Gundeninda GudiGantalu Today episode September 12th: రోహిణి ఇంట్లోకి రాగానే ప్రభావతీ రచ్చ రచ్చ చేస్తుంది.. పూజ కోసం నిన్న అంత సిద్ధం చేయమంటే నువ్వేంటి ఎక్కడికి వెళ్లావు రాజు కార్యాలు వెలకబెట్టడానికి వెళ్ళావా అంటూ ప్రభావతి రోహిణి గుక్క తిప్పుకొని ఇవ్వకుండా మాట్లాడి అరుస్తుంది. అయితే రోహిణి మాత్రం నేను బార్ కి వెళ్ళాను అత్తయ్య అని చెప్పగానే ప్రభావతి తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. బార్కు వెళ్ళావా ఇంట్లో పూజ జరుగుతుంటే నువ్వు చేసిన పని ఏంటి కొంచమైనా నీకు సిగ్గుందా అంటూ ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. వెంటనే బాలు కూడా ఇంట్లోకి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది ప్రభావతి.. నేను కూడా బార్ కి వెళ్లొచ్చాను అని చెప్పగానే ప్రభావతి తో పాటు మీనా అందరు కూడా బారుకి వదిన మరిది కలిసి వెళ్లి తాగి రావడమేంట్రా అని ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఎందుకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము తెలుసుకోకుండా ఏం మాట్లాడుతున్నావు అని బాలు అంటాడు..
ఎందుకు వెళ్లారు బారుకు అని సత్యం అడగగానే మేము వెళ్ళలేదు నాన్న మనోజ్ బార్ కి వెళ్తే అక్కడ వాడిని ఎక్కడ పోలీసులు తీసుకుని వెళ్తారు అని ఇంటి పరువు పోకుండా తీసుకుని వచ్చాము అని చెప్తాడు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు అని బాలుని అంటాడు.. నాకు కూడా మనసు ఫోన్ చేస్తే తాగకుండా ఆపడానికి నేను బార్కు వెళ్లాను మావయ్య అని రోహిణి అంటుంది.. అయితే ఏం మనోజ్ ఎక్కడ అని అడిగితే ఇంట్లోకి పాక్కుంటూ రావడంతో అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మనోజ్ కి పరిస్థితి రావడానికి కారణం రోహిణి నేనే అందరూ అనుకుంటారు. రోహిణి వల్లే మనోజ్ ఇలా తాగుబోతు లాగా తయారయ్యాడు అని ప్రభావతి బాధపడిపోతుంది ఇక ఆశీర్వదించమంటే మనోజ్ వెళ్లి రోహిణి కాళ్లు పట్టుకుంటాడు అది చూసిన ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోతుంది. అలా మొత్తానికి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం పూర్తి అయిపోతుంది..
ఇక బాలు, మీనా రాత్రి పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మీ అన్నయ్య బార్ కి వెళ్ళిన విషయం రోహిణికి ఎలా తెలిసింది.. రోహిణి పరిగెత్తుకుంటూ బారుకొచ్చింది అని బాలు అంటాడు. అసలు ఎందుకు ఆమె బార్ కి వెళ్ళింది అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి పై అనుమానం వస్తుంది. మనోజ్ నిజానికి రోహిణికి ఫోనే చేయలేదంట.. కానీ రోహిణి మాత్రం బార్కొచ్చింది. అక్కడ గుణ గాడు ఉండడంతో నాకు కాస్త అనుమానం కూడా మొదలైంది అంటూ బాలు అంటాడు.. అయితే అసలు రోహిణి ఎందుకు వెళ్ళింది అన్న అనుమానం వాళ్ళిద్దరికీ వస్తుంది గుణ వల్లే రోహిణి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా రోహిణి మీద మాత్రం అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. ఇకపోతే మీనా సింగరాజు దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని వచ్చి ఆ ఆర్డర్ ని పూర్తి చేయాలని అనుకుంటుంది..
ఉదయం మీనా చింతామణి భర్త అయినా సింగరాజు దగ్గరికి వెళ్లి నాకు ఒక ఆర్డర్ వచ్చింది. నాకు మీరు డబ్బులు ఇస్తే ఆ ఆర్డర్ ని పూర్తి చేసే మీకు వెంటనే డబ్బులు ఇస్తాను అని అడుగుతుంది.. ఒక కార్పొరేట్ కంపెనీతో డీల్ కుదిరిందండి. అది కచ్చితంగా నేనే తీసుకోవాలి అని అనుకుంటున్నాను మీరు ఏ టైంలో అయినా డబ్బులకి రమ్మని అన్నారు కదా అందుకే నేను వచ్చాను అని అంటుంది. ఈ పోటీలో చింతామణి కూడా ఉంది అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సింగరాజు. పోటీలో చింతామణి ఉంది కాబట్టి నువ్వు తప్పుకోవడమే బెటర్ అమ్మ ఈ ఆర్డర్ నీకు రాదు అంటాడు. ఆ మాట వినగానే మీనా ఫ్యుజులు ఎగిరిపోతాయి.. ఇస్తానని మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చాను అంతేకానీ ఇలా మీరు అంటారని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది మీనా.. నేను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా అని సింగరాజు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం అస్సలు వినదు..
మీ దగ్గరికి నేను డబ్బుల కోసం అని వచ్చాను కానీ మీరు మాత్రం నన్ను ఇలా మాట్లాడి పంపిస్తారని నేను అసలు అనుకోలేదు. అయితే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ చెందామని రెండు ఆ కంపెనీ పెట్టిన ఆఫర్ అని చెప్పగానే మీనా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే నేను ఆ ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. చింతామణికి భయపడే ఆయన ఇలాంటి ఉన్నాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందానే మీ నాకు అనుమానం వస్తుంది. అయితే మీనా మాత్రం ఎలాగైనా సరే ఈ ఆర్డర్ ని పూర్తి చేసి చింతామణికి బుద్ధి వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది..
బాలు కస్టమర్ ఎక్కించుకొని కారులో తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ ఆ కారుని ఆపుతాడు. అయితే నేను అర్జెంటుగా గుడికి తీసుకుని వెళ్లాలి. వదిలేయండి సార్ అని బాలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా సరే.. అరుణ్ మాత్రం ముందు ఊదు అనేసి అంటాడు నేను ఎందుకు ఆగలేదు అని ఎంత చెప్పినా సరే అలా అనడంతో ఆ కస్టమర్లు కూడా వేరే కారు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. ఎందుకు నేనంటే నీకు అంత కోపం నేనేం చేశాను నా కస్టమర్లను పోగొట్టేసావు అని బాధ చాలా కోపంగా ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..