Podarillu Today Episode September 12th : మొత్తానికి నారాయణ కుటుంబాన్ని లోపలికి తీసుకుని వెళ్లి ఒక చోట పడేస్తారు అన్నట్టుగా నారాయణ చాలా ఫీల్ అయిపోతాడు.. మనకు పెళ్ళికొడుకు పేరెంట్స్ అని కూడా లేకుండా తీసుకొచ్చి లోపల పడేసారు ఒక గది లేదు పాడు లేదు అంటున్నారా చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే జయంతి వాళ్ళ మొదటి భర్త రావడంతో ఎంగేజ్మెంట్ గురించి చెప్తుంది జయంతి. ఇక అంతే కాదు నా ఎంగేజ్మెంట్ అయిపోయింత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని కండిషన్ కూడా పెట్టడంతో.. ఆ వ్యక్తి కూడా నేను నీ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఇక జయంతి మొదటి భర్తని చూసి నారాయణ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చివరికి ఏమి మాట్లాడలేక రూమ్ ఎక్కడ అని కనుక్కొని అక్కడికి వెళ్ళిపోతారు.
మనీషా ఈ పెళ్లి జరగకుండా ఉంటే బాగుంటుంది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. థాంక్స్ అయితే మారదు మాట్లాడి ఒకసారి పెళ్లి సంబంధం చెడిపోవాలి అని కోరుకుంటుంది. అయితే మాధవ దగ్గరికి వెళ్లి తన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది కానీ తను మాత్రం ఈ అమ్మాయిని కచ్చితంగా నేను చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనీషా.. అదేవిధంగా తాయారు ఇంట్లోకి రావడంతోనే ఇలాంటి దిక్కుమాలిన సంబంధాన్ని వేడి కోసం ఎందుకు తీసుకొచ్చారు అంటూ పెద్ద రచ్చ చేస్తుంది. వీడికి ఇంకా పెళ్లి జరగదా అమ్మాయి దొరకదా ఎందుకు ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని తయారుచేస్తుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా తయారు ఎంత మాట్లాడుతున్న మౌనంగా ఉండిపోతారు. అయితే వేరే సంబంధం దొరక లేక బడికి ఇలాంటి సంబంధం చేశారు అంటూ తాయారు మాట్లాడిన మాటలకి అందరూ కూడా చాలా ఫీల్ అయిపోతారు. శైలు ఎంగేజ్మెంట్ కి వచ్చినప్పుడు శైలుని చూసి కేశవ సెటైర్ల వర్షం కురిపిస్తాడు.
ఎంగేజ్మెంట్ కోసం అని వచ్చిన శైలుని చూసిన కేశవ ఎంగేజ్మెంట్ నీదా తనదా ఎందుకు నువ్వు ఎందుకు రెడీ చేసి వచ్చావు అని అంటాడు. ఆ మాట వినగానే శైలు ఎంగేజ్మెంట్ బావ గారిది అయితే నేను రెడీ అవ్వకూడదా ఏంటి అని శైలు అంటుంది. రెడీ అవ్వచ్చు కానీ మరీ ఇంతగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని కేశవ అంటాడు. అయితే బావగారు ఎక్కడున్నారు అని అడుగుతుంది శైలు. అదేంటి కొత్తగా పిలుపు మారింది బావగారు అని అంటున్నావ్ ఏంటి ఆయన పెళ్లయిపోతుంది కదా నెక్స్ట్ మన పెళ్లి కదా అందుకే బావ గారు అని ముందే పిలుస్తున్నారు అని శైలు అంటుంది. ఆయన ఎక్కడున్నాడో చెప్పు ముందు వెళ్లి థాంక్స్ చెప్పాలి అని శైలు అడుగుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వదిలి మాట్లాడొచ్చులే ఇప్పుడేం అవసరం లేదని కేశవ ఎంత చెప్తున్నా సరే తనని కలవాల్సిందే అని శైలు మొండిగా ఉంటుంది.
శైలు మాధవ్ దగ్గరికి వెళ్లి థాంక్స్ బావగారు అని మాట్లాడుతుంది. నువ్వు ఏంటమ్మా శైలు ఇంత లేటుగా వచ్చావు నువ్వే ముందుండాలి కదా అని మాధవ అడుగుతాడు.. ఎప్పుడొచ్చిన ఎంగేజ్మెంట్ కన్నా ముందే వచ్చాను కదా అని శైలు అంటుంది. నేను చెప్పిన మాటను మీరు దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని శైలు అంటుంది. ఆ మాట వినగానే కేశవ కి అనుమానం మొదలవుతుంది. సరే అమ్మ మరి నేను ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతాను నువ్వు ఇక్కడే ఉండాలి అని మాధవ అంటాడు ఇక బయటికి రాగానే శైలు నీళ్లు ఆక్కొని వెళ్ళిపోతాడు కేశవ. ఇదంతా నీ వల్లే జరిగిందా అని కొట్టబోతాడు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమైందిరా ఎందుకు కొట్టాలనుకుంటున్నావ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ నువ్వు అని అరుస్తారు.
ఇది చేసిన పని తెలిస్తే మీరు కూడా తనని కొడతారు అని కేశవ్ అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పురా ఎందుకు అమ్మాయిని భయపెడుతున్నావు అని నారాయణ అంటాడు. ఇది అన్నయ్య దగ్గరికి వెళ్లి మీరు తొందరగా పెళ్లి చేసుకోకపోతే మాకు పెళ్లి జరగదు అని చెప్పింది. దానివల్ల అన్నయ్య ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని అందరితో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. తను పెళ్లి చేసుకుంటేనే మనం పెళ్లి చేసుకోవాలి అని నువ్వు కండిషన్ పెట్టావు కదా అందుకే నేను వెళ్లి అతనితో మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడేంటి నీ బాధ అని శైలు అంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. శైలు తన పెళ్లి కోసమేదంతా చేసింది కదా ఇంకా వదిలేయరా అని కేశవ్ అని కంట్రోల్ చేస్తారు.
మనం ఎలాగైనా సరే అన్నయ్య జీవితం కాపాడాలి అంటే ఈ పెళ్లిని ఆపాలి ముందు ఎంగేజ్మెంట్ ని ఎలా ఆపాలు అది ఆలోచిద్దాము అని అందరూ అనుకుంటారు.. అయితే గుడ్డిగా వెళ్లి చక్రిని అందరూ నమ్ముతారు.. చక్రి మాధవ పెళ్లి ఆపాలి అంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటాడు.. ఆ మాట వినగానే చక్కెర ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేసిన చక్రి మాధవ్ గురించి లేనిపోనివి కల్పించి చెప్పి పెళ్లి చెడగొట్టాలని అనుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్తే పెళ్లి ఆగిపోతుందా అని చక్రిని తిడతారు.. అయితే ఈ పెళ్లి ఎలాగైనా జరిగితే బాగుండు అని జయంతి వాళ్ళ తమ్ముడు కూడా అనుకుంటాడు. మరి చక్రి చెప్పిన మాటల్ని జయంతి వాళ్ళ నాన్న వెంటాడా? పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడా..? అక్కడ తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..