BigTV English

Brahmamudi Serial Today May 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అర్ధ్రరాత్రి కావ్య ఇంటికి వెళ్లిన రాజ్‌ –  రాజ్‌ను తిట్టి వెళ్లగొట్టిన కావ్య

Brahmamudi Serial Today May 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అర్ధ్రరాత్రి కావ్య ఇంటికి వెళ్లిన రాజ్‌ –  రాజ్‌ను తిట్టి వెళ్లగొట్టిన కావ్య

Brahmamudi serial today Episode: మీరు బలవంతం  చేయడం వల్లే నేను ఆయనతో ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఇప్పుడాయన ప్రమాదంలో పడ్డారు. ఇంకోసారి ఆయనతో మాట్లాడి ఇలాంటి తప్పు చేయనని కావ్య చెప్తుంది. దీంతో ఎన్నాళ్లనీ అలా మాట్లడకుండా ఉంటావు వదిన అంటూ కళ్యాణ్‌ అడగ్గానే.. ఆయనకు గతం గుర్తుకు వచ్చి వచ్చే వరకు ఉంటానని కావ్య చెప్తుంది. అయితే ఈ లోపు ఆ యామిని ఊరుకుంటుందా..? పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లి కూడా చేసుకుంటే ఏంటి పరిస్థితి అని అప్పు అడుగుతుంది. దీంతో కావ్య అలాగని మళ్లీ ఆయన ప్రాణాలతో ఆడుకోమంటావా..? అంటుంది. దీంతో అపర్ణ ఒక్కసారి రోడ్డు మీద యాక్సిడెంట్‌ అయిందని రోడ్డు మీదకు వెళ్లడమే మానేస్తామా..? అంటుంది. నిజం చెప్పి ఆయనను శాశ్వతంగా దూరం చేసుకోవడం కన్నా ఎక్కడో ఒకచోట ఆయన సంతోషంగా ఉండటం బెటర్‌ అంటుంది కావ్య.


ప్రాణాలతో ఉంటాడేమో కానీ సంతోషంగా ఉండడు అక్క తను ప్రేమించింది నిన్ను.. నీతోనే తన సంతోషం వెతుక్కుంటున్నాడు అని అప్పు చెప్తుంది. ఇలా అందరూ కావ్యను కన్వీన్‌ చేయాలని చూస్తారు. ఎవరెన్ని చెప్పినా కావ్య వినదు.. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి మీరంతా వెళ్లండి ఇక్కడి  నుంచి అని కసురుకుంటుంది. దీంతో అపర్ణ బాధగా అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య ఒక్కతే ఏడుస్తూ మెట్ల మీద కూర్చుని ఉంటుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు. రాజ్‌ ను చూసి కావ్య షాక్‌ అవుతుంది. ఈయనేంటి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ అత్తయ్యగారిని చూస్తే.. లేనిపోని అనుమానాలు వస్తాయి. నేను మోసం చేశాను అనుకుంటారు. అని మనసులో అనుకుంటూ దగ్గరకు వెళ్లి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఎలా ఉన్నారు అని అడుగుతారు అనుకున్నాను.. మీరేంటి ఇలా అడుగుతున్నారు అంటాడు రాజ్‌. దీంతో కావ్య ఎలా ఉన్నా చూసుకోవడానికి మీ వాళ్లు ఉన్నారు కదా అంటుంది.

