E-Paper
Advertisement

బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా
Advertisement

R.K.Roja :చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), జగపతిబాబు(Jagapathi babu) వంటి ఎంతోమంది దిగ్గజ హీరోల సరసన హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రోజా (Roja). స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ మధ్య బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఈమెను సుడిగాలి సుధీర్(Sudigali Sudheer).. మీరు బండి మీద వెళుతున్నప్పుడు ఆపి ఆర్సీ చూపించమని అడిగితే ఏం చూపిస్తారు అని ప్రశ్నించగా.. రామ్ చరణ్ ఫోటో చూపిస్తానంటూ రోజా కామెంట్లు చేసింది. మరి రోజా ఎందుకు అలా అన్నారు? అసలేంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ స్కిట్ ప్రోమో రిలీజ్..

విషయంలోకి వెళ్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన రోజా.. మరొకవైపు డ్రామా జూనియర్స్ సీజన్ 9కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), ప్రముఖ హీరో శ్రీకాంత్ (Srikanth) కూడా సహ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో చిన్నపిల్లలు తమదైన టాలెంట్ తో ఆడియన్స్ ను అబ్బుర పరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బ్రదర్ వర్సెస్ 3 సిస్టర్స్ స్కిట్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?

నవ్వులు పువ్వులు పూయించిన లేటెస్ట్ స్కిట్..

స్కిట్ విషయానికి వస్తే..” ఆటో డ్రైవర్ చెల్లెలు ఐఏఎస్ అయిందంట.. నువ్వు ఎప్పుడు అవుతావే ?అని ఆ అన్నయ్య అడిగితే.. ఆ ముగ్గురు చెల్లెల్లో ఒక చెల్లి..”నువ్వు ఆటో డ్రైవర్ అయిన వెంటనే” అంటూ పంచ్ వేస్తుంది. మరో చెల్లి దగ్గరికి వచ్చి.. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగితే.. రికార్డులు రాస్తున్న అన్నయ్య అంటుంది. అందులో చుక్కల ముగ్గు, మరో దాంట్లో రథం ముగ్గు వేసుంటుంది. ఇక మరో చెల్లెలి దగ్గరికి వెళ్తే.. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కోవడానికి ఒక రూ.300 ఇవ్వు అన్నయ్య అని ఆ చెల్లి చాలా అమాయకంగా అడుగుతుంది. అన్నయ్య.. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అంటూ ఫైర్ అవుతాడు. పాపం మధ్యలో సుధీర్ కలుగజేసుకొని చదువుకోవడానికి కదా అయ్యా డబ్బులు అడిగింది అని అడిగితే.. బైపిసి చేసేవారికి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తో ఏం పని అన్నయ్య అంటూ పంచ్ చేస్తాడు. తర్వాత ఇక ఆ ముగ్గురు చెల్లెల్లు మాకు స్కూటీ నేర్పించు అన్నయ్య అంటూ ఒక స్కిట్ చేస్తారు.

ఆర్సీ అడిగితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

Advertisement

ఇక స్కిట్ పూర్తి అవగానే రోజా బరిలోకి దిగుతుంది. రోజా సుధీర్ ను చూస్తూ.. “అన్నయ్య నాకు స్కూటీ నేర్పించవా?” అని అడుగుతుంది. ట్రాఫిక్ పోలీసు ఎక్కడైనా మిమ్మల్ని ఆపి.. ఆర్సీ చూపించమంటే ఏం చేస్తారు ?అని సుధీర్ అడిగగా.. దానికి రోజా..”రామ్ చరణ్ గారి ఫోటో చూపిస్తాను” అంటూ పంచ్ వేస్తుంది. ఇక శ్రీకాంత్ కలగజేసుకొని..” నీ చెల్లెలు తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదంటూ” కౌంటర్ వేస్తాడు.దీనితో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేస్తారు. మొత్తానికైతే స్కూటీలో సుధీర్ని రైడ్ కి తీసుకెళ్తూ.. ఏఐ తో క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుంది . పారాచూట్ రేంజ్ లో మేఘాలలో దూసుకుపోతూ ఫెంటాస్టిక్ ఫన్ రైడ్ అంటూ షేర్ చేసిన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×