Brahmamudi serial today Episode: మెహందీ ఫంక్షన్‌కు అంతా రెడీ చేస్తుంటారు. రాజ్ దూరంగా నిల్చుని ఆలోచిస్తుంటాడు. అపర్ణ, ఇంద్రాదేవి దగ్గరకు వెళ్తారు. ఏంటి మనవడా ఎంగేజ్‌మెంట్ రింగ్ చూసుకుని సంబరపడిపోతున్నావా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ కోపంగా మీకు కామెడీగా ఉందా నాన్నమ్మా అంటాడు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది ఈ నిర్ణయం తీసుకోక ముందు ఆలోచించాలి అంటుంది అపర్ణ. దీంతో కనకం గారు చెప్పినప్పటి నుంచి ఇంకా కంగారు పెరిగింది. ఆవిడేమో నాకు యామినికి రాసిపెట్టిలేదు. అందుకే అడ్డంకులు వస్తున్నాయి అంటుంది. కళావతి గారిని చేసుకోవడమే కరెక్టు అంటుంది అంటూ రాజ్ బాధపడగానే.. వాళ్లు వీళ్లు చెప్పడం కాదు. అసలు నీకు ఏమనిపిస్తుందో చెప్పు అని అపర్ణ అడుగుతుంది.
ఈ పెళ్లి వద్దంటే యామిని ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ రాజ్ బాధపడుతుంటే.. ఇంతలో యామినిని తీసుకుని వైదేహి వస్తుంది. అల్లుడు ఏంటి అలా దూరంగా నిలబడ్డారు. వచ్చి యామినికి మెహందీ పెట్టు అని పిలుస్తుంది. దీంతో ఇంద్రాదేవి వెళ్లు వెళ్లి మెహందీ అంట పెట్టు అంటూ వెటకారంగా చెప్తుంది. దీంతో రాజ్ దగ్గరకు వెళ్లగానే.. కావ్య వస్తుంది. కావ్యను చూసి రాజ్ అలాగే నిలబడిపోతాడు. వైదేహి బలవంతంగా రాజ్‌ను యామిని పక్కన కూర్చోబెడుతుంది. ఇంతలో అపర్ణ, అప్పు దగ్గరకు వెళ్లి ఏంటి అప్పు ఏదో ప్లాన్ చేశావు అసలు మెహందీ పెట్టుకోవడానికి ఆ యామిని రాదన్నావు అని అడుగుతుంది. వచ్చినా కూడా పెట్టించుకోవాలి కదా అత్తయ్యా.. ఏం జరుగుతుందో మీరే చూడండి అంటుంది అప్పు.
బయట కానిస్టేబుల్ రౌడీని తీసుకుని వచ్చి చెప్పింది అంతా గుర్తుంది కదా..? కావ్య మేడంను చంపమని చెప్పింది యామిని అని ఫ్రూవ్ చేస్తే నువ్వు ఈ కేసులోంచి బయటపడతావు అని చెప్తాడు. దీంతో ఆ రౌడీ గుర్తుంది సార్.. అంటూ యామినికి ఫోన్ చేస్తాడు. యామిని ఫోన్ చూసి షాక్ అవుతుంది. ఒక్క నిమిషం అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. రౌడీ మేడం బెయిల్ మీద పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేశాను. నాకు రెండు రోజుల టైం ఉంది. నేను కనక ఇప్పుడు దేశం వదిలి పోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు. దానికి మీరే హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. దీంతో యామిని ఓ అవునా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. రేపే నా పెళ్లి ఆ హడావిడిలో ఉన్నాను. నేను తర్వాత ఫోన్ చేయోచ్చా అంటూ వేరే ఎవరితోనో మాట్లాడినట్టు కవరింగ్ ఇస్తుంది యామిని.
దీంతో ఆ రౌడీ నేను పారిపోవడానికి నాకు ఈ ఒక్కరోజే టైం ఉందంటే మీరు పెళ్లి అంటారేంటి..? మళ్లీ నేను రేపు స్టేషన్‌కు వెళ్లాలి. మీ కోసం మీ ఇంటి బయటే నేను వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే సెటిల్ చేసుకుందాం. లేకపోతే మళ్లీ స్టేషన్‌కు వెళితే నా చేత ఆ పనులు చేయించింది మీరే అని నేను కోర్టులో చెప్పాల్సి వస్తుంది. మీ కోసం ఐదు నిమిషాలు వెయిట్ చేస్తాను అని బెదిరించగానే.. యామిని అవునా నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఏమైంది యామిని అని వైదేమి అడగ్గానే.. మా ఫ్రెండ్‌కు ఏదో ప్రాబ్లమ్ వచ్చిందట నన్ను రమ్మంటుంది నేను వెళ్లి వెంటనే వస్తాను అమ్మా అంటుంది యామిని . ఇంతలో ధాన్యలక్ష్మీ బాగుంది యామిని కనీసం ఈ మెహందీ ఒక్కటైనా సరిగ్గా జరుగుతుంది అనుకున్నాను. ఈ లోపల నువ్వే చెడగొట్టుకునేలా ఉన్నావు అంటుంది. ప్రకాష్ కూడా మా వాడు మెహందీ పెట్టడానికి రెడీ అయిపోయాడు ఈ టైంలో ఇంతకంటే ముఖ్యమైన పనేంటి..? అని అడుగుతాడు.
వైదేహి కూడా అవును బేబీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. ముందు మెహందీ కానివ్వు అంటుంది. దీంతో యామిని ఇరిటేటింగ్‌గా ఇంపార్టెంట్ పని అని చెప్పాను కదా మమ్మీ అంటుంది. ఇంతలో ఇంద్రాదేవి ఆ పనేంటో మాకు చెప్పి వెళ్లు యామిని అంటుంది. మాకు చెప్పకపోతే పోయావు. కనీసం నీకు కాబోయే మొగుడికైనా చెప్పు అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ల మధ్య సీక్రెట్స్ ఉండకూడదు కదా అంటుంది. దీంతో యామిని కోపంగా అందరినీ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయట రౌడీ దగ్గరకు వెళ్లిన యామిని కోపంగా రౌడీని బెదిరిస్తుంది. నిన్ను మా బావ ఇక్కడ చూస్తే చంపేస్తాడంటుంది.
దీంతో రౌడీ యామినిని కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఇవ్వనని యామిని అనగానే.. మీరు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయి మీ పేరు చెప్తాను అంటూ బెదిరిస్తాడు. అప్పు, కళ్యాణ్ చాటు నుంచి అంతా గమనిస్తుంటారు. యామిని సరేనని లోపలకి వెళ్లిపోతుంది. ఇంతలో స్వప్న వచ్చి రాహుల్ , రుద్రాణి తప్పించుకుని వచ్చారని చెప్తుంది. అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. రాహుల్, రుద్రాణిలను చూసిన యామిని కోపంగా వారిని తిడుతుంది. ఇంతలో వైదేహి వచ్చి సంగీత్‌కు టైం అవుతుందిరా అని పిలుస్తుంది. సరేనని వెళ్తుంది యామిని ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?