BigTV English

Trump Vs Khamenei: నేను దిగితే ముక్కలే.. తమ్ముడు పక్కెళ్లి ఆడుకోమ్మా

Trump Vs Khamenei: నేను దిగితే ముక్కలే.. తమ్ముడు పక్కెళ్లి ఆడుకోమ్మా

Trump Vs Khamenei: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది? ఇరాన్ కు కనిపించేది చుక్కలేనా? అసలు ట్రంప్ వేసే స్టెప్ ఏంటి? ఇస్లామిక్ దేశాల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. ట్రంప్ మాత్రం తాను ఏదో ఒకటి చేసి హైలెట్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. అందులో భాగంగానే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను వైట్ హౌజ్ పిలిపించుకుని చర్చలు జరపడం కీలకంగా మారింది.


రంగంలోకి దిగితే ఇరాన్ ముక్కలే అంటున్న ట్రంప్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడు రోజులైనా మ్యాటర్ ఎటూ తేలడం లేదు. పైగా రోజురోజుకూ ఆయుధ ప్రయోగాలు ఎక్కువవుతున్నాయి. జనావాసాలూ టార్గెట్ అవుతున్నాయి. తాము రంగంలోకి దిగితే ఇరాన్ ముక్కలే అంటున్నారు ట్రంప్. తాను ఎలాంటి స్టెప్ తీసుకుంటానో ఎవరికీ తెలియదని, దేనికైనా రెడీగా ఉండాలన్నట్లుగా రోజూ వార్నింగ్స్ ఇస్తున్నారు. అప్పుడే ఇరాన్ ఖేల్ ఖతం అంటున్నాడు. అప్పుడే శాంతిమంత్రం అంటున్నాడు. ఏదో ఒకటి కమిట్ మాత్రం కావడం లేదు. అటు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా కాదు ఎవడైతే నాకేంటి అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. మరి అమెరికా యుద్ధ రంగంలోకి దిగితే జరగబోయేదేంటి?


జోర్డాన్, సౌదీ, యూఏఈ అమెరికాతో సంబంధాలు

నిజానికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలోకి ట్రంప్ దిగకపోవచ్చు. దిగాలని డిసైడైతే మాత్రం కథ మరోలా ఉండబోతోంది. అయితే అమెరికా ఎంట్రీ ఇస్తే చాలా పరిణామాలు మారుతాయి. అవేంటో చూద్దాం. ఇరాన్ పై దాడులు పెరగడంతో ఇస్లామిక్ దేశాలు స్టేట్ మెంట్ రిలీజ్ చేశాయి. అరబ్ దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యంపై వ్యూహాత్మకంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇస్తున్నాయి. ఖతర్, ఒమన్ దేశాలకు ఇరాన్‌తో రాజకీయ సంబంధాలున్నాయి. ఘర్షణను తగ్గించడానికి మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. అమెరికా ఎంట్రీ ఇస్తే ఈ దేశాలు సైడ్ అవ్వాల్సిన పరిస్థితి.

ఇరాన్ కు మధ్యవర్తిత్వం కోసం చైనా, రష్యా సపోర్ట్

పాకిస్తాన్ చైనాతో సన్నిహితంగా ఉంది. అలాగే చైనా ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తోంది. అటు రష్యా కూడా సీజ్ ఫైర్ కు రెడీ అవ్వాలంటోంది. అమెరికా ఎంట్రీని తప్పుబడుతోంది. మరో విషయం ఈ యుద్ధం ద్వారా ఇరాన్ లో పాలకుల్ని మార్చేసే వ్యూహం కూడా ఉంది. ఇరాన్ లో జనం స్వేచ్ఛ కోరుకుంటున్నారని, వారికి ప్రజాస్వామ్య లౌకిక దేశంగా ఉండాలనుకుంటున్నారంటున్నారు. పాలన మారితే ఒక సమస్య మారకపోతే అణ్వాయుధ ప్రయోగాలపై స్పీడ్ పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి.

ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై దాడి చేయాలని ఇజ్రాయెల్ రిక్వెస్ట్

అటు ఇజ్రాయెల్‌కు అమెరికా దీర్ఘకాల మిత్రదేశం. సైనిక సహాయం, రాజకీయ మద్దతు అందిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా నేరుగా పాల్గొనకపోయినా, ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి సైనిక సహాయం అందిస్తోంది. ట్రంప్ ఇజ్రాయెల్‌కు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులను మెచ్చుకుంటున్నారు. ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ చేసిన రిక్వెస్ట్ ను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం భారీ బాంబును ప్రయోగించాల్సి ఉంటుంది. అది జరుగుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.

ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ప్రపంచదేశాల జనం తరలింపు

ఇరాన్‌కు రష్యా, చైనా మద్దతు ఇస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణలో మధ్యవర్తిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని, యూఏఈ అధ్యక్షుడితో చర్చించారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని తమ పౌరులను ఖాళీ చేయాలని చైనా, జపాన్, భారత్ సహా చాలా దేశాలు ఇప్పటికే స్టేట్ మెంట్లు రిలీజ్ చేశాయి. తమ పౌరుల్ని సురక్షితంగా తరలించేందుకు వేటికవే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మందిని దేశాలు దాటించేశాయ్ కూడా. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. నెక్ట్స్ ప్రాణనష్టం భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రష్యా, చైనా, పాకిస్తాన్, అల్జీరియా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలంటున్నాయి. సో ఫైనల్ గా అమెరికా జోక్యం అరబ్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

మిడిల్ ఈస్ట్ లో అస్థిరతతో భారత్ పై ఉండే ప్రభావం ఏంటి?

ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు ఆయన మాట ఆయనే వినరు. కొన్ని సార్లు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కారు. ఉన్నట్లుండి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను వైట్ హౌస్ లో లంచ్ మీటింగ్ కు పిలిచారు. లంచ్ చేశారు. చాలా మాట్లాడుకున్నారు. బయట కామెడీ మీమ్స్ హోరెత్తుతున్నాయ్ కూడా. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిపై ప్రేమ ఎక్కువైందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. ఇంతకీ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ మీటింగ్ అవుట్ కమ్ ఏంటి? మిడిల్ ఈస్ట్ లో అస్థిరతతో భారత్ పై ఉండే ప్రభావం ఏంటి?

పాక్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ లంచ్ మీటింగ్

అన్నీ ఒకెత్తు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను వైట్ హౌజ్ లో లంచ్ కు ట్రంప్ ఆహ్వానించడం మరో ఎత్తు. ఈ భేటీ వెనుక బహుముఖ రాజకీయ, వ్యూహాత్మక ఉద్దేశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ, దక్షిణాసియా స్థిరత్వం, నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశపడడం వంటివెన్నో ఉన్నాయి. ట్రంప్ ఒక్క మాట చెబితే తల ఊపడానికి పాకిస్తాన్ రెడీగా ఉంది. అందుకోసమే లంచ్ మీటింగ్ అంటున్నారు. పాకిస్తాన్ ఇరాన్‌తో దాదాపు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. పైగా ఇరాన్‌కు పాక్ సపోర్ట్ కూడా చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులను సార్వభౌమత్వ ఉల్లంఘనగా ఖండించింది కూడా.

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశలు

ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండడంతో ఇరాన్‌కు పాకిస్తాన్ మద్దతును తగ్గించేలా ఒత్తిడి చేయడానికి లేదా తటస్థ ధోరణిని అవలంబించేలా ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇరాన్‌పై దాడుల కోసం పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను ఉపయోగించే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని, బదులుగా పాకిస్తాన్‌కు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను అందించవచ్చన్న వాదనలూ పెరుగుతున్నాయి. ఇంత చేసి ఈ మీటింగ్ లో మునీర్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పిలుపునిచ్చారని వైట్ హౌస్ చెప్పుకుంది. ఆ లెవెల్ కు ట్రంప్ తగ్గిపోయారా అన్న చర్చ జరుగుతోంది. సెటైర్లు పేలుతున్నాయి. కామెడీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

నోబెల్ కు తాను అర్హుడినని, అయినా ఇవ్వరన్న ట్రంప్

తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని, కానీ దానిని తనకు ఇవ్వరని పలు సందర్భాలలో ట్రంప్ కామెంట్ చేశాడు. అది చాలా బాధాకరమని కూడా చెప్పుకున్నారు. అంతే కాదు.. ఇటీవలి భారత్ పాక్ ఉద్రిక్తతలను, యుద్ధాన్ని తానే ఆపానని చాలా సార్లు ట్రంప్ చెప్పుకున్నారు. క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించారు. తాను చెప్పినట్లు వినకపోతే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరిగి ఉండేదన్నారు. అయితే ఈ విషయంలో భారత్ నుంచి ట్రంప్ కు గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. తమ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదని మోడీ ట్రంప్ కు డైరెక్ట్ గా చేప్పేసరికి ట్రంప్ కూడా మాట మార్చారు. ఆ యుద్ధం ఆపింది తాను కాదన్నారు. ఇప్పుడు మ్యాటర్ మరోలా తిరుగుతుండడంతో ఇరాన్ పై యుద్ధానికే సిద్ధమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.

