BigTV English

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్
Brahmamudi Serial Today September 12th Episode: నాకెవరు లేని ఈ ఇంట్లోంచి నా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే నాకు మంచిది మీకు మంచిది అంటుంది కావ్య. మీ భార్యతగా నా పాత్ర ముగిసింది ఇక సెలవు అంటూ కావ్య వెళ్లిపోతుంది. దీంతో రుద్రాణి, రాహుల్ హ్యపీగా ఫీలవుతుంటారు. ఇంతలో ఇందిరాదేవి వెళ్లిపోతున్న కావ్యను ఆపమని సీతారామయ్యకు చెప్తుంది. అయితే వస్త్రాపహరణం అంటే చీర లాగటమేనా చిట్టి.. ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని పది మందిలో దెబ్బతీయడం కాదా. అది చూస్తూ నేను ధృతరాష్ట్రుడిగా మిగిలిపోయాను. అంటాడు. ఇంతలో కావ్య గుమ్మం దగ్గరకు వెళ్లగానే స్వప్న, సుభాష్ అపాలని చూస్తారు. కానీ అత్తింటి గడపకు ఇదే నా తుది వీడ్కోలు అని చెప్తుంది. సుభాష్, స్వప్న చెప్పినా వినదు. రాజ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కావ్య వెళ్లిపోతుంది.
పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన కావ్య
రాత్రి పూట పుట్టినింటికి వెళ్లిన కావ్య ఇంటి మెట్ల మీదే కూర్చుని ఏడుస్తుంది. కావ్యను చూసిన కనకం, మూర్తి షాక్ అవుతారు. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతారు. లోపలికి రామ్మా అంటూ పిలుస్తారు. దీంతో నేను లోపలికి రావాలంటే మీ అనుమతి కావాలి అమ్మా అంటూ ఏడుస్తుంది కావ్య. దీంతో నీ ఇంట్లోకి రావడానికి నీకు మా పర్మిషన్ ఏంటమ్మా అని అడుగుతారు. అయితే నేను పండగకో పబ్బానికో మీ ఇంటికి రాలేదని.. పుట్టెడు దుఃఖాన్ని మూటగట్టుకుని మెట్టినింటి బంధాన్ని తెంచుకుని వచ్చాను. మీ ఇంట్లో నాకు ఉండటానికి కాస్త చోటు ఇస్తారా? నాకు ఓ ముద్ద తిండి పెడతారా? అంటూ ఏడుస్తూ అడగడంతో కనకం, మూర్తి బాధపడతారు.
నువ్వు మాకు బరువు అవుతావా తల్లి అంటూ ఓదారుస్తారు. నువ్వు పరాయిదానిలా మాట్లాడతావేంటమ్మా ఇది నీ ఇల్లు అమ్మా అని కృష్ణమూర్తి చెప్పగానే.. నేను పుట్టి పెరిగినంత మాత్రాన ఇది నా ఇల్లు ఎలా అవుతుంది. నాన్నా నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిచారు. అదే నా ఇల్లు కానీ ఇప్పుడు ఆ ఇంటిని కూడా వదిలేసుకుని వచ్చాను. అందుకే మీ ఇంట్లో నాకు కాస్త చోటిస్తారా? అని అడుగుతున్నాను నాన్నా అంటుంది కావ్య. చావైనా బతుకైనా అత్తారింట్లోనే ఉండాలి అనే తల్లిని నేను కాదమ్మా.. అక్కడ ఎంత కష్టం వస్తేనో నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావని నేను అర్థం చేసుకోగలను తల్లి అంటుంది కనకం. ఇది నా ఇల్లు మాత్రమే కాదమ్మా.. ఈ ఇంటిని అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కష్టపడి ఈ ఇంటిని నిలబెట్టావు. ఈ ఇంటి మీద నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉందని చెప్పి కావ్యను ఇంట్లోకి తీసుకెళ్తారు కనకం, మూర్తి.
అన్నదమ్ముల్ల మధ్య మొదలైన గొడవ
 మరోవైపు కావ్యను ఇంట్లోంచి వెల్లగొట్టారని తెలుసుకున్న కళ్యాణ్ ఇంటికి వచ్చి రాజ్ ను కోపంగా బయటకు రమ్మని పిలుస్తాడు.   బయటకు వచ్చిన రాజ్ ను   కళ్యాణ్ నిన్ను నమ్మిన వాళ్లుక నువ్వు ఏమిచ్చావు..? ఇప్పుడేం ఉంది నీ దగ్గర? అని అడగ్గానే సరే నీ దగ్గర ఏముందో చెప్పు అంటాడు రాజ్. నా దగ్గర నా భార్య ఉంది. నీ దగ్గర నీ భార్య ఉందా? అంటూ ప్రశ్నిస్తాడు కళ్యాణ్. దీంతో రాజ్ కోపంగా  రాయబారానికి వచ్చావా? రాజీ కుదర్చడానికి వచ్చావా? ఆమె వచ్చి తన గోడు నీతో  చెప్పుకుందా..? అంటాడు. ఆమె చెప్పుకునేదే అయితే ఈ కౌరవ సభలోనే చెప్పుకునేది కదా. అయినా నువ్వు వదినను ఎందుకు అవమానించావు. ఆమె ఇల్లు విడిచి వెళ్తున్నా కూడా నువ్వెందుకు ఆపలేదు అంటూ కళ్యాణ్ ప్రశ్నించడంతో.. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిపోయినదాన్ని నేనెందుకు పట్టించుకోవాలి. అందుకే ఊరుకున్నాను  అంటాడు రాజ్. అయితే నేను కూడా అలాగే వెళ్లిపోయాను. మరి నన్నెందుకు పట్టించకున్నావు.  నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలిని చీకట్లోకి పంపేవరకు దిగజారిపోయిందా నీ ఔన్నత్యం.
మందర, కైకేయి మాటలు నమ్మావా? 
అని కల్యాణ్  ప్రశ్నిస్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుపడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీని కళ్యాణ్ చెడామడా తిడతాడు.  నీకు మాట్లాడే హక్కే లేదు. అసలు నీవు తల్లివేనా? అంటూ ధాన్యలక్ష్మీ మీద ఫైర్ అవుతాడు కళ్యాణ్. దీంతో ధాన్యలక్ష్మీ నోరు మూసుకుంటుంది. ఇక  కావ్య గురించి కావ్య చేసిన త్యాగాలు గురించి చెప్తూ కళ్యాణ్ ఎమోషన్ అవుతాడు.  రుద్రాణిని చూపిస్తూ  ఆ మందర మాటలు నమ్మి వదినను వెళ్లగొట్టావా? ధాన్యలక్ష్మీని చూపిస్తూ..  లేక ఈ కైకేయి మాట పట్టుకుని వదినను దూరం చేసుకున్నావా? అని కళ్యాణ్ అనడంతో  రాజ్ కోప్పడతాడు. నువ్వు కవిలా ఆలోచిస్తున్నావు కళ్యాణ్.  కవిత్వం వేరు వాస్తవం వేరు. అయినా ఒకవైపు అమ్మ చావుబతుకుల్లో ఉంటే.. అందుకు  కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ.. నన్నే ప్రశ్నిస్తున్నావా? నువ్వు అంటూ రాజ్ అనడంతో ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది.


Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×