KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తులం బంగారం ఇచ్చి మోసం చేసిన వ్యక్తి ఫొటోను పోలీసు స్టేషన్ లో పెట్టాలని ఎద్దేవా చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీసు వాళ్లు రావొద్దని, వచ్చిన వారి ఫొటోలు తీసుకుంటామని చెప్పినా రైతులు ధైర్యంగా ముందుకు వచ్చారని గుర్తుచేశారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.2500 ఇస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఫొటోలు తీసి ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. హామీలు ఇచ్చిన మోసం చేసిన వ్యక్తి ఫొటోను స్టేషన్ పెట్టాలా? లేక మన ఫొటో పెట్టాలా? అని ప్రశ్నించారు. 420 హామీలు, 420 మాటలు చెప్పి గద్దెనెక్కారని మండిపడ్డారు. ఈసారి పోలీసోళ్లు ఫొటో తీయడానికి ప్రయత్నిస్తే.. మీరు కూడా ఆ పోలీసు ఫొటో తీయాలని కేటీఆర్ సూచించారు. ‘మా కేసీఆర్ సార్ వస్తుండు.. మీ ఫొటో చూపెడ్తమని చెప్పండి’ అని హితవు పలికారు.
Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ ను కలిశారు. సిరిసిల్లలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతమైన సందర్భంగా కేటీఆర్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ముదిరాజులకిచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ తన సిరిసిల్ల పర్యటనలో ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చే హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకపోతే ముదిరాజ్ లు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Also Read: నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?