Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు మిస్సమ్మ అద్బుతమైన ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా పార్థుకు మనోహరికి పెళ్లి చేయాలని అమర్‌కు చెప్తుంది. తన మాటలతో అమర్‌ను కన్వీన్స్ చేసి అమర్ ఒప్పుకున్నాక.. పెళ్లి వెంటనే చేయాలని బలవంతం చేస్తుంది. మిస్సమ్మ మాట మేరకు అమర్ పంతులును పిలిపించి మనోహరి, పార్థుల పెళ్లికి లగ్నపత్రిక రాయిస్తాడు. లగ్నపత్రిక తీసుకున్న తర్వాత మిస్సమ్మ, మనోహరికి కంగ్రాట్స్ చెబుతూ హగ్ చేసుకుని చెవిలో మనోహరి ఇది నీ మెడలో పడబోయే పలుపుతాడు అంటుంది. మనోహరి షాక్ అవుతుంది. అందరూ మనోహరి, పార్థుకు కంగ్రాట్స్ చెప్తారు.
మనోహరి కోపంతో రగిలిపోతూ.. మిస్సమ్మను తిడుతుంది. ఎంత ధైర్యం ఉంటే పంతులు పిలిపించి నా పెళ్లికే లగ్నపత్రిక రాయిస్తుందా..? అంటూ కోప్పడుతుంటే.. యాదమ్మ వెళ్లి ఓదారుస్తుంది. నిన్ను వదిలించుకోవాలనే వాళ్లు ఈ ప్లాన్ చేశారు మనోహరి అని చెప్తుంది. మనోహరి కోపంతో రగిలిపోతూ.. అవును చంభా ఏదో ఒకటి చేయాలి. వాళ్లు నా పెళ్లి చేసే లోపే ఈ ఇంట్లో శవం లేవాలి. వెంటనే ఈ ఇంట్లో చావుకు ముహూర్తం పెట్టాలి అంటుంది.
మరోవైపు మిస్సమ్మ దగ్గరకు వెళ్లిన రాథోడ్ నవ్వుతూ అబ్బా ఏం ప్లాన్ చేశావు మిస్సమ్మ. ఆ మనోహరి పీడ విరగడి చేసేందుకు అద్బుతమైన ప్లాన్ చేశావు. ఈ ఇంటికి పట్టిన మనోహరి దెయ్యం ఇక వారం రోజుల్లో వదిలిపోతుంది అని సంబరపడతాడు. మిస్సమ్మ మాత్రం ఈ పెళ్లి ఆపేందుకు మనోహరి శత విధాలా ప్రయత్నిస్తుంది రాథోడ్. ఈ పాటికి ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పగానే.. అయితే మనోహరి చావు తెలివి తేటలు చూపించక ముందే ఈ పెళ్లి అయిపోవాలి మిస్సమ్మ అంటాడు రాథోడ్. అవును రాథోడ్ ఈ పెళ్లి జరిగే వరకు మనం మనోహరిని అన్ని విధాలా కట్టిపడేయాలి అని మిస్సమ్మ చెప్తుంది. అయితే పార్థు సార్ లాంటి అమాయకుడికి మనోహరి లాంటి దెయ్యాన్ని కట్టబెడుతున్నందుకు నాకు కొంచెం బాధగా ఉందంటాడు రాథోడ్. అదేం లేదు పార్థు గారు బయటకు అలా కనిపిస్తారు కానీ ఆయన మనోహరి కంటే కరుడగట్టిన నేరస్థులను ఫేస్ చేశారు.. మనోహరి ఆయనకు లెక్కేం కాదు అని చెప్తుంది మిస్సమ్మ.
మనోహరి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటే.. పెళ్లికి వారం రోజులే టైం ఉంది ఇప్పుడు నువ్వేం చేస్తావు మనోహరి అంటూ చంభా అనుమానంగా అడుగుతుంది. వారం రోజులే కాదు ఇవాళే ఏదో ఒకటి చేయాలి చంభా అంటూ ఆలోచించి ఆ వచ్చింది ఐడియా.. చంభా ముందు నువ్వు సరస్వతి వార్డెన్‌కు ఫోన్ చేయ్ అనగానే.. ఫోన్ చేసి ఏం మాట్లాడాలని చంభా అడగ్గానే.. మనోహరి చెప్తుంది. నేను చెప్పినట్టు చెప్పు అనగానే.. చంభా తన ఫోన్‌తో సరస్వతి వార్డెన్‌కు కాల్ చేస్తుంది. తాను అమర్ ఇంట్లో పని చేసే పనిమనిషిని అని పరిచయం చేసుకుని బుజ్జమ్మకు ఆర్మీ వాళ్లు చేసిన సన్మానం గురించి చెప్పి.. మీరు కూడా ఆశ్రమం పిల్లలను తీసుకుని వచ్చి బుజ్జమ్మకు సన్మానం చేయమని చెప్తుంది. సరస్వతి వార్డెన్ చాలా బాగా చెప్పావు రేపే వస్తామని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ మనోహరి నాకు ఒక విషయం అర్థం కాలేదు.. నీ పెళ్లి చెడిపోవడానికి ఆ సరస్వతి వార్డెన్ పిల్లలతో కలిసి ఇంటికి రావడానికి లింకు ఎక్కడుంది. అని అడుగుతుంది. అప్పుడు మనోహరి రేపు వార్డెన్ పిల్లలతో కలిసి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లల్లో ప్రచండ శిష్యుడు కూడా కలిసిపోయి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన ప్రచండ శిష్యుడు బుజ్జమ్మకు ఎత్తుకుని వెళ్లిపోతాడు అని మనోహరి చెప్పగానే.. చంభా ఆశ్చర్యపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.