BigTV English

Brahmamudi Serial Today November 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్యను ఇంటికి తీసుకొస్తానన్న రాజ్‌ – పందెంలో గెలిచి చూపించమన్న కావ్య    

Brahmamudi Serial Today November 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్యను ఇంటికి తీసుకొస్తానన్న రాజ్‌ – పందెంలో గెలిచి చూపించమన్న కావ్య    

Brahmamudi serial today Episode:  జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ స్వరాజ్‌ ఆఫీసుకు వచ్చి తమ ఊరిలో గుడికి నగలు చేయించాలని ఆ ప్రాజెక్టు మీకే ఇస్తున్నానని. ఎంత ఖర్చైనా సరే నగలు బాగుండాలని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత కావ్య,  శృతిని పిలిచి ఫైల్‌ మీద రాజ్‌ సార్‌ సైన్‌ చేశారా? అని అడుగుతుంది. లేదని ఆ ఫైల్‌ తీసుకుని ఇంటికి వెళ్లారని చెప్తుంది శృతి. దీంతో కావ్య కోపంగా ఇంటికి వెళ్తుంది.


హల్లో అందరూ కూర్చుని ఉంటారు. రాజ్‌ కోసం చూస్తుంది కావ్య కనిపించకపోయే సరికి అమ్మమ్మ మీ మనవడు ఎక్కడున్నాడు. మీరు పిలుస్తారా..? నన్ను పిలవమంటారా..? అని అడుగుతుంది. ఇందిరాదేవి ఏమైందని అడుగుతుంది. ఆయనతోనే మాట్లాడాలి అని చెప్తుంది. ఇందిరాదేవి రాజ్‌ను పిలుస్తుంది. రాజ్‌ కిందకు వస్తాడు.  అసలు మీ ఉద్దేశం ఏంటండి అని కావ్య అడుగుతుంది. దీంతో నీ విషయంలోనా.. నా విషయంలోనా.. ? అని రాజ్‌ వెటకారంగా అడుగుతాడు.  కంపెనీ విషయంలో అంటూ  సుగుణ    కంపెనీ వాళ్లకు డిజైన్స్‌ పంపించకుండా ఆ ఫైల్‌ పట్టుకుని ఇంటికి ఎందుకు వచ్చారు అని నిలదీస్తుంది కావ్య.

దీంతో రాజ్‌ ఆ కంపెనీతో డీల్‌ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని చెప్తాడు. మీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలి ఇక్కడ.. నాకు ఒక మాట చెప్పాలి కదా..? ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో రాజ్ నేను నిన్ను సీఈవోగా  గుర్తించలేదు కాబట్టి అని రాజ్‌ చెప్పగానే కావ్య కోపంతో అక్కడ నేను ఉన్నానా..? ఇంకొకరు ఉన్నారా..? అన్నది కాదు. ఆ సీటు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వాలి అంటూ హితబోధ చేస్తుంది. అయినా రాజ్‌  నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చావా..? నా ఒపీనియన్‌ కనుక్కున్నావా..? నాతో డిస్కషన్‌ చేశావా..? అని అడుగుతాడు. దీంతో కావ్య నేను కిందిస్థాయి ఉద్యోగులతో డిస్కషన్‌ చేయను మిస్టర్‌ మేనేజర్‌ అంటుంది.


