Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఫ్లై ఓవర్ కోసం ఆర్చ్‌ను రెడీ చేస్తోంది జీహెచ్ఎంసీ.
హైదరాబాద్ సిటీలో అత్యంత ప్రాధాన్యం పొందింది తెలుగు తల్లి ఫ్లైఓవర్. దీని పేరు మార్చుస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్‌లో 1.1 కిలోమీటర్ల పొడవు ఈ ఫ్లైఓవర్. సెప్టెంబర్ 24, 2025 వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు స్థిరపడింది. పేరు మార్పడమేకాదు.. ఫ్లైఓవర్‌కు రెండు వైపులా ఆర్చ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది.
ఆర్చ్‌లపై తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక కళా రూపాలు ప్రతిబింబించేలా డిజైన్లు రానున్నాయి. తెలంగాణ గౌరవం, సాంస్కృతిక వారసత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నారు అధికారులు. GHMC ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా అధికారికంగా ప్రకటన రానుంది.
ALSO READ: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-10 అభ్యర్థులు
ఈ ఫ్లైఓవర్ లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది. దీనిని నియంత్రించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 1997 లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు నిర్మించిన ఈ వంతెనను 2005లో రాకపోకలు మొదలయ్యాయి.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌గా అప్పట్లో నామకరణం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. అలాగే ఈ వంతెన అశోక్‌నగర్, ఇందిరానగర్ ఏరియాలను సికింద్రాబాద్‌తో అనుసంధానించడంలో కీలకంగా మారింది. ఈ వంతెనక కారణంగా లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్ళే వాహనదారుల రద్దీ తగ్గింది కూడా.