E-Paper
Advertisement

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?
Advertisement

Ninnu Kori Today Episode September 12: విరాట్ కోసం చంద్ర వెతుకుతూ వెళ్ళిపోతుంది.. అయితే ఏం విరాట్ గురించి తెలిసిన తన ఫ్రెండు చంద్రకు ఫోన్ చేసి హాస్పిటల్లో తన పరిస్థితి గురించి చెప్తాడు. వెంటనే అక్కడికి వెళ్లిన చంద్ర విరాట్ ని ఆ పరిస్థితులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల తన రూపురేఖలు మారిపోయాయని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదే కాదు ఆక్సిడెంట్ వల్ల డాక్టర్ చెప్పిన విషయం విని చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అతనికి ఏమి గుర్తుకులేదు అని చెప్పగానే చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అసలు పిల్లలు లేరని బాధపడుతున్న నాకు నా భర్తని పిల్లాడిలాగా చూసుకునే అవకాశాన్ని దేవుడు ఇప్పించాడేమో అని ఒక వైపు బాధపడుతూనే మరోవైపు తన భర్త బతికాడు అని సంతోషపడుతుంది.

దేవుడు కష్టాలన్ని నాకే ఇస్తాడు..

దేవుడు కష్టాలన్నీ నాకే ఇస్తాడు ఎందుకో నేనంటే ఆయనకు అంత ఇష్టమని చంద్ర ఎమోషనల్ అయిపోతుంది. విరాట్ తన ఫ్రెండు మీరేం బాధపడకండి.. ఆ దేవుడు ఏదో ఒక రోజు మీ మంచి మనసుని అర్థం చేసుకొని మీకు మంచి జరిగేలా చేస్తాడు అని చెప్తాడు.. చంద్ర ఎంతగా బాధపడుతున్నా కూడా విరాట్ పరిస్థితి గురించి ఇంట్లో తెలిస్తే అందరూ బాధపడిపోతారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పకుండా ఉండాలి అంటే మీరు నాకు సహాయం చేయాలి అని తన ఫ్రెండ్ దగ్గర మాట తీసుకుంటుంది చంద్ర. ఇక చంద్రని అర్థం చేసుకున్న తన ఫ్రెండ్ అలాగే అని మాట ఇస్తాడు.

గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి..

Advertisement

క్రాంతి తన ఫ్రెండ్ ద్వారా తన తల్లికి నయం చేయడానికి డాక్టర్ల గురించి తెలుసుకొని ఇంటికి చాలా సంతోషంగా వస్తాడు. సంతోషంగా పిలుస్తాడు క్రాంతి.. అక్కడికొచ్చిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఏమైంది క్రాంతి ఎందుకు నువ్వు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు.. క్రాంతి వాళ్ళ నాన్న కూడా ఏమైందిరా ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఏదైనా గుడ్ న్యూస్ తీసుకొని వచ్చావా అని అడుగుతాడు.. అవును నాన్న అమ్మకి ఎటువంటి స్టన్స్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారట ఆయన ఆస్ట్రేలియా నుంచి ఇవాళ వస్తున్నారట అనే చెప్పగానే అవునా చాలా మంచి మాట చెప్పావు. జగదీశ్వర్ కి నయమవడం అందరికీ సంతోషమే కదా అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.

జగదీశ్వరి మాటతో షాక్..

జగదీశ్వరి చెప్పిన మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అసలు ఏమైంది ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అని అందరూ ఒక్కసారిగా అడుగుతారు.. నేను ఈ ట్రీట్మెంట్ ని చేయించుకొని అని చెప్తున్నాను కదా మళ్లీ ఎందుకు పదేపదే నన్ను అడిగే విసిగిస్తారు అని జగదీశ్వరి అంటుంది. వదినకి ఇలా అయిపోతుందని బాధపడుతున్న మాకు ఇప్పుడు క్రాంతి చెప్పిన న్యూస్ అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. కానీ మీరు ఎందుకు ఇలా అంటున్నారు వదినా అని అందరూ అడుగుతున్న సరే.. తను మాత్రం నాకు విరాట్ ఉంటేనే చేయించుకుంటాను అని అంటుంది. విరాట్ చంద్ర ఇద్దరు నా కళ్ళముందు ఉంటేనే నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని కండిషన్ పెడుతుంది ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

చంద్ర ప్లాన్ సక్సెస్..

Advertisement

చంద్ర హాస్పిటల్లో విరాట్ కోసం బాధపడుతూ ఉండగా తన మామయ్య ఫోన్ చేసి మీ అత్తయ్య కోసం క్రాంతి ఒక డాక్టర్ గురించి చెప్పాడమ్మా కానీ మీ అత్తయ్య మాత్రం విరాట్ నువ్వొస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్తుంది నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి వెంటనే రావాలి అని అంటాడు. చంద్ర సరే మావయ్య గారు నేను వెంటనే ఇంటికి వస్తాను అని అంటుంది. ఇక విరాట్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్లో పరిస్థితి గురించి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది చంద్ర. అయితే చంద్ర ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లావు.. విరాట్ నువ్వు ఇంట్లో ఉంటేనే తను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అంటుంది. అనగానే అత్తయ్య ఏంటి అత్తయ్య మీరు ఇలా చిన్న పిల్లలాగా చేస్తున్నారు అని చంద్ర అడుగుతుంది.. మీ కోసం క్రాంతి చాలా కష్టపడి ఈ డాక్టర్ గురించి తీసుకొని వచ్చారు మీరు ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు అని చంద్ర అడుగుతుంది.

మనసు మార్చుకున్న జగదీశ్వరి..

చంద్ర ఎందుకత్తయ్య మీరు ఇలా మారిపోయారు మీ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్లారు కదా.. నేను తన ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాను.. అంతే తప్ప వేరేది ఏమీ లేదు అని చంద్ర ఎంత చెప్పినా సరే జగదీశ్వరి వినదు. మీ అబ్బాయికి ఫోన్ చేస్తాను మీరే మాట్లాడండి అని అంటుంది. ఇక విరాట్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసిన చంద్ర జరిగిన విషయాన్ని చెప్తుంది ఇక అతను అర్థం చేసుకొని విరాట్ లాగా మాట్లాడి జగదీశ్వరి ట్రీట్మెంట్ కోసం ఒప్పిస్తాడు. మొత్తానికి చంద్ర ప్లాన్ సక్సెస్ అవ్వడంతో అందరూ సంతోషంగా ఉంటారు.. కానీ చంద్ర మాత్రం గదిలోకి వెళ్లి ఒంటరిగా బాధపడిపోతూ విరాట్ ఉన్నాడని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. విరాట్ కోసం చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో శాలినీకి నిజం తెలిసిపోతుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Related News

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Podarillu : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Big Stories

Advertisement
×