E-Paper
Advertisement

ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!
Advertisement

Telangana Politics: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌దేశంలో రాజ‌కీయాల శైలి వేరు మా ద‌గ్గ‌ర యూనివ‌ర్సిటీ లా కాలేజ్‌, ఆర్ట్స్ కాలేజీ నాయ‌కునిగా ఏబీవీపీలో గెలిచిన వారు త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివ‌ర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణ‌లో బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజ‌కీయాల్లో ఏబీవీపీ ప్ర‌భావం ఉంటే.. రాజ‌కీయాల్లోకాంగ్రెస్ ప్ర‌భావం ఉంటుంది.

2017లో కాంగ్రెస్‌లో చేరా..

నేను 2006లో జ‌డ్పీటీసీ స‌భ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్క‌డ రెండు పార్టీలే ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్ద‌గా సంబంధాలు పెద్దగా లేవు.. ప్ర‌భుత్వంపై పోరాడాలంటే ప్ర‌తిప‌క్ష‌మే మేల‌ని భావించా అందుకే నేను తెలుగుదేశంలో చేరానని అన్నారు. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచానన్నారు.

Advertisement

Also read: ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

2014 ఎన్నిక‌ల త‌ర్వాత..

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నాయ‌క‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ప్రాధాన్యం త‌గ్గిపోయింది. మీరు మంచి నాయ‌కుడు, మీరు నాయుడుతో క‌లిసి ప‌ని చేస్తే తెలంగాణ‌లో ఇబ్బంది అని ప్ర‌జ‌లు చెప్పారు.. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది.. రాహుల్ గాంధీ, దిగ్విజ‌య్ సింగ్‌, జైరాం ర‌మేశ్ తో పాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత పోటీ కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య పోటీగా మారింది. ఆయ‌న న‌న్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి క‌న్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా. రాహుల్ గాంధీని క‌లిసిన త‌ర్వాత 15 నిమిషాలు మాట్లాడామని అన్నారు. ఆ రోజే ఆయ‌న నా నాయ‌కుడి అని నిర్ణ‌యించుకున్నా రాహుల్ గాంధీకి ఎటువంటి వ్య‌క్తిగ‌త అజెండాలు లేవు.. ఆయ‌న‌కు దేశ‌మే ముఖ్యం.. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా.. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాల‌నుకున్నామన్నారు.

Advertisement

Also read: క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

Tags

Related News

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

‘పోలీసు స్టేషన్‌లో ఎవరి ఫోటో పెట్టాలో తెలుసా?’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్!

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ అధికారి!

ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్ రావు ఫైర్!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..!

Big Stories

Advertisement
×