Brahmamudi serial today Episode: సామంత్‌ను తానే చంపానని.. చంపిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్లి రాజ్ కారు డిక్కిలో పెట్టించింది తానేనని అంతా కోర్టులో చెప్తుంది అనామిక. వింటున్న రాజ్, కావ్య అపర్ణ, సుభాష్, అప్పు షాక్ అవుతారు. అనామిక నిజం చెప్పడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోపంగా అనామికను కోపంగా చూస్తుంటాడు. ఇంతలో రాజ్ తరపు న్యాయవాది యువరానర్ హత్య అనామిక చేసి ఆ నేరం రాజ్ మీదకు నెట్టడానికి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఫ్యాక్టరీలో వేయించింది. శవాన్ని రాజ్ కారులో పెట్టించింది. మళ్లీ ఏమీ ఎరగనట్టు సామంత్ మిస్సయ్యాడు అని కేసు పెట్టి.. సెర్చ్ చేయించింది యువరానర్. మొదటి భర్తను వేధించిన ఈమె సామంత్ ను కూడా హత్య చేసింది యువరానర్.. ఇలాంటి వ్యక్తి బయటి ప్రపంచంలో ఉండకూడదు ఈమెకు కఠిన కారాగారా శిక్ష వేయాలని కోరుతున్నాను అంటాడు. దీంతో జడ్జి తన తీర్పును ఇస్తాడు.
కేసు పూర్తి వివరాలు తెలుసుకన్న తర్వాతే అనామికే ఈ హత్య చేసిందని కోర్టు నిర్దారించడమైంది. హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధి మీదకు ఈ కేసును మళ్లించినందుకు కోర్టును,చ పోలీసులను పక్కదారి పట్టించినందుకు అనామికకు 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలాగే రాజ్‌ను ఈ కోర్టు నిరపరాధిగా విడుదల చేయడమైనది అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. బయటకు వచ్చాక అపర్ణ ఏడుస్తుంది. దీంతో రాజ్ మమ్మీ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు..నాకు శిక్ష పడలేదు కదా అంటాడు. అపర్ణ ఏడుస్తూనే.. నిన్ను అరెస్ట్ చేసి ఈ రెండు రోజులు స్టేషన్‌కు కోర్టుకు తిప్పుతుంటే.. అదే పెద్ద శిక్షలా అనిపించింది తెలుసా..? ఎంతో మందికి అన్నం పెట్టిన చేతులు ఇవి. నేరానికి అర్థం కూడా తెలియని నీ మీద ఆ అనామికకు అసలు కేసు ఎలా పెట్టిందిరా..? హత్య తనే చూసి దాన్ని మన రాజ్ మీదకు తోసేయాలని చూసినందుకే కదా కోర్టు శిక్ష వేసింది అంటాడు సుభాష్. దీంతో అపర్ణ చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అంటారు. కళ్లు నెత్తికెక్కి.. ఒళ్లు కొవ్వెక్కి.. నేరం చేసి ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తుంది ఆ పాపత్మురాలు అంటుంది. ఇంతలో రాజ్‌కు కళ్యాణ్ కంగ్రాట్స్ చెప్పగానే.. నాకంటే అప్పుకు కళావతికి చెప్పాలి నాకోసం చాలా కష్టపడ్డారు అని చెప్పగానే.. అపర్ణ, సుభాష్ ఇద్దరూ కలిసి అప్పును, కావ్యను మెచ్చుకుంటారు.
ఇంతలో అనామికను పోలీసులు తీసుకుని వెళ్తుంటే.. సుభాష్, అపర్ణ, అప్పు, కావ్య, రాజ్, కళ్యాణ్ తిడతారు. దీంతో అనామిక కోపంగా మీరు విజయ గర్వంతో మాట్లాడుతున్నారని తెలుసు కానీ.. అంటూ ఏదో అనబోతుంటే.. రాజ్ అరెస్ట్ అయిన వాళ్లు ఎక్కువ మాట్లాడితే శిక్ష ఎక్కువ అవుతుంది అనామిక ఇది నా టైం అంటాడు. అపర్ణ మరింత కోపంగా నువ్వు ఎవరి పెంపకంలో పెరిగావో కానీ నీ ముఖంలో కుళ్లు కుతంత్రాలు తాండవిస్తున్నాయి. ముందు అవి తగ్గించుకో అని చెప్తుంది. సుభాష్ కూడా పద్నాలుగు ఏండ్లు జైళ్లో ఉంటుందిగా అన్ని తగ్గించుకుని మార్పు చెందిన మనిషిలా మళ్లీ వస్తుందిలే అంటాడు. డబ్బు డబ్బు అంటూ వాటి వెంట పడ్డావు అవి నీ వెంట రాలేదు. పగ పగ అంటూ వాటి వెంట పడ్డావు చివరికి అవి నిన్ను ఒంటరిదాన్ని చేసేశాయి. కనీసం ఇప్పటికైనా మనిషిలా మారు అంటాడు కళ్యాణ్.
కావ్య వెటకారంగా ఆలస్యం అవుతున్నట్టుంది. అక్కడ నీకోసం జైలు ఎదురుచూస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్లు.. అంటుంది. దీంతో అనామిక.. వెళ్తాను.. కానీ అక్కడే ఉండను నేను పద్నాలుగేల్లు జైళ్లో ఉండటానికి అనామకురాలిని కాదు.. అనామికను నేను అనుభవించిన దానికి అంతకు అంత మీరందరూ అనుభవించేలా చేస్తాను అంటుంది. అప్పు.. పాపం జైళ్లుకు వెళ్తున్నానన్న బాధలో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. తీసుకెళ్లండి అని చెప్పగానే పోలీసులు అనామికను తీసుకెళ్తారు. ఇంతలో రాజ్ ఎవరినో చూసి కంగారుగా భయపడుతూ అటు వైపు పరుగెడతాడు. కావ్య వెళ్లి ఏమైందండి ఎవరి కోసం చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు వెళ్దాం పద అంటాడు.
అందరూ కలిసి ఇంటికి వస్తారు. రాజ్‌కు దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది కావ్య. అందరూ హ్యాపీగా ఉంటే.. రుద్రాణి, రాహుల్ పక్కకు వెళ్లి బాధపడతారు. రాజ్ మళ్లీ తిరిగొచ్చాడని జెలసీగా ఫీలవుతారు. తర్వాత లోపలికి వెళ్తారు. లోపల అందరూ కలసి కావ్య, అప్పును మెచ్చుకుంటారు. ఇంతలో లోపలికి వచ్చిన రుద్రాణి మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారు. మరో సమస్య రాదని గ్యారంటీ ఉందా..? అని అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?