Gundeninda GudiGantalu Today episode june 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ అప్పటికే పార్లర్ గురించి ఇంట్లో లీక్ చేస్తాడు.రోహిణి మన పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చింది , క్వీన్ బ్యూటీ పార్లర్ తో మన పార్లర్ కలిపేసింది. ఆ పార్లర్ కి అమ్మపేరు తీసేశారు ఇప్పుడు అంటాడు. అంతే షాక్ అవుతుంది ప్రభావతి. ఇదిగో రోహిణి వచ్చింది కదా తాను చేసిన గొప్ప పని ఏంటో తన నోటితోనే చెబుతుందని మనోజ్ రోహిణి అడ్డంగా ఇరికిచ్చేస్తాడు. బాలు హమ్మయ్య ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలో అనుకున్నాను మొత్తానికైతే ఇలా దొరికిపోయింది అని సంతోషంగా ఫీల్ అవుతాడు.. రోహిణి నువ్వు చేసిన మంచి పని ఏంటో నువ్వే అందరితో చెప్పు అని మనోజ్ అనగానే రోహిణి ముందుగా ప్రభావతికి క్షమాపణ చెప్తుంది. పార్లర్ పేరు మార్చిన విషయాన్ని మీకు ముందు నేను చెబుదామని అనుకున్నాను.. మన బ్రాండ్ ని ఇంకా బిల్డ్ చేసుకున్న తర్వాత మళ్లీ మన పేరుని మనం పెట్టుకోవచ్చు అని రోహిణి చెప్తుంది.. అయితే రోహిణి చెప్పిన మాటని ప్రభావతి మొదటగా విన్నట్లే అనుకుంటుంది. ఆ తర్వాత రోహిణికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మీనా బాలుకు దిమ్మతిరిగే సర్ ప్రైజ్ ఇచ్చింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. బాలు కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని అంటుంది. ఏమైంది అని బాలు టెన్షన్ పడతాడు. ఆటో దొరికితే గుడికొస్తానని మొక్కుకున్నాను.. భర్త పక్కన లేకుండా భార్య గుడికి వెళ్తే అది అసంపూర్ణంగానే ఉంటుంది. మీనాతో వాదించలేక బాలు మీనా తో గుడికి వెళ్తాడు. అక్కడ అంతా హడావిడి చూసి బాలుకి ఏం జరుగుతుందో అర్థం కాదు.. అయితే చివరికి ఆ కారు మీనా నీకోసం గిఫ్ట్ గా ఇచ్చిందని అక్కడ వాళ్ళు చెప్పడంతో బాలు సంతోషంతో షాక్ అవుతాడు.
ఇదేంటి మీనా ఇంత డబ్బులు నీకు ఎలా వచ్చాయని బాలు అడుగుతాడు.. మీరు నా కోసం ఎన్నో చేశారు మీ కోసం నేను ఆ మాత్రం కూడా చేయనా అని మీనా అంటుంది.. పూల మీద డబ్బుల్ని ఇలా కారు కొనడానికి ఉపయోగించాను అని మీనా అనగానే బాలు ఎమోషనల్ అవుతాడు. ఇక మొత్తానికి పూజ అయిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారు. ఇదంతా ఎందుకు చేశావు అని బాలు అడిగితే మీరు నా కోసం ఎందుకు పూల కొట్టు పెట్టించారు అని నేను అంటుంది. మీరు నాకోసం ఇంత చేశారు కదా.. నీకోసం నేను ఈ మాత్రం కూడా చేయనా అని మీనా అంటుంది. అయితే ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్లిపోతారు. మీనా నువ్వు ఇంత తమాషాగా ఉంటే కచ్చితంగా వర్షం పడేలా ఉంది అని కామెడీ చేస్తుంది.
ఎందుకలా అన్నావు అంటే.. మీరు మాట్లాడుతుంటే ఎప్పుడు మౌనంగా తల ఊపేదాన్ని.. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు తల ఊపుతున్నారని అని మీనా అంటుంది. మీ నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని బాలు అనుకుంటాడు.. దారిలో పూల కొట్టు ఉండడంతో అక్కడున్న మల్లెపూలు అన్నిటిని మీనాకు కొనిస్తాడు. మీనా మల్లెపూలను చూసి సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఇదంతా కాదు కారుకొన్న.. విషయాన్ని నేను అర్జెంటుగా అందరికీ చూపించాలి అని బాలు మీనాని తీసుకెళ్తాడు. ముందుగా బాలు కార్ షెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ అందరూ ఈ విషయం మాకు ముందే తెలుసు బాలు అని అంటారు. ఇక బాలు మీనా బాలు అనే స్టికర్ని కారుపై వేపిస్తాడు..
ఇక బాలు కారును తీసుకొని ఇంటికి వెళ్తాడు. కనిపించదు కదా మనోజ్ ప్రభావతి సత్యం ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్ వేరే జాబ్ చూసుకోమని సత్యమంటాడు.. పెళ్లయిన తర్వాత భార్యను కూర్చోబెట్టి పోషించాలి కాని నువ్వు ఇలా.. జాబులు మానేసి ఇంట్లో కూర్చుంటున్నావా..? అని మనోజ్ కు క్లాస్ పీకుతాడు. బాలుని చూడు కారును పోయిన ఆటోతో జీవనం సాగిస్తున్నాడు. ఆ మాట వినగానే ప్రభావతి వచ్చి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటుంది. రోహిణి ప్రభావతిని బుట్టలు వేసుకునేందుకు షాపింగ్ చేసి ఒక చీరను తీసుకొస్తుంది.. అయితే ప్రభావతి చీరని చూడగానే రోహిణి పైన కోపం మొత్తం మాయమైపోతుంది.
ప్రభావతీ చీరను కట్టుకుని కిందికి రాగానే అందరూ బాగుందని మెచ్చుకుంటారు. అప్పుడే మీనా ఇంట్లోకి రావడంతో పూల వాసన అని ప్రభావతి అంటుంది.. బాలు వచ్చి మీరందరూ ఒకసారి బయటికి రండి అని బయటికి తీసుకెళ్ళిపోతాడు.. అయితే దాని రేటు విని ప్రభావతి షాక్ అవుతుంది. ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి 3 లక్షలు అని బాలు అంటాడు. అవునా అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని మీనను అంటారు. ఎలాగోలాగా వచ్చింది అని నేను అంటుంది మొత్తానికి మీనా పై అందరూ ప్రశంసలు కురిపిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..