకుని నడవాలి కదా వైదేహి గారు ఎత పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకున్నారు అంటుంది కనకం. ఎంత పెద్ద బాధ్యత ఉన్నా నీలా డబ్బున్న వాళ్ల ఇంటికి కూతురును పంపించాలన్నా ఆరాటం నీకు లేదులే అంటుంది వైదేహి.. అవునులేండి.. మీలా పెళ్లైపోయిన వాళ్లను విడగొట్టి.. నాటకాలు ఆడి.. పరాయి వాళ్ల మెగుణ్ని మీ కూతురుకు మొగుడిగా మార్చాలన్నా గొప్ప మనసు నాకు రాలేదు దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను అంటుంది కనకం. దీంతో కోపంగా అక్కడి నుంచి వైదేహి వెళ్లిపోతుంది. కనకం మెల్లగా అక్కడకు వచ్చి విక్టరీ సింబల్ చూపిస్తుంది. వైదేహి బాక్స్ పంతులుకు ఇవ్వగానే.. తెరచి చూసిన పంతులు అమ్మా ఇందులో ఉంగరాలు ఎక్కడ..? అని అడుగుతాడు.
దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ సరిపోయింది. ఈ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువయింది. దోషాలు పోగోట్టాలని చెప్పి ఈ నిశ్చితార్థం జరిపిస్తే ఇది కూడా ఆగిపోయేలా ఉంది. ఏవండి ముత్తయిదులు మీరే ఏమీ అనరేంటి..? అంటుంది. దీంతో ముత్తయిదవులు ఇది అపశకునం.. ఈ పెళ్లి జరగకూడదు.. ఆపేయండి అంటారు. పంతులు కోపంగా కనకాన్ని చూస్తూ ఇదంతా నీ పనా అని మనసులో అనుకుంటాడు. కనకం కూడా లేకపోతే నేను ఉండగా ఈ పెళ్లి జరగనిస్తానా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పంతులు అమ్మా ముహూర్తం దాటి పోతుంది. అసలు ఉంగరాలు ఉన్నాయా లేవా..? అసలు నిశ్చితార్థం జరుగుతుదా..? లేదా..? ముహూర్తం పెట్టమంటే పెడతాను కానీ ఉంగరాలు తీసుకురమ్మంటే తీసుకురాలేనమ్మా అంటాడు. దీంతో యామిని శాస్త్రి గారు కొత్త ఉంగరాలే మార్చుకోవాలా..? పాతవి మార్చుకోకూడదా..? అని అడుగుతుంది. బేషుగ్గా మార్చుకోవచ్చమ్మా అని పంతులు చెప్పగానే యామిని బావ నీ చేతికి ఉన్న ఉంగరం నాకు పెట్టు నా చేతికి ఉన్న ఉంగరం నీ చేతికి తొడుగుతాను అని చెప్తుంది. రాజ్ కూడా ఓకే అంటాడు. ఇద్దరూ ఒకరికొకరు రింగ్స్ తొడుగుకుంటుంటే.. కనకం ఇక లాభం లేదు ప్లాన్ బీ వర్కవుట్ చేయాల్సిందే.. అని అప్పుకు సైగ చేస్తుంది. అప్పు కళ్యాణ్ రెడీగా ఉన్నాడు అంటూ కళ్యాణ్‌కు సైగ చేస్తుంది. కళ్యాణ్ అక్కడి నుంచి పైకి వెళ్తాడు.
ఇంతలో యామిని రాజ్‌కు రింగ్ తొడుగుతుంది. ఇక రాజ్‌ను రింగ్ తొడగమని యామిని అడుగుతుంది. రాజ్ కావ్యను చూస్తుంటాడు. ఇంతలో కళ్యాణ్ బెలూన్స్ పగులగొడతాడు. అందరూ అటువైపు చూస్తుంటే కనకం వెళ్లి యామినికి ఉంగరం తొడుగుతుంది. రాజ్, పంతులు మాత్రమే చూసి షాక్ అవుతారు. ఇంతలో యామిని హ్యాపీగా నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టండి పంతులు గారు అని చెప్తుంది. పంతులు పంచాంగం చూసి రేపను దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కలిసి బయకు వెళ్లి రేపు జరగబోయే పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటారు. ఇంలో అప్పు ఇక మీరు ఏమీ ఆలోచించవద్దు అక్కా బావ వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించింది ఆ యామినిఏ అన్న ఆధారాలు నాకు దొరికాయి అని చెప్తుంది. దీతో అందరూ షాక్ అవుతారు. ఏంటప్పు నీవు చెప్పేది అంటూ అపర్ణ అడుగుతుంది. దీంతో అవును అత్తయ్యా ఇందాకే కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. ఇక ఆ రౌడీ చేత ఆ యామినిని ఇరికించేలా చేయాలి అని అప్పు చెప్తుంది. మరోవైపు ఇంట్లో మెహందీ ఫంక్షన్ కు యామిని రెడీ చేస్తుంది. రాజ్ ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?