రాజ్‌ ఇగో హట్‌ అవుతుంది. కోపంగా కావ్యను తిడతాడు. ఇంతలో సీతారామయ్య కల్పించుకుని కావ్యను ఏమైందని అడుగుతాడు. ఆఫీసులో జరిగిన విషయం జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ఆఫీసుకు వచ్చిన విషయం ఫైల్‌ మీద సంతకం చేయకుండా రాజ్‌ ఇంటికి తీసుకొచ్చిన విషయం చెప్తుంది కావ్య. దీంతో సీతారామయ్య కోపంగా రాజ్‌ ను తిడుతూ నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అంటాడు. దీంతో రాజ్ తాతయ్య మీద అలుగుతాడు. రుద్రాణి కూడా రాజ్‌కు సపోర్టుగా మాట్లాడుతుంది. రాజ్‌ తాను ఆఫీసుకు ఎంతో సేవ చేశానని ఆఫీసును ఈస్థాయికి తీసుకొచ్చానని చెప్పుకుంటాడు. దీంతో సీతారామయ్య సరేరా నువ్వు ఇంతగా నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావు. కావ్య కూడా నీ గురించి మంచి సర్టిఫికెట్‌ ఇస్తుంది కాబట్టి. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ప్రాజెక్టు మీద ఇద్దరు విడివిడిగా పని చేయండి. ఎవరి సమర్థత ఏంటో తేలిపోతుంది కదా..? అని చెప్పగానే రాజ్‌.. తాతయ్య ఈ డీల్‌ బాగుంది. నాకు నచ్చింది నాకు ఓకే. మీ సీఈవో గారు ఏమంటారో అంటాడు.

కావ్య ఆలోచిస్తుంది. నువ్వేంటి సరే అని చెప్పకుండా సైలెంట్‌ గా నిలబడ్డావు ఏం ఆలోచిస్తున్నావు అని ఇందిరాదేవి అడుగుతుంది. ఏం లేదు అమ్మమ్మ గారు మీ మనవడు నా చేతిలో ఘోరంగా అపజయం పాలైతే ఆయన ఫేస్‌ అనామిక ఫేస్‌ లా మాడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అంటుంది కావ్య.   మరీ అంతలా ఊహించుకోకు. నీ సామర్థ్యం ఏంటో నువ్వు ఇంటికి వచ్చి నా టాలెంట్‌ గురించి చెప్పినప్పుడే అర్థం అయింది అని రాజ్‌ వెటకారంగా మాట్లాడతాడు.  ఇంతలో సుభాష్‌ ఉత్త పందేమే అయితే కిక్‌ ఏముంది. ఇద్దరిలో గెలిచే వారికి ఏదైనా బహుమతి ఉండాలి కదా..?  అంటాడు. దీంతో తప్పకుండా ఉంటుంది సుభాష్‌. ఆ ప్రసాద్‌ కాంట్రాక్ట్ ను ఎవరైతే మన కంపెనీకి వచ్చేటట్టు చేస్తారో వారినే సీఈవో గా అపాయింట్ చేస్తాను.

అనగానే అందరూ చప్పట్టు కొడతారు. దీంతో రాజ్‌ వాళ్లను ఆపండి అంటూ ఇది పెద్ద గొప్పనా..? ఇంతకన్నా థ్రిల్లింగ్‌ ఉండాలి అంటాడు. అదేంటో నువ్వే చెప్పు అనగానే సరే కళావతి చేతిలో నేను ఓడిపోతే కళావతిని నేను భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తాను. మరి కళావతి ఓడిపోతే ఏం చేస్తుంది అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. సీతారామయ్య మాత్రం నువ్వే చెప్పు అంటాడు. రాజ్‌ ఏం చెప్తాడా..? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. కళావతి నా చేతిలో ఓడిపోతే జీవితాంతం ఆఫీసులో అడుగుపెట్టకూడదు అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కావ్య మాత్రం ఈ డీల్ తనకు ఓకే అంటుంది.

తర్వాత సీతారామయ్య, ఇందిరాదేవిల దగ్గరకు వెళ్లిన కావ్య.. తనకు ఎందుకో ఈ పందెం నచ్చలేదని ఆయన ఓడిపోయినా.. నేను ఓడిపోయినట్టే కదా? అని చెప్తుంది. అయితే మేము ఇదంతా చేసేది మిమ్మల్ని ఓడించడానికి కాదు. మిమ్మల్ని కలపడానికి అని అపర్ణ చెప్తుంది. ముగ్గురు కలిసి కావ్యను కన్వీన్స్‌ చేసి పందెంలో గెలవాలని చెప్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×