భారత్ పాక్ యుద్ధం ఆపినట్లు ట్రంప్ బిల్డప్

ఇరాన్ అణు ప్రయోగాలను ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతానికి ఆయనను చంపడం లేదన్నారు. అటు ఖమేనీ కూడా ట్రంప్ కు ఘాటుగానే వార్నింగ్స్ ఇచ్చారు. ఇరాన్ జాతి బెదిరింపుల భాషకు లొంగదని, అమెరికా సైనిక జోక్యం వారికే తీరని నష్టానికి దారితీస్తుందన్నారు. అయితే అమెరికా – ఇజ్రాయెల్ టార్గెట్ మెయిన్ గా ఒకటే కనిపిస్తోంది. ఇరాన్ అణు ప్రయోగాలను డిస్టర్బ్ చేయడమే. ఇరాన్ ఫోర్డో న్యూక్లియర్ ఫీల్డ్, భూగర్భంలో చాలా సేఫ్టీగా ఉంది. దాన్ని ధ్వంసం చేయడానికి GBU-57 బంకర్ బస్టింగ్ బాంబ్ వాడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ బాంబ్ ను ఇజ్రాయెల్ సొంతంగా ప్రయోగించే ఛాన్స్ లేకపోవడంతో అమెరికా సహాయం కీలకంగా మారుతోంది. అయితే ఈ బాంబ్ ఒక్కసారి పేలితే గనక ఇది పూర్తిస్థాయి వార్ గా ముదురుతుందంటున్నారు.

బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబు GBU-57

ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబు ఇదే. ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. 13,600 కేజీలు బరువు ఉండే ఈ ఆయుధం, టార్గెట్‌లపై కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్‌ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోతుంది. అమెరికా ఇప్పటి వరకు ఈ వెపన్ ను ఇజ్రాయెల్‌కు ఇవ్వలేదు. నెక్ట్స్ ఇస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. 6 మీటర్ల పొడవు ఉండే ఈ బాంబ్ పేలడానికి ముందు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోతుంది. ఒకేసారి వరుసగా చాలా బాంబుల్ని ప్రయోగిస్తే, అవి భూమి లోపలకు వెళ్లి.. పేలిన ప్రతీసారి చాలా లోతుకు డ్రిల్లింగ్ చేస్తాయి. ఈ బాంబును బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ దీన్ని వాడలేదు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని దీనికి పేరు. అంటే ఎంత పవర్ ఫులో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బాంబును ఇప్పటివరకు ప్రయోగించకపోవడంతో ఇది పని చేస్తుందా లేదా అన్న డౌట్లు కూడా ఉన్నాయి.

జనావాసాలపై దాడులు చేసుకుంటున్న ఇరాన్-ఇజ్రాయెల్

అటు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు పెంచుతోంది. ఓ హాస్పిటల్‌తో సహా జనావాసాలను టార్గెట్ చేసుకుంటోంది. చంపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ లో అమెరికా జోక్యంతో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని UN సెక్రెటరీ జనరల్ గుటెరస్ అంటున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, హిజ్బుల్లాలు, ఇరాకీ షియా మిలిషియాలు అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. హౌతీలు రెడ్ సీలో అంతర్జాతీయ షిప్పింగ్‌పై ఎటాక్స్ మొదలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌కు 30కి పైగా రీఫ్యూయలింగ్ విమానాలు, యూఎస్ఎస్ నిమిట్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను పంపింది. ఇజ్రాయెల్ ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై దాడి చేయడానికి అమెరికా 30 వేల పౌండ్ల బంకర్-బస్టింగ్ బాంబులను ఉపయోగించాలని ఇజ్రాయెల్ కోరుతోంది.

హర్ముజ్ జలసంధిని మూసివేస్తే చమురు మంటలే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట యుద్ధంలో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ, ఇటీవల ఇరాన్ ఆకాశంలో పూర్తి నియంత్రణ తమదే అని, ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలి అని ఇటీవలే పోస్ట్ చేశారు. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని ఆయిల్ ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తే, ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేస్తోంది. దీంతో గ్లోబల్ ఆయిల్ సప్లై ఇప్పటికే ప్రెజర్ పెరిగింది. హౌతీలు రెడ్ సీలో షిప్పింగ్‌పై దాడులు చేస్తే, అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల భారత్, చైనా వంటి దేశాల ఎగుమతులు, దిగుమతులు ఆలస్యమవుతాయి. అమెరికా దాడులు పెరిగితే టెహ్రాన్ వంటి సిటీల్లో జనాల మరణాలు పెరిగే అవకాశం ఉంది. న్యూక్లియర్ సైట్లపై దాడులు రేడియేషన్ లీక్‌లకు దారితీస్తాయి. ఇది ఇరాన్, పొరుగు దేశాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది.

అమెరికా ఎటాక్ చేస్తే ఇరాన్ మరింత రెచ్చిపోవడ ఖాయమా?

అమెరికా దాడులు చేయడం మొదలు పెడితే.. ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగవచ్చు. దీంతో వార్ మరింత పెరుగుతుంది. అటు భారత్ చమురు దిగుమతుల్లో 80% మిడిల్ ఈస్ట్‌పై ఆధారపడుతోంది. హర్ముజ్ జలసంధి మూసేస్తే చమురు ధరలు పెరిగి, భారత ఆర్థిక వ్యవస్థకు ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాదు.. మిడిల్ ఈస్ట్‌లో అంటే యూఏఈ, ఖతర్, సౌదీల్లో 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సంఘర్షణ తీవ్రమైతే వీరిని స్వదేశానికి పంపే అవకాశం ఉంటుంది.

 

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×