BigTV English

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

IPL 2025: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం ఇప్పటి నుంచే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో (IPL) వేలానికి వస్తే తాను ఎంత ధర పలుకుతానని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిషబ్ పంత్ ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కి (IPL 2025) ముందు మెగా వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చిన ఐపీఎల్ వర్గాలు నవంబర్ మూడవ వారంలో వేలాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.


Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

ఒకవేళ నేను వేలానికి వెళితే నన్ను ఎవరైనా తీసుకుంటారా? లేదా? ఒకవేళ వేలంలో తీసుకుంటే నేను ఎంత ధరకు అమ్ముడు అవుతానంటూ తన పోస్టులో రాసుకోచ్చాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ (Rishabh pant) ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. పంత్ కోసం ఫ్రాంచైజీలు అన్నీ ఎగబడతాయన్న సంగతి తెలిసిందే. మరి ఢిల్లీ మాత్రం పంత్ ను వదిలిపెట్టే ఛాన్స్ అసలు ఉండదు. అయితే రిశబ్ సరదాగా ఈ పోస్ట్ చేసి ఉంటాడని తన అభిమానులు పేర్కొంటున్నారు. ఇక రిషబ్ పంత్ (Rishabh pant) పెట్టిన పోస్ట్ కింద కొంతమంది మీరు కనీసం 20 కోట్లు అయినా దక్కించుకుంటారని కామెంట్లు పెడుతున్నారు.


 

నువ్వు ఓ దిగ్గజం. నిన్ను కొనేంతస్థాయి ఎవరికి లేదంటూ బదిలిస్తున్నారు. మరోవైపు రిషబ్ పంత్ ను (Rishabh pant) కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ సహాయజమాని పార్థ్ జిందల్ ఇటీవలే వెల్లడించారు. మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్ (Retention) విధానంపై ఇటీవల స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాడు. పంత్ ను మాత్రం అసలు వదులుకోము. కచ్చితంగా రిటైన్ చేసుకుంటామనీ స్పష్టం చేశారు.

Also Read: Team India: పాకిస్తాన్ దారుణ ఓటమి.. ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

వేలంలో ఏం జరుగుతుందో చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీలో రిషబ్ పంత్ వెళ్లడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తలను పంత్ తీవ్రంగా ఖండించాడు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. 2016 నుండి రిషబ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2021 నుండి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే… రిషబ్ పంత్ (Rishabh pant) రెండేళ్ల కిందట కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర వైద్యుల నిర్వహాణలోనే ఉన్నాడు రిషబ్ పంత్. ఆ తర్వాత కోలుకున్న రిషబ్ పంత్ (Rishabh pant) … మళ్లీ టీమిండియా లోకి రావడం జరిగింది.

Related News

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

Big Stories

×