కానీ మీరెందుకు రాలేదు అని రాజ్‌ అడగ్గానే.. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. మీరేంటో నాకు అసలు అర్థం కావడం లేదు కళావతి గారు. ఒక్కక్షణం మీరు నా సొంతం అన్నట్టు మాట్లాడతారు. ఇంతలోనే పరాయిదానిలా మాట్లాడతారు. మరోక్కసారి శత్రువులా మారిపోతారు.. అసలు నేనేం తప్పు చేశాను. హాస్పిటల్‌ లో పడిపోతే నన్ను ఎందుకు చూడలేదు.. అసలు ఏమైంది ఎందుకు హాస్పిటల్‌కు రాలేకపోయారు..? యామిని ఏమైనా మీతో మాట్లాడిందా..? చెప్పండి.. అని రాజ్‌ గట్టిగా అడగ్గానే.. కావ్య కోసంగా అసలు ఏంటండి మీ ఉద్దేశ్యం ఏదో నాలుగు సార్లు నవ్వతూ మట్లాడేసరికి  నేనేదో మీ సొంత భార్యను అన్నట్టు నిలదీస్తున్నారేంటి..? మీరు హాస్పిటల్‌ లో ఉంటే చూడ్డానికి నేను ఎందుకు రావాలి. మీరు ఫోన్‌ చేసినప్పుడల్లా నేను లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడాలి. మీకు నాకు ఏం సంబంధం ఉందని మీకు నేను సమాధానం చెప్పాలి. ఏదో రోడ్డు మీద పడిపోతే హెల్ప్‌ చేశారని నాలుగు మాటలు మట్లాడేసరికి ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తారా..? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం ఇలా అర్థరాత్రి మగాళ్లు వచ్చి పోతున్నారు అంటే నా గురించి ఎమనుకుంటారు..? అంటుంది. దీంతో రాజ్‌ అంటే నేను పరాయి వాణ్నా.. అని అడుగుతాడు.


కాకా నా సొంత మనిషి అనుకుంటున్నారా..? అంటుంది కావ్య. మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు తిరిగారు..నేను ఫోన్‌ చేసి పిలవగానే ఎందుకు వచ్చారు. ఇంటికి క్యారేజ్‌ ఎందుకు పంపించారు.  గుడికి వస్తున్నానంటే..గిఫ్టుగా షర్టు ఎందుకు పంపించారు. నాకు అబద్దం చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటాడు రాజ్‌. దీంతో కావ్య మరింత కోపంగా ఇక చాలు ఆపండి మా ఇంట్లో పనివాళ్ళతో కూడా నేను చనువుగానే ఉంటాను. వాళ్లంతా నా వాళ్లై పోతారా..? వెళ్లండి ఇక్కడి నుంచి అంటూ కావ్య చెప్పగానే.. రాజ్‌ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దూరం నుంచి అంతా గమనిస్తుంటారు రాహుల్‌, రుద్రాణి. రాజ్‌ వెళ్లిపోగానే.. ఇది కదా మనకు కావాల్సింది. రాజ్‌ గాడు హాస్పిటల్‌ లో పడేసరికి దీనిక భయం పట్టుకున్నట్టుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించేసింది అనగానే.. అయితే ఇద్దరూ  పర్మినెంట్‌గా విడిపోయినట్టేనా మమ్మీ అంటాడు రాహుల్‌.. లేదురా ఫిఫ్టీ  పర్సెంట్‌ మాత్రమే విడిపోయారు అని రుద్రాణి చెప్తుంది. మరి ఫిఫ్టీ పర్సెంట్‌ ఎలా మమ్మీ అని రాహుల్‌ అడగ్గానే.. మనం పూర్తి చేద్దాం.. వెంటనే వెళ్లి యామినిని కలుద్దాం అంటూ వెళ్లి యామినిని కలుస్తారు. ఇక నుంచి ముగ్గురు కలిసి రాజ్‌, కావ్యలను పూర్తిగా విడదీయాలని ప్లాన్‌ చేస్తారు.

మరుసటి రోజు యామిని, రాజ్‌ దగ్గరకు వెళ్లి కావ్య క్యారెక్టర్‌ మంచిది కాదని.. అది ఎలాంటిదో ప్రూవ్‌ చేసే సాక్ష్యం నా దగ్గర ఉందని చెప్తుంది. అలా తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదని రాజ్‌ చెప్పగానే.. యామిని తన మాటలతో రాజ్‌ను కన్వీన్స్‌ చేస్తుంది. రాజ్‌ సరే అంటాడు. మరోవైపు రుద్రాణి.. యామిని ఇంకా రాలేదని టెన్షన్‌ పడుతుంది. ఇంతలో యామిని, రాజ్‌ను తీసుకుని ఇంటికి వస్తుంది. వాళ్లను చూసిన రుద్రాణి ఇప్పుడు మొదలవుతుంది అసలైన కథ అనుకుంటుంది. యామిని రాజ్‌ తో కలిసి లోపలికి వచ్చి కావ్యను పలకరిస్తుంది. రాజ్‌, యామినిని చూసిన